కిరణ్ అబ్బవరం చేసింది వేళ్లమీద లెక్కపెట్టే సినిమాలే అయినా… తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాధించుకున్నారు. అతని సినిమా విడుదలకు సిద్ధమైంది అంటే చాలు… కిరణ్ అబ్బవరం సినిమా ఎలా వుంటుంది అని వాకాబు చేసే స్థితికి చేరుకున్నారు. అయితే ఇటీవల కిరణ్ .. సినిమాలన్నీ కొంత నిరుత్సాహ పరిచాయి. దాంతో ఏదైనా సాలిడ్ కంటెంట్ తో ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా చేయాలనుకుని ‘క’ సినిమా లాంటి పాన్ ఇండియనా కంటెంట్ తో వచ్ఛారు. ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు పనిచేయడం విశేషం. సందీప్, సుజిత్ ఓ వైవిధ్యమైన కథ.. కథనం చెప్పడంతో ఈ సినిమా చేశానని, క్లైమాక్స్ నచ్చకపోతే ఇక సినిమాలు చేయడం మానేస్తానని సినిమా ప్రమోషన్స్ లో చెబుతూ వచ్చిన కిరణ్ అబ్బవరం… అంచనాలకు తగ్గట్టుగానే క్లైమాక్స్ అంత డిఫరెంట్ గా వుండి ప్రేక్షకుల్ని కట్టిపడేసిందేమో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ: ఉపాధికోసం అని క్రిష్ణగిరికి అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) వెళ్తాడు. చిన్నప్పటి నుంచే పక్కోడి ఉత్తరాలు చదివే అలవాటు వున్న వాసుదేవ్… తపాలా శాఖలో పోస్ట్ మేన్ గా జాయిన్ అవుతాడు. అదే గ్రామానికి చెందిన సత్యభామ(నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. ఆమెతో ప్రేమలో ఉంటూనే ఊళ్లో అమ్మాయిలు తప్పి పోవడం వెనుక వున్న కారణాలను వెతికే పనిలో పడతాడు. అదే గ్రామంలో రాధ(తన్వి రామ్) స్కూల్ టీచర్ గా పనిచేస్తూ వుంటుంది. ఇదే ఊళ్లోనే అభిద్ షేక్ అనే వ్యక్తి ఊళ్లో అమ్మాయిలకు హెల్ప్ చేస్తూ వుంటారు. లాలా అనే ఓ కరుడుగట్టిన ఓ రౌడీ కూడా ఆ ఊళ్లో అమ్మాయిల మాన ప్రాణాలతో ఆడుకుంటూ వుంటారు. ఈ క్రమంలో అసలు ఆ ఊళ్లో అమ్మాయిలను ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు? దాని వెనుక వున్న ముఠాను వాసుదేవ్ ఎలా కనిపెట్టారు? సత్యభామతో, వాసుదేవ్ వివాహం జరిగిందా? వాసుదేవ్ కి, రాధకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అభిద్ షేక్ అమ్మాయిలకు ఎందుకు సహాయం చేస్తూ వుంటారు? కిరాతకంగా ప్రవర్తించే లాలాను కిరణ్ ఏమి చేశాడు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
క… కథ.. కథనం విశ్లేషణ: కథ… కథ పాతదే అయినా… ట్రీట్ మెంట్ డిఫరెంట్ గా వుంటుంది. సినిమా ఎత్తుగడే కొత్తగా వుంటుంది. ఓ టైం ట్రావెలింగ్ మూవీలాగా కాసేపు ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఫస్ట్ హాప్ లో కథలోకి వెళ్లడానికి దర్శకద్వయం చాలా సమయమే తీసుకున్నారు. దాంతో ప్రేక్షకులకి కొంత సినిమా ల్యాగ్ అనే అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఓ సాలిడ్ ట్విస్ట్ ఇవ్వడంతో ప్రేక్షకులు ఔరా అనుకుంటారు. ఇక ద్వితీయార్థం నుంచి సినిమా పరుగులు పెడుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులతో సినిమా చకచక ముందుకు సాగిపోతుంది. సెవెంటీస్ బ్యాక్ డ్రాప్ కావడంతో ఆ థీమ్ కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఫుల్ పవర్ ప్యాక్ యాక్షన్ ఎపిసోడ్స్ తో మాస్ కు కనెక్ట్ అయ్యేలా సినిమాని నడిపించారు. ఇక క్లైమాక్స్ లో ట్విస్ట్ ను రివీల్ చేసిన విధానం… అప్పటి వరకూ ఆడియన్స్ లో ఉన్న ఏ కొద్దో గొప్పో కన్ ఫ్యూజన్, అలసట అన్నీ మటుమాయం అవుతాయి. ప్లాట్ పాతతే అయినా… టేకింగ్ సరికొత్తగా వుంటడంతో ప్రతి ఒక్కరూ సినిమాకి కనెక్ట్ అవుతారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి జోనర్స్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే వుంటాయి. ఈ దీపావళికి సరదాగా ఓ సారి చూసేయండి
కిరణ్ అబ్బవరం నటన గత చిత్రాలకంటే చాలా మెచ్యూర్ గా వుంది. అభినయ వాసుదేవ్ పాత్ర పక్కింటి కుర్రాడిలాగ అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ లో బాగా చేశారు. పాటల్లోనూ తన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. గంభీరమైన సంభాషణలు పలకడంలో ఇంకా డెవెలప్ కావాలి. బేస్ పెంచాల్సిన అవసరం వుంది. అతనికి జోడీగా నటించిన నయన్ సారిక విలేజ్ అమ్మాయిగా లంగావోణిలో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్రెజెన్స్ తో పనిలేకుండా కనిపించిన ప్రతిసారి అందంగా ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. రాధ పాత్రలో నటించిన తన్వి రామ్ కూడా తనపాత్రకు న్యాయం చేశారు. తమిళ నటుడు రెడ్ ఇన్ కింగ్ స్లేను తమిళం కోసమని సుబ్బు అనే కామెడీ పాత్ర చేయించారు కానీ… పెద్దగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వదు. అజయ్ శరణ్య, బలగం జయరాం, అచ్యుత్ కుమార్, అభిద్ షేక్, లాలా పాత్రలు అన్నీ తమ తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
దర్శక ద్వయం సందీప్, సుజిత్ నడిపించిన స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ వుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది. సినిమానికి ఇంకాస్త ట్రిమ్ చేసుంటే మరింత బాగా ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేవారు. సామ్ సీఎస్ బీజీఎం ప్రతి సీన్ ను ఎలివేట్ చేసింది. మాస్ బీట్ సాంగ్ బాగుంది. సెవెంటీస్ బ్యాక్ డ్రాప్ తగ్గట్టుగా విజువల్స్ ను చాలా గ్రాండ్ గా చూపించారు. సిమాటోగ్రఫీ చాలా బాగుంది. తారాగణాన్ని చాలా బాగా చూపించారు. ఆర్ట్ వర్క్ కూడా చాలా యాప్ట్ గా వుంది. చింతా గోపాలక్రిష్ణ ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3