“నీ వెంటే నేను” అంటున్న “సినీబజార్”

అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా
“సినీబజార్ డిజిటల్ థియేటర్”లో
విడుదలవుతున్న “నీ వెంటే నేను”

ఇద్దరు సాప్ట్వేర్ ఇంజినీర్లు హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న విభిన్న ప్రేమ కథా చిత్రం “నీ వెంటే నేను”. శ్రీవెంకట సుబ్బలక్ష్మి మూవీస్ పతాకంపై అన్వర్ దర్శకత్వంలో వెంకట్రావు మోటుపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంతో బాలు – స్నేహ హీరోహీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. వీరిద్దరూ స్వతహా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కావడం విశేషం. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ క్లీన్ లవబుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం “సినీబజార్” (CINEBAZZAR) అనే డిజిటల్ థియేటర్ లో అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా 177 దేశాల్లో విడుదల కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత వెంకట్రావు, హీరో బాలు, హీరోయిన్ స్నేహ, సినీ బజార్ అధినేత రత్నపురి వెంకటేష్ భాస్కర్ పాల్గొన్నారు. నిత్యా నాయుడు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

సినీబజార్ సి.ఇ.ఓ రత్నపురి వెంకటేష్ భాస్కర్ మాట్లాడుతూ… “నీ వెంటే నేను” చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండడం చాలా ఆనందంగా ఉంది. పైరసీకి ఎట్టి పరిస్థితుల్లో తావులేని విధంగా సినీ బజార్ ను తీర్చిదిద్ధాం” అన్నారు. “నీ వెంటే నేను” వంటి క్లీన్ ఎంటర్టైనర్ తో పరిచయం అవుతుండటం పట్ల హీరో బాలు, హీరోయిన్ స్నేహ సంతోషం వ్యక్తం చేశారు. వెంకట్రావు, గణేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, ఎడిటర్ : శంకర్ బోలం, సంగీతం: శశాంక్ భాస్కరుని, నిర్మాత: వెంకట్రావు మోటుపల్లి, ఛాయాగ్రహణం – దర్సకత్వం: అన్వర్, “సినీబజార్” విడుదల!!
Nee Vente Nenu to release in Cine Bazzar digital theatres on October 6

Nee Vente Nenu is a unique love story that marks the coming together of two software engineers. Balu and Sneha. Nee Vente Nenu marks their debut. Anwar directed the film, which was produced by Venkatrao Motupalli under the banner of Sri Venkata Subbalaxmi Movies. Nee Vente Nenu explores a unique dimension of love. The clean, lovable entertainer will be released in a digital theatre named Cine Bazzar. The release is planned on October 6 in 177 countries.

Ahead of the release, the team interacted with the media in Prasad Labs, Hyderabad. Producer Venkatrao, hero Balu, heroine Sneha, and Cine Bazzar head R.V. Bhaskar took part in the media interaction. Nithya Naidu acted as the anchor. Cine Bazzar C.E.O. said, “I am happy to start my journey in the Telugu film industry through Nee Vente Nenu. We have designed Cine Bazzar in such a manner that it protects films from piracy.” Hero Balu and heroine Sneha expressed their contentment for getting introduced to Tollywood with a film like Nee Vente Nenu. Venkatrao and Ganesh essayed pivotal roles in the movie.

P.R.O: Dheeraj – Appaji
Editor: Shankar Bholam
Music Director: Shashank Bhaskaruni
Producer: Venkatrao Motupalli
Director – Cinematographer: Anwar
Release by: Cine Bazzar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *