రివ్యూ: NTR- కథానాయకుడు

0
97

రేటింగ్: 3.5
సినీ రంగంలో తిరుగులేని వెండితెర వేల్పు స్వర్గీయ నందమూరి తారక రామారావు. అలాంటి మహానటుడి సినీ ప్రస్థానంపై తెరకెక్కిన చిత్రం ‘NTR- కథనాయకుడు’. మహానటుడి జీవితం పై తెరకెక్కిన ఈ తొలిభాగంలో… తన తనయుడు నందమూరి బాలకృస్ణ ఎన్టీఆర్ పాత్రను పోషించారు. ఎన్టీఆర్ భార్య బసవ తారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించారు. మరి ఎన్టీఆర్ సినీ ప్రస్థానంపై తెరకెక్కిన ‘NTR-కథానాయకుడు’ చిత్రం ఎలా వుందో చూద్దాం పదండి.

కథ: ఎన్టీఆర్ భార్య బసవ రామ తారకం క్యాన్సర్ బారిన పడి… చివరి దశలో వున్న సమయంలో ఒక్క సారి తన భర్త ఎన్టీఆర్ జీవిత ప్రస్థానాన్ని మననం చేసుకునే ప్రయత్నంలో ‘NTR-కథానాయకుడు’ సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తరువాత ఎన్టీఆర్ సబ్ రిజిస్టార్ గా ఉద్యోగం ప్రారంభించడం.. అక్కడ జరుగుతున్న అవినీతిని తట్టుకోలేక.. ఉద్యోగం వదిలి సినిమాల్లో వేశాలకోసం మద్రాసు పయనం కావడం… అక్కడ సినిమాల్లో నిలదొక్కోవడానికి ఎదుర్కొనే ఒడుదొడుకులు… నిలదొక్కున్న తరువాత తన చుట్టూ వున్న వాళ్లకోసం.. తన సినిమాలను చూసి ఆదరించిన ప్రజలకోసం ఎన్టీఆర్ ఏం చేశాడన్నదే ‘కథానాయకుడు’ కథ.

కథ.. కథనం: ప్రారంభంలో ఎన్టీఆర్ జీవితం ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సాగింది. ఉద్యోగంలో చేరిన తరువాత అక్కడ జరుగుతున్న అవినీతిని సహించలేక.. సినిమా రంగంలో రాణించడానికి మద్రాసు బయలు దేరడంతో ఎన్టీఆర్ జీవితంలో జరిగే మొదటి మలుపు. అక్కడికి వెళ్లిన తరువాత ఎల్వీ ప్రసాద్ సమక్షంలో సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించడం… నాగిరెడ్డి, కె.వి.రెడ్డి, చక్రపాణిలాంటి వారి సాంగత్యంలో సినిమాల్లో తిరుగులేని ‘కథానాయకుడు’గా ఎదగడంలాంటి సన్నివేశాలతో సినిమా అలాసాగిపోతున్న సమయంలో… కృష్ణ, శోభన్ బాబులాంటి యంగ్ హీరోలతో సవాల్ ఎదుర్కొనే పరిస్థతి వచ్చిందని తెలిసి… సినీరంగం నుంచి రిటైర్ అయ్యే సమయంలో మళ్లీ ‘దాన వీర శూరకర్ణ’, యమగోల, అడవి రాముడు, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, బొబ్బిపులిలాంటి సినిమాలతో తిరుగులేని సూపర్ స్టార్ గా ఎదిగిన వైనాన్ని దర్శకుడు చూపించిన తీరు అద్భుతం. ఇలా వరుసగా సినిమాలు చేస్తూనే… మరోవైపు ఇంతకాలం తనను ఆదరించిన ప్రజలకోసం సేవ చేయాలనే ఆలోచనతో వున్న ఎన్టీఆర్ గొప్ప మనసును ఎంతో చక్కగా వెండితెరపై ఆవిష్కరించారు దర్శకుడు క్రిష్. అలానే దేశంలోని అనాటి రాజకీయ పరిస్థితులపైనా అక్కడక్కడ టచ్ చేస్తూ ఎన్టఆర్ రాజకీయ రంగం వైపు అడుగులు వేయడానికి దారి తీసిన పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఎన్టీఆర్ జీవితంలోని ఇలాంటి ఎన్నో సంఘటనలను తెరమీద చూపించి ఆ మహానటుడు ‘NTR-కథానాయకుడు’గా తెలుగు చలన చిత్ర పరిశ్రమపైనా… భారత దేశ రాజకీయ యవనికపైనా ఎలాంటి ముద్ర వేశాడన్నది చూపించి… రాముడు గురించి తెలుసుకోవాలంటే… రామాయణం చదవాలి… కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే… మహాభారతం చూడాలి… తెలుగోడి గొప్పదనం తెలుసుకోవాలంటే.. NTR బయోపిక్ చూడాలన్నంతగా ఈ తొలిభాగం తెరకెక్కింది. ఎప్పటిలాగే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్-కథానాయకుడితో మరోసారి సంక్రాంతి హీరోగా నిలబడ్డాడు. గో అండ్ వాచ్ ఇట్.

