‘మాధవే మధుసూదన’ ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది – దర్శక, నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు

తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే‌ జంటగా నటించిన సినిమా ‘మాధవే మధుసూదన’. ఈ చిత్రాన్ని సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తూ దర్శకత్వం వహించారు బొమ్మదేవర రామచంద్ర రావు. ఈ మూవీని బొమ్మదేవర శ్రీదేవి సమర్పిస్తున్నారు. ఈ నెల 24 ‘మాధవే మధుసూదన’ సినిమా థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో

యాక్టర్ సుమన్ మాట్లాడుతూ – ‘మాధవే మధుసూదన’ సినిమాను దర్శకుడు బొమ్మదేవర రామచంద్ర రావు చాలా క్లారిటీగా రూపొందించారు. ఆయనకు చాలా అనుభవం ఉంది. ఎంతోమంది దర్శకులను చూశారు. ప్రతి సీన్ తెరకెక్కించేప్పుడు బొమ్మదేవర రామచంద్ర రావు అనుభవం నాకు కనిపించింది. కెమెరామెన్ వాసు ప్రతి ఫ్రేమ్ ను చక్కగా పిక్చరైజ్ చేశారు. ఏ సినిమా బాగా రావాలన్నా డైరెక్టర్, స్టోరి, టెక్నీషియన్స్ కీలకం. ఈ సినిమాకు ఆ టీమ్ బాగా కుదిరింది. ఆర్టిస్టులు కూడా కొత్త వాళ్లు అయినప్పటికీ బాగా ప్రిపేర్ అయి నటించారు. ఈ సినిమాతో బొమ్మదేవర రామచంద్రరావు తన కొడుకు తేజ్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. అతను మంచి హీరో అవుతాడు. డ్యాన్సులు, ఫైట్స్, ఎమోషన్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ బాగా పర్ ఫార్మ్ చేస్తున్నాడు. అతనికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. హీరో తేజ్ వర్క్ షాప్స్ చేసి తన క్యారెక్టర్ లోని మ్యానరిజమ్స్, డైలాగ్స్ ఇంప్రెసివ్ గా చెప్పాడు. ఫాదర్ డైరెక్ట్ చేస్తున్నాడు అని కాకుండా ఒక డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తున్నట్లు ఎన్ని కరెక్షన్స్ చెప్పినా తేజ్ చేశాడు. హీరోయిన్ పర్ ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. రామచంద్రరావు గారు మిగతా హీరోలతో కూడా సినిమాలు చేయాలి. వికాస్ చేసిన పాటలు చాలా బాగుంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా ఇది. థియేటర్స్ కు వెళ్లి చూడమని కోరుతున్నా. అన్నారు.

దర్శక, నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు మాట్లాడుతూ – సినిమా ఇండస్ట్రీలో నాకు 45 ఏళ్ల అనుభవం ఉంది. టచప్ బాయ్ నుంచి మేకప్ మెన్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. నాగార్జున గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు అందరు స్టార్ డైరెక్టర్స్ తో అనుబంధం ఏర్పడింది. వాళ్లు సీన్స్ ఎలా చేస్తున్నారు, ఏ షాట్ ఎలా పిక్చరైజ్ చేస్తున్నారు అనేది పరిశీలించేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి డైరెక్షన్ చేయాలనే కోరిక ఉండటం ఇందుకు కారణం. నేను కూడా ఇలా ఏదో ఒకరోజు డైరెక్షన్ చేయాలని కోరుకున్నాను. మంచి కథ సిద్ధం చేసుకుని కొందరు హీరోలను అప్రోచ్ అయ్యాను. నేనే డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా చేస్తానని చెప్పడంతో వాళ్లలో ఏవైనా సందేహాలు కలిగి ఉండొచ్చు. లేదా రిస్క్ ఎందుకని అనుకోవచ్చు. వాళ్లు సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. అప్పుడు మా అబ్బాయినే హీరోగా పెట్టి సినిమా చేయాలనుకున్నాను. నేను వెళ్లి మా అబ్బాయి తేజ్ ను అడిగితే ..అతనికి కూడా మనసులో హీరో కావాలని ఉంది. కానీ నేను ఏమంటానో అని చెప్పడం లేదని తెలిసింది. అలా కాలేజ్ పూర్తయ్యాక ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చి మా అబ్బాయి తేజ్ హీరోగా ఈ సినిమా స్టార్ట్ చేశాను. నేను ఆశించినట్లే అబ్బాయి బాగా పర్ ఫార్మ్ చేశాడు. హీరోయిన్ కూడా ఆకట్టుకునేలా నటించింది. మా సినిమాటోగ్రాఫర్ వాసు నేను అనుకున్నట్లుగా సీన్స్ తీశాడు. మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ నాలుగు మంచి పాటలు ఇచ్చాడు. పాట సందర్భం తెలుసుకుని పర్పెక్ట్ గా ట్యూన్ చేశాడు. సినిమాలో ఎలాంటి వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. మా సినిమా బాగా చేశామని మేము చెప్పుకోవడం కాదు మీరు చూసి రెస్పాన్స్ ఇస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – బొమ్మదేవర రామచంద్రరావుతో మన జర్నలిస్ట్ లకు దశాబ్దాలుగా మంచి రిలేషన్ కొనసాగుతోంది. చంద్ర అని ఆయన్ను పిలుచుకుంటాం. ఆయనకు మేకప్ మెన్ గా అపారమైన అనుభవం ఉంది. ఈ అనుభవంతో దర్శకుడిగా ఒక మంచి సినిమా రూపొందించాలని ఆయన చేసిన ప్రయత్నమే ఈ ‘మాధవే మధుసూదన’ సినిమా. మంచి పొయెటిక్ టైటిల్ తో వాళ్ల అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా చేశారు. ఒక డెబ్యూ డైరెక్టర్, డెబ్యూ హీరోతో సినిమా చేయడం, అదీ వాళ్లిద్దరు తండ్రీ కొడుకులు కావడం విశేషం. ఈ సినిమా కంటెంట్ చూస్తే తేజ్ ఒక ఎక్సీపిరియన్స్ ఉన్న యాక్టర్ లా నటించాడు. కొత్త హీరో అనే భయం అతనిలో ఎక్కడా కనిపించలేదు. అలాగే సుమన్ గారు ఈ సినిమాలో మంచి రోల్ చేశారు. హీరో ఫ్రెండ్స్ గా చేసిన వాళ్లు కూడా బాగా నటించారు. హీరోయిన్ ప్రతిభావంతంగా నటించింది. చంద్ర కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ నెల 24న రిలీజ్ అవుతున్న ‘మాధవే మధుసూదన’ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైలాగ్స్ రైటర్ సుదర్శన్ మాట్లాడుతూ – ‘మాధవే మధుసూదన’ చందమామ లాంటి ఒక అందమైన ప్రేమ కథ. ఇలాంటి లవ్ స్టోరీ తెలుగు తెరపై ఇప్పటిదాకా రాలేదు. సినిమాను రామచంద్రరావు గారు చక్కగా రూపొందించారు. కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా ప్రతి క్రాఫ్ట్ పనితనం సినిమాకు హైలైట్ అవుతుంది. ఈ సినిమాతో తేజ్ హీరోగా పేరు తెచ్చుకుంటాడు. హీరోయిన్ కు కూడా ఫేమ్ వస్తుంది. ఈ నెల 24న రిలీజ్ అవుతున్న ‘మాధవే మధుసూదన’ సినిమాను సకుటుంబంగా ప్రేక్షకులు చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

యాక్టర్ నవీన్ నేని మాట్లాడుతూ – ‘మాధవే మధుసూదన’ సినిమాలో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. హీరో ఫ్రెండ్స్ గా మేము చేసిన సీన్స్ అన్నీ బాగా వచ్చాయి. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన చంద్ర గారికి థ్యాంక్స్. ఆయనతో పనిచేస్తున్నప్పుడు మా స్కూల్ లో హెడ్ మాస్టర్ గుర్తొచ్చారు. సెట్ లో అంత స్ట్రిక్ట్ గా ఉండేవారు. అయితే ఆయనతో మా అందరికీ మంచి అనుబంధం ఏర్పడింది. సినిమా అంతా ఎంజాయ్ చేస్తూ చేశాం. చంద్ర గారికి ఉన్న ఎక్సీపిరియన్స్ తెలుసు కాబట్టి ఫలానా హీరోలు వెయిట్ పెరగకుండా ఎలాంటి డైట్ తీసుకుంటారని అడిగేవాడిని. ఆయన సరదాగా చెప్పేవారు. హ్యాపీగా మూవీలో జర్నీ చేశాం. ‘మాధవే మధుసూదన’మంచి మూవీ అవుతుంది. హీరోగా తేజ్ పేరు తెచ్చుకుంటాడు. అన్నారు.

యాక్టర్ రవి శివతేజ మాట్లాడుతూ – ఈ సినిమాలో నేను, నవీన్ హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేశాం. ఆ సీన్స్ చూశాం కాబట్టి చెబుతున్నా. చాలా బాగా వచ్చాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు ‘మాధవే మధుసూదన’ఒక మంచి సినిమాగా పేరు తెచ్చుకుంటుంది. ఈ సినిమా గురించి స్టార్టింగ్ ఎండింగ్ అంతా చంద్ర గారే. ఆయన మంచి డైరెక్టర్ మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా. నన్ను ఒక కొడుకులా చూసుకున్నారు. వాళ్ల ఫాదర్ డైరెక్టర్ అని కాకుండా తేజ్ చాలా ప్రొఫెషనల్ గా కష్టపడి పనిచేశాడు. ఈ నెల 24న థియేటర్స్ లో చూడండి. మేము చెప్పడం కాదు మంచి సినిమా చేశామని ఫస్ట్ షో అయ్యాక మీరే చెబుతారు. అన్నారు.

హీరో తేజ్ బొమ్మదేవర మాట్లాడుతూ – మా ‘మాధవే మధుసూదన’ ప్రెస్ మీట్ కు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన సుమన్ గారికి, జర్నలిస్ట్ ప్రభు గారికి, మీడియా వారికి థ్యాంక్స్. ఈ నెల 24న థియేటర్స్ లోకి మా సినిమా వస్తోంది. మీరంతా ఫ్యామిలీతో కలిసి చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. ‘మాధవే మధుసూదన’తో ఒక మంచి ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నానికి మీ ఆదరణ లభిస్తుందని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు : తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే‌ తదితరులు

టెక్నికల్ టీమ్
బ్యానర్ : సాయి రత్న క్రియేషన్స్
సమర్పణ : బొమ్మదేవర శ్రీదేవి
దర్శక నిర్మాత : బొమ్మదేవర రామచంద్ర రావు
సంగీతం : వికాస్ బాడిస
కెమెరామెన్ : వాసు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మానుకొండ మురళీ
పీఆర్వో : సాయి సతీష్, రాంబాబు
‘Madhave Madhusudana’ is a wholesome family entertainer – director and producer Bommadevara Ramachandra Rao

Tej Bommadevara and Rishiki Lokre played lead roles in the upcoming movie ‘Madhave Madhusudana’ produced and directed by Bommadevara Ramachandra Rao under the banner of Sai Ratna Creations. This movie is presented by Bommadevara Sridevi. ‘Madhave Madhusudana’ will have a grand release in theatres on the 24th of this month. On this occasion, a press meet was arranged at the Hyderabad Film Chamber.

While speaking at the occasion, actor Suman said, “Bommadevara Ramachandra Rao made ‘Madhave Madhusudana’ with a lot of clarity. He has a lot of experience which I saw while shooting each scene. Even though the artists are newcomers, they have performed well. Bommadevara Ramachandra Rao is introducing his son Tej as a hero with this movie. He will become a good hero. He is performing all the elements- dances, fights, emotion, and comedy well. Ramachandra Rao should make films with other heroes as well. This is a movie that can be enjoyed with the whole family. I wish everyone to go to the theatre and watch it.”

Director and producer Bommadewara Ramachandra Rao said, “I have 45 years of experience in the film industry. From Touchup Boy to a make-up man, I got good recognition in the industry. While working under Nagarjuna sir, I got good association with all the star directors. I used to observe how they were crafting scenes. The reason for this is that I have a desire to direct films since my childhood. I prepared a good story and approached some heroes. As I wanted to direct and produce, they may have doubts about my abilities or they might felt it risky. They did not come forward to do the film. Then I wanted to make a film with my son as the hero. After Tej was done with his studies, I started giving him training for a year. He performed well as I expected. The heroine also acted impressively. There is no vulgarity and double-meaning dialogues in the movie. The whole family can watch it together.”

Journalist Prabhu said, “Our journalists have been having a good relationship with Bommadevara Ramachandra Rao for decades. We call him Chandra. He has vast experience as a makeup man. This movie ‘Madhave Madhusudana’ is his attempt to make a good movie as a director with this experience. He made a movie with his son as a hero with a good poetic title. Looking at the content of this movie, Tej acted like an experienced actor. Also, Suman played a good role in this movie. Chandra will also be seen in a key role in this movie. I want the movie ‘Madhave Madhusudana’ which is releasing on 24th of this month to become a big hit.”

Dialogue writer Sudarshan said, “’Madhave Madhusudana’ is a beautiful love story like Chandamama. Such a love story has not come on the Telugu screen till now. The movie is well-made by Ramachandra Rao. Every craft like camera, music, and editing is the highlight of the film. Tej will become popular as a hero with this movie.”

Actor Naveen Neni said, “I played an important role in the movie ‘Madhave Madhusudana’. All the scenes we did as hero friends were good. Thanks to Chandra Garu for giving me the opportunity to act in this movie. We enjoyed the process of doing the movie.”

Actor Ravi Siva Teja said, “Naveen and I have played the characters of hero friends in this movie. ‘Madhave Madhusudana’ will be recognized as a good movie. Chandra Garu is not only a good director but also a good human being. He treated me like a son. Tej is very professional and hardworking.”

Hero Tej Bommadevara said, “Thanks to Suman Garu, journalist Prabhu Garu and the media who came to bless us at our ‘Madhave Madhusudana’ press meet. Our movie is coming to theatres on the 24th of this month. I wish you all will watch the movie with your family and cherish it. We made a good attempt with ‘Madhave Madhusudana’. Hope that effort will get your support.”

Cast: Tej Bommadevara, Rishika Lokre and others

Technical Crew:
Banner: Sai Ratna Creations
Presented by: Bommadevara Sridevi
Director & Producer: Bommadevara Ramachandra Rao
Music: Vikas Badisa
Cameraman: Vasu
Executive Producer: Manukonda Murali Krishna
PRO: Sai Satish, Rambabu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *