రవి కృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల, ప్రమోదిని ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘ది బర్త్ డే బాయ్’. వెంకీ, మణి, రాజా అశోక్, అరుణ్, రాహుల్ అనే మరో ఐదుగురు యువ నటులు ఇందులో నటించారు. బర్త్ డే బాయ్ గా వెంకీ ఇందులో బాలు పాత్ర పోషించారు. ఈ చిత్రానికి విస్కీ దర్శకత్వం వహించగా… అతని స్నేహితుడు భరత్ నిర్మాతగా వ్యవహరించారు. వీరిద్దరూ యూఎస్ రిటర్న్స్. అక్కడే ఉద్యోగం చేసి… 2016లో జరిగిన ఓ రియల్ ఇన్స్ డెంట్ బేస్డ్ గా కథను రాసుకుని… దానిని వెండితెరపై చూపించాలనే ఆసక్తితో ఇండియాకు వచ్చి ఈ సినిమాను తీశారు. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ ఫుల్, ఫ్యామిలీడ్రామా అండ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ బర్త్ డే బాయ్ ఆడియన్స్ ను ఏ విధంగా ఆకట్టుకున్నాడో రివ్యూ చదువుకుని తెలుసుకోండి.
కథ: బాలు(వెంకీ), అర్జున్(మణి), వెంకట్(రాజా అశోక్), సాయి(అరుణ్), సత్తి(రాహుల్)… ఐదు మంది యూఎస్ లో రూమ్మేట్స్. అందరూ సరదాగా గడిపేస్తూ ఉంటారు. ఎంతో జాలీగా గడిపేస్తుంటారు. ఇలా సరదాగా ఉండే వీళ్లు… బాలు బర్త్ డేను చాలా గ్రాండ్ గా బర్త్ డే బంప్స్ తో జరపాలనుకుంటారు. అనుకున్నట్టే అదే రోజు రాత్రి బాలు బర్త్ డే వేడుకులకు అన్ని సిద్ధం చేసుకుంటారు. కేకు, మందు, గిఫ్ట్స్ ఇలా అన్ని సిద్ధం చేసి.. బాలుకి మంచి గుర్తుండిపోయేలా వేడుకలను చిల్ వాతావరణంలో జరుపుతారు. అయితే బాలుని ఆటపట్టించే క్రమంలో అతన్ని నలుగురు నలువైపులా కాళ్లు చేతులు పట్టుకుని పైకి ఎత్తి బర్త డే బంప్స్ చేస్తుంటగా చేతులు జారి… అతడు ఓ గ్లాసు టేబుల్ పై పడి చనిపోతాడు. ఈ హత్యానేరం నుంచి బయట పడటానికి ఆ నలుగురు యువకులు ఏం చేశారన్నదే మిగతా కథ.
కథ… కథనం విశ్లేషణ: రియల్ ఇన్స్ డెంట్ బేస్ చేసుకుని తెరకెక్కిన కథలు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయనడంలో సందేహం లేదు. కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని దానిని ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలా మలిస్తే చాలు… సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయిపోతుంది. అందుకే దర్శకుడు విస్కీ… ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం జరగిన ఓ రియల్ ఇన్స్ డెంట్ ను మెయిన్ ప్లాట్ గా తీసుకుని… దానికి ఫ్యామిలీ డ్రామాను జోడించి… కాస్త యూత్ ఫుల్ తోనూ… ఆ తరువాత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోనూ సినిమాను రన్ చేసిన విధానం ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇటీవల యూత్ జరుపుకొనే బర్త్ డే వేడుకలు చాలా వింత పోకడలతో చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి. అలి ఎలాంటి దుష్ఫరిణామాలకు దారితీస్తాయో తెలీదు. అయినా యూత్ వాటిని పెడచెవిన పెట్టి… చాలా వింతగా పుట్టినరోజు వేడుకల్లో ప్రవర్తిస్తుంటారు. దానినే ఇందులో చూపించారు దర్శకుడు. ఒళ్లు జలదరించేలా ఉండే నేటి యువత ప్రవర్తనను ఇందులో కళ్లకుకట్టినట్టు చూపించారు. ఇలాంటి ఇన్స్ డెంట్ ను చూసైనా కాస్త యూత్ మారాలి అని ఈ సినిమాలో చూపించిన సంఘటనను చూస్తే అర్థమవుతుంది. చాలా సరదగా వుంటే యూత్ లైఫ్… ఎలా ఒక్కసారిగా విషాదకరంగా మారిపోతుందనేది ఇందులో చూపించారు. అలాగే క్షణికావేశంలో యువత… అమ్మాయిల పట్ల చేసే బిహేవియర్ వల్ల తల్లిదండ్రులకు ఎంత క్షోభను మిగులుస్తుందనేది చూపించారు. దాని వల్ల జరిగే పరిణామాలు ఎలా రెండు కుటుంబాలను విషాదంలో ముంచెత్తుతాయనేది దర్శకుడు చాలా హృద్యంగా తెరపై ఆవిష్కరించారు.
48 గంటల్లో జరిగే కథ కాబట్టి … ఇలాంటి కథలకు గ్రిప్పింగ్ గా ఉండే స్క్రీన్ ప్లే ఉండాలి. అప్పుడే సినిమా ఆద్యంతం ఎంగేజింగ్ గా ఉంటుంది. దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా చాలా పకడ్బంధీగా ఉంది. ఎక్కడా డీవియేట్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. ఎడిటింగ్ కూడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కథకు కావాల్సినంత ఖర్చును నిర్మాత వెనుకాడకుండా పెట్టేశారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.
ఇందులో రవికృష్ణ, సమీర్ మళ్లా… మరో ఐదుగురు యువ నటుల నటన కథకు తగ్గట్టుగా ఉంది. రాజీవ్ కనకాల పాత్ర ఆకట్టుకుంటుంది. కుమారుణ్ని కోల్పోయిన తండ్రి ఎలా ఆవేదనతో రగిలిపోతాడో ఇందులో చూపించారు. ఓ తల్లి ఆవేదన ఎలా ఉంటుందో ప్రమోదిని నటనలో కనబడుతుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న చెల్లెలు చనిపోతే ఎలా ఆమె కన్నవారు తల్లడిల్లిపోతారనేదాన్ని రవికృష్ణ, మణి అనే ఇద్దరు అన్నలు పడే ఆవేదనను ఇందులో చూపించారు. ఓవరాల్ గా ‘ది బర్త్ డే బాయ్’… ఆడియన్స్ ను థ్రిల్ కు గురి చేస్తాడు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3