భాగ్ సాలే టీమ్ కు మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ విశెస్

శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి నాయికగా కనిపించనుంది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో  క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. సినిమా ట్రైలర్ చూసి బాగుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – భాగ్ సాలే సినిమా ట్రైలర్ బాగుంది. శ్రీసింహా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఏర్పర్చుకుంటున్నాడు. కామెడీ, మాస్, ఎంటర్ టైనింగ్ తో పాటు క్రైమ్ అంశాలతో సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు. శ్రీసింహా కీరవాణి గారి అబ్బాయి అని అతను హీరోగా పేరు తెచ్చుకునే దాకా నాకు తెలియదు. వారసుడిగా కాకుండా తను స్వతహాగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు. కీరవాణి గారికి పేరు తెచ్చేంతగా గుర్తింపు సంపాదించుకోవాలని కోరుకుంటున్నా. అలాగే కాలభైరవ అంటే చరణ్ కు చాలా ఇష్టం. వీరిద్దరు మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఇకపైనా మంచి అవకాశాలతో తమ ప్రతిభను చాటుకోవాలి. దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండంగా ఈ సినిమాను రూపొందించాడు. అలాగే నిర్మాత అర్జున్ దాస్యన్ మంచి ప్రయత్నం చేశాడు. ఈ సినిమా జూలై 7న విడుదలవుతోంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాడు. అన్నారు.

Megastar Chiranjeevi all praises for team Bhaag Saale; conveys best wishes

Sri Simha Koduri’s Bhaag Saale is all set to hit the screens soon and is one of the much-hyped films in the recent times in which Neha Solanki will be seen playing the female lead. The film is a crime comedy under the direction of Praneet Brahmandapalli. The film is produced by Arjun Dasyan, Yash Rangineni and Kalyan Singanamala with Big Ben and Cine Valley Movies Association under the banner of Vedansh Creative Works. Bhag Saale is gearing up for release on July 7. Megastar Chiranjeevi recently expressed his best wishes to the film team and the trailer of the movie was appreciated by him.

Speaking on this occasion, Megastar Chiranjeevi, “Bhaag Saale movie trailer is very good. Sri Simha is creating an identity for himself by doing films with comedy, mass, entertainment and crime themes. I didn’t know Sri Simha was Keeravani’s boy until he became famous as a hero. Instead of being an heir, he is trying to grow himself. Also, Charan likes Kalabhairava. Both of them got success with the movie Mathhu Vadalara. They should show their talent with better opportunities. Director Praneet has brilliantly made this movie. Also, producer Arjun Dasyan has made a good effort. The movie is releasing on July 7. I wish the best to the team.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *