హీరో నిఖిల్ సిదార్థ్‌ చేతుల మీదుగా… మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా చిత్రం ట్రైల‌ర్‌ విడుద‌ల

ఈ న‌గ‌రానికి ఏమైంది, మీకు మాత్ర‌మే చెబుతా, సేవ్ టైగ‌ర్ చిత్రాల్లో క‌మెడియ‌న్‌గా పాపులారిటీ సంపాందించుకుని, త‌న‌కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం. అయితే తాజాగా ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రంలో అత‌ని పాపుల‌ర్ డైలాగ్ అయిన మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా టైటిల్‌తోనే అభిన‌వ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. వైశాలి రాజ్ హీరోయిన్‌. కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాక‌పంపై తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వంలో భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 23న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. కాగా శ‌నివారం ఈ చిత్రం ట్రైల‌ర్‌ను హీరో నిఖిల్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా

హీరో నిఖిల్ మాట్లాడుతూ ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమా చూసిన త‌రువాత అంద‌రూ అభిన‌వ్ లాంటి ఫ్రెండ్ కావాల‌ని అనుకుంటారు. సెట్‌లో అంద‌ర్ని న‌వ్విస్తుంటారు. ఆయ‌న‌లో చాలా షేడ్స్ వున్నాయి. స్నేహితుడిగా అత‌నంటే చాలా ఇష్టం. విడుద‌ల‌కు ముందే ఈ సినిమాను కొంత మందికి చూపించారు. వాళ్లు చాలా పాజిటివ్‌గా స్పందించార‌ని తెలిసింది. వాళ్ల రివ్యూ తెలుసుకుని ఈ ఈవెంట్‌కు వ‌చ్చాను. త‌ప్ప‌కుండా చిత్రం ప్రేక్ష‌కుల నుంచి కూడా మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని అనుకుంటున్నాను. మీరంద‌రూ సినిమా చూస్తే నేను ఈ సినిమా ఈవెంట్‌కు ఎందుకు వ‌చ్చానో తెలుస్తుంది. అభిన‌వ్ గోమ‌ఠంకు ఈ చిత్రం హీరోగా మంచి బిగినింగ్‌ను అందించాల‌ని సినిమా పెద్ద హిట్ అవ్వాల‌ని ఆశిస్తున్నాను అన్నారు.

అభిన‌వ్ గోమ‌ఠం మాట్లాడుతూ ఇలాంటి వేడుక‌ల‌కు చాలా సార్లు వ‌చ్చాను. కానీ ఇప్పుడు ఇది నా వేడుక కాస్త ఒత్తిడిగా వుంది. ఇది నా లైఫ్ లో స్పెష‌ల్ మూమెంట్ ఇది. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు తిరుప‌తి రావు నాకు ఈ అవ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌. ఈ సినిమాలో పాత్ర‌లు అన్ని ఎంతో స‌హజంగా వుంటాయి. నాకు హీరోగా చాలా ఆఫ‌ర్లు వచ్చాయి. కానీ నాకు త‌గ్గ క‌థ కోసం ఎదురుచూసి ఈ సినిమాను ఎంచుకున్నాను. పాన్ ఇండియా స్టార్ నిఖిల్ నాకు మంచి స్నేహితుడు. ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రంలో నా పాత్ర చూసి నిఖిల్ నాకు ఫోన్ చేసి త‌న సినిమాలో ఆఫ‌ర్ ఇచ్చాడు. నిఖిల్‌తో క‌లిసి స్పై చిత్రంలో క‌లిసి న‌టించాను. ఆ చిత్రం షూటింగ్‌లో నిఖిల్ నాకు క్లోజ్ అయ్యాడు. ఆయ‌న ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల కావ‌డం ఆనందంగా వుంది. త‌ప్ప‌కుండా ఈ చిత్రం త‌ప్ప‌కుండా అంద‌రికి న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం వుంది. ఫిబ్ర‌వ‌రి 23న చిత్రాన్ని అంద‌రూ థియేట‌ర్ల‌ల్లో ఫ్యామిలీతో చూడాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ద‌ర్శ‌కుడు తిరుప‌తి రావు మాట్లాడుతూ నేను ఈ రోజు ద‌ర్శ‌కుడుగా మీ ముందుకు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం నిర్మాత కాసుల భ‌వానీ గారు. చిన్న సినిమాను కంటెంట్ బాగుంటే ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఆద‌రిస్తారు. ఆ కోవ‌లోనే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను. నిఖిల్ న‌టించిన సూర్య వ‌ర్స‌స్ సూర్య చిత్రానికి నేను సెట్ అసిస్టెంట్‌గా ప‌నిచేశాను. ఈ రోజు నా ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న సినిమాకు నిఖిల్ గారు అతిథిగా రావ‌డం ఆనందంగా వుంది అన్నారు.

నిర్మాత కాసుల భ‌వాని మాట్లాడుతూ హీరో నిఖిల్ అడ్గ‌గానే ఈ వేడుకు అతిథిగా రావ‌డం ఆనందంగా వుంది. యాడ్ ఏజెన్సీ నేప‌థ్యంతో నిర్మాతగా మారాను. ఆ అనుభ‌వంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. రామ్‌మోహ‌న్ రెడ్డి గారి స‌హ‌కారంతో ఈ సినిమాను నిర్మించాం. ఈ రోజు సినిమా విడుద‌ల వ‌ర‌కు మా జ‌ర్నీలో ఎన్నో అనుభ‌వాలు వున్నాయి. ఈ సినిమా కోసం మొద‌ట అనుకున్న న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం. అంద‌రూ త‌ప్ప‌కుండా ఫ్యామిలీతో చూడ‌ద‌గ్గ చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా చిత్రం అన్ని వ‌ర్గాల ఆద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌కం వుంది. అన్నారు. ఈ వేడుక‌లో రామ్‌మోహ‌న్ రెడ్డి, అలీ రైజా, లావ‌ణ్య‌, మాట‌ల ర‌చ‌యిత రాధామోహ‌న్‌, కెమెరామెన్ సిద్దార్థ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *