‘ఈగ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుదీప్… ఆ తరువాత బహుబలి చిత్రంలోనూ నటించారు. వరుసగా రెండు తెలుగు సినిమాల్లో… అందులోనూ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వరుస చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాధించుకున్నారు. దాంతో అప్పటి నుంచి ఆయన కన్నడలో నటించిన చిత్రాలు తెలుగులోనూ అనువాదం అవుతూ… తెలుగు ఆడియన్స్ ను కూడా అలరిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ‘విక్రాంత్ రోణ’ సినిమాతో మంచి హైప్ క్రియేట్ చేశారు. ఆ సినిమాలో జాక్వెలిన్ తో ‘రారా…’ అంటూ వేసిన వీణ స్టెప్స్ ఎవర్ గ్రీన్ సాంగ్ గా మిగిలిపోయింది. దాదాపు రెండేళ్ల తరువాత ఇప్పుడు ‘మాక్స్’ మూవీతో మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ఆల్రెడీ కన్నడలో రిలీజ్ అయి… అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈచిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలావుందో చూద్దాం పదండి.
కథ: ప్రత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తించే సత్తా వున్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్(సుదీప్). అతనిని ముద్దుగా మ్యాక్స్ అని కూడా ప్రత్యర్థులు సంబోధిస్తుంటారు. అలాంటి పోలీస్ ఆఫీసర్ నిత్యం ట్రాన్స్ ఫర్లు, సస్పెన్సన్స్ కు గురవుతూ వుంటారు. ఇందులో భాగంగానే ఓ పోలీస్ స్టేషన్ కు సీఐ హోదాలో ట్రాన్స్ ఫర్ అయి వస్తారు. ఇంకా అక్కడ డ్యూటీలో జాయిన్ అవ్వక ముందు ఆకతాయి వేశాలో వేస్తున్న ఇద్దరు మంత్రుల కుమారులను అరెస్ట్ చేసి సెల్ లో వేసి… ఇంటికి వెళ్లిపోతాడు. అయితే వారిద్దరూ స్టేషన్ లో దారుణంగా చంపబడి వుంటారు. ఈ విషయం మంత్రులకు తెలిస్తే… తమ ప్రాణాలు పోతాయని అర్జున్ కి మొరపెట్టుకుంటారు ఆ స్టేషన్ లోని మిగతా పోలీస్ సిబ్బంది. ఆ మినిస్టర్ కొడుకులు ఎలా చనిపోయారు? వారిని ఎవరు సంపారు? ఈ జంట హత్యల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఆ స్టేషన్ సిబ్బంది ఆడియన డ్రామా ఏమిటి? వారికి అర్జున్ ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? ఈ కథలో క్రైమ్ ఇన్ స్పెక్టర్ రూపా (వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్ స్టర్ గని (సునిల్) పాత్రలు ఏంటి? వారికి, అర్జున్ కి వున్న వైరం ఏమిటి? తదితర విషయాలు తెలియాలంటే ‘మ్యాక్స్’ సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ‘మ్యాక్స్’ మూవీ మొత్తం ఓ రాత్రిలో జరుగుతుంది. రాత్రి మొదలై… తెల్లవారు జామున ముగుస్తుంది. అంటే… ఓ ఏడెనిమిది గంటల పాటు ఉత్కంఠ భరితంగా సాగే యాక్షన్ క్రైం థ్రిల్లర్ మూవీ ఇది. ఇది కొంచెం గతంలో వచ్చిన కార్తీ నటించిన ‘ఖైదీ’మూవీ ఫార్మాట్ ను గుర్తుకు తెచ్చినా… జానర్… టేకింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. సుదీప్ కటౌట్ కి తగ్గట్టుగా కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ ఆడియన్స్ ను బాగా ఎంగేజ్ చేస్తాయి. ఎక్కడా బోరింగ్ లేకుండా సినిమా ఓ రాత్రి మొతం నడిపించడానికి రాసుకున్న గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే… దానికి తోడు సీన్స్ ను ఎలివేట్ చేసే బ్యాగ్రౌండ్ స్కోర్… ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. అందుకోసం రాసుకున్న డ్రామా పార్ట్ ఆకట్టుకుంటుంది. దానికి తోడు సినిమా మీద ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ను ఏమాత్రం తగ్గిపోకుండా వుండేందుకు రాసుకున్న ట్విస్టులు అన్నీ మాస్… క్లాస్ ఆడియన్స్ ను ఔరా అనిపిస్తాయి. డైరెక్టర్ ఏది అనుకున్నారో… దాన్నే తెరమీద డీవియేట్ కాకుండా చూపించారు. అందుకే ఈ సినిమాకి విమర్శకులు సైతం ప్రశంసిస్తూ… సినిమాకి బజ్ ను క్రియేట్ చేశారనిపిస్తుంది.
ఆరంభమే హీరో ఎంట్రీ అదిరిపోతుంది. ఆ తరువాత వచ్చే సీన్లన్నీ కాసేపు సాదా సీదాగా ప్రిడిక్టబుల్ గా వున్నా… ఆ తరువాత మాస్ యాక్షన్ సీక్వెన్స్ లతో సినిమాను ఉరకలెత్తించాడు డైరెక్టర్. ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకెండాఫ్ పై విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ఆద్యంతం పోలీసులకు, విలన్ గ్యాంగులకు మధ్య వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల అంచనాలకు అందకుండా వుంటాయి. దానికి తోడు మధ్య మధ్యలో కొన్ని కిచ్చా సుదీప్ తో చెప్పించే వన్ లైనర్ డైలాగులు, టు లైనర్ డైలాగులు కథను ఆడియన్స్ కన్వెన్సింగ్ గా అర్థం చేసుకునేలా వుంటాయి. ప్రీ క్లైమాక్స్ లో అసలు ట్విస్ట్ సినిమాకే హైలైట్. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కి అజనీష్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కలిపి థియేటర్లో మోత మోగిస్తాయి.
ఈ సినిమాకు ప్రధాన బలం సాంకేతిక నిపుణుల పనితనం. మొదటగా చెప్పుకోవాల్సింది… నేపథ్య సంగీతం… ఆతరువాత సినిమాటోగ్రఫీ. సినిమా మొత్తం రాత్రి పూటే జరుగుతుంది కాబట్టి… నైట్ మోడ్ లో సినిమాలో విజువల్స్ చాలా క్వాలిటీగా వుంటాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సెటప్ బాగా పిక్చరైజ్ చేశారు. ఇక దానికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ పని… ఎక్కడ తగ్గేదే లా అన్నట్టు వాయించేశాడు. అజనీష్… తమన్‌ను మించి పోయాడు. అనువాద సంభాషణలు బాగున్నాయి. సుదీప్ కి డబ్బింగ్ కూడా బాగా సెట్టయింది. ఇక సునీల్, వరలక్ష్మీ శరత్ కుమార్ ఎప్పటిలాగే తన వాయిస్ తో ఆకట్టుకుంది.
సుదీప్ తన పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ హీరోగా తన సత్తాను మరోసారి చాటుకున్నాడు. ఆ కటౌట్‌ను వాడుకుంటే ఎలా ఉంటుందో చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్ అయితే ఫ్యాన్స్ కు ఫీస్ట్ లానే ఉంటుంది. ఓ ఎదురులేని, తలవంచని పోలీస్ ఆఫీసర్.. మొండిఘటమైన అధికారిలా నటించేశాడు. అన్యాయాన్ని సహించని పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ అదరగొట్టేశాడు. దర్శకుడు రాసుకున్న కథ… కథనం గ్రిప్పింగ్ గా వుండటంతో… సినిమా నిడివి కూడా చాలా క్రిస్పీగా ఎడిట్ చేశారు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3.25