అజయ్ గాడు… రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇందులో హీరోగా నటించిన అజయ్ యే… ఈ చిత్రానికి దర్శకత్వం వహించి… చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ ఏమిటంటే…
అజయ్(అజయ్ కుమార్ కతుర్వార్) ఎలాగైనా ఓ సినిమాను తీసి హిట్టుకొట్టాలని ఎదురు చూస్తుంటారు. అదే సమయంలో ఓ ధనవంతుడి కుమార్తెను ప్రేమిస్తుంటారు. దాంతో అజయ్ కు… ధనవంతుడి నుంచి సమస్యలు ఎదురవుతాయి. దాంతో డాక్టర్ శ్వేత… అజయ్ ను ఈ సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది. మరి అజయ్, శ్వేతల మధ్య ఉన్న ఆ రిలేషన్ ఏంటి? అజయ్ లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తీసుకుంది? అతనికి ఉన్న సినిమా మేకింగ్ డ్రీమ్ నెరవేరిందా? అతనికి ఎదురైన అనుకోని సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
అజయ్ కుమార్ తన నటనతో ఆకట్టుకున్నారు. తన పాత్రను చాలా ఎఫెక్టివ్ గా పోషించి మెప్పించారు. కథకు తగ్గట్టుగా పాత్రను పోషించి ఆకట్టుకున్నారు. అలాగే పాటల్లో కూడా తన మార్కు డ్యాన్స్ తో ఆడియన్స్ ను అలరించారు. భానుశ్రీ తన గ్లామర్ కోషంట్ తో హీరో లవర్ గా ఆకట్టుకుంది. రూపా పాత్రలో ప్రాచి థక్కర్ ఆకట్టుకుంది. వైద్యురాలి పాత్రలో శ్వేత మెహతా ఆకట్టుకుంది. అజయ్ స్నేహితుని పాత్రలో నటించిన అభయ్ బేతిగంటి మెప్పించారు. గతంలో రామన్న యూత్, జార్జిరెడ్డి సినిమాలలో నటించిన ఇతను… ఇందులో కూడా తన మార్కు నటనతో ఆకట్టుకున్నారు. పృథ్వీ దండమూడి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. అజయ్ ను ప్రోత్సహించే అమ్మ పాత్రలో జయశ్రీ రాచకొండ నటించి మెప్పించారు. సెక్యూరిటీ గార్డుగా నటించిన యాదమరాజు పాత్ర కూడా కథకు తగ్గట్టుగా ఉంది.
చిత్ర కథానాయకుని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కాబట్టి… ఈసినిమా కథ, కథనాలన్నీ అజయ్ టేస్ట్ కు తగ్గట్టుగానే యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. మూడు బాధ్యతలు పోషించడం అంటే మాటలు కాదు. అలాంటిది నిర్మాతగా కూడా సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనే చెప్పొచ్చు. ఈ చిత్రంలోని పాటలను కార్తీక్ కొడకొండ్ల, సుమంత్ భట్టు, మనీ జెన్నా కంపోజ్ చేసిన పాటు ఆడియన్స్ ను బాగ అలరిస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ సదాశివుని అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా వుంది. అజయ్ నాగ్, హరి జాస్తి సంయుక్తంగా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విశాల్ కంపోజ్ చేసిన కొరియోగ్రఫీ బాగుంది. మాస్ ఆడియన్స్ ను అలరిస్తుంది.
కథ… కథనం విశ్లేషణ: సినిమా ప్రారంభం అవ్వగానే అజయ్ జీవితంలో జరిగిన అనేక ఉద్విగ్నభరితమైన జీవిత ఘట్టాలు మనకు పరిచయమవుతాయి. ఓ సామాన్యుడు తనకు ఎదురైన అసాధారణ పరిస్థితులను ఎలా అధిగమించారు? అందుకు దోహదపడిన అంశాలు ఏంటి అనేది ఎలాంటి హడావుడి లేకుండా హీరో పాత్రను పోట్రైట్ చేసిన విధానం బాగుంది. అనుకోకుండా హీరో జీవితంలోకి వచ్చిన యువతి వల్ల హీరో ఎలాంటి అనుభూతిని పొందారు? అతని జీవితంలో వచ్చిన మార్పులేంటి అనేది యూత్ కి కనెక్ట్ అయ్యేలా మలిచారు. ఓ చిత్రాన్ని తీయాలనే కోరికతో ఉన్న ఓ సామాన్యుడు అడుగడుగా ఎదుర్కొన్న ఇబ్బందులను ఎలాంటి హడావుడి లేకుండా సిల్వర్ స్క్రీన్ పై చూపించిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. అలాగే ఇలాంటి పాత్ర నుంచి ఓ బాధ్యతతో తన కల అయిన సినిమాని తీయాలనుకునే హీరో పాత్రను యూత్ కు మెచ్చే విధంగా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. చివరగా ఈసినిమా గురించి చెప్పాలంటే… అజయ్ గాడు… మెసేజ్ ఇచ్చే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్… గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3