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఆరవై ఏళ్ల పైబడిన మెచ్యూర్డ్ ఎన్టీఆర్ గా అచ్చు గుద్దినట్టు సరిపోయాడనడంలో సందేహం లేదు. నడక, నడతలో అచ్చం పెద్దాయననే చూసినట్టు కనిపిస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో తన ‘అన్నదమ్ముల అనుబంధం’ చిత్రం రిలీజ్ ను అడ్డుకునే సందర్భంలో బాలకృష్ణ ప్రదర్శించిన అభినయం గూస్ బంప్స్. అలానే పథాక సన్ని వేశంలో పార్థీ పేరు అనౌన్స్ మెంట్ సందర్భంగా పలికిన సంభాషణలు అద్భుతం. అలానే అక్కినేని నాగేశ్వరరావుగా(సుమంత్)తో చేసిన మరికొన్ని సన్నివేశాల్లోనూ బాలయ్య తన ముద్రను చూపించారు. సుమంత్ కూడా తన తాతగారి పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ఇక బసవ రామ తారకం పాత్రలో నటించిన విద్యాబాలన్ పర్ ఫెక్ట్ యాప్ట్. గృహిణి పాత్రలో చక్కగా ఒదిగిపోయి.. ఈ పాత్రకు మరెవ్వరూ సూట్ అవ్వరు అన్నంత బాగా చేసింది. ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రామారావు పాత్రలో దగ్గుబాటి రాజా చేసిన పాత్ర హైలైట్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ తమ్ముడి పాత్ర గురించి చాలా మందికి తెలియదు. ఆ పాత్రను బాగా చూపించారు. ఎన్టీఆర్ ఎదుగుదలలో తోడ్పాటు అందించిన నాగిరెడ్డి పాత్రను ప్రకాశ్ రాజ్… కె.వి.రెడ్డి పాత్రలో క్రిష్… చక్రపాణి పాత్రలో మురళీ శర్మ, అలానే ఎల్వీ ప్రసాద్ క్యారెక్టర్ వేసిన వ్యక్తి పాత్రలన్నీ చాలా బాగా పోర్ట్ రైట్ చేశాడు దర్శకుడు క్రిష్. వీరంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు పడ్డ కష్టం… తెరమీద కనిపిస్తుంది. ఓ వైపు సినిమా జీవితాన్ని చూపిస్తూనే… మరోవైపు రామారావు అంతరాత్మను చూపించిన విధానం చాలాబాగుంది. అందుకు రాసుకున్న కథనం చాలా యాప్ట్ గా వుంది. క్రిష్ దర్శకత్వానికి యం.యం.కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. ముఖ్యంగా మాయాబజార్ చిత్రం షూటింగ్ సమయంలో బాలకృష్ణ కృష్ణుడు వేశంలో వచ్చే సీన్ కి నేపథ్య సంగీతంతో పాటు…. క్రిష్ దర్శకత్వ ప్రతిభను… సినిమాటోగ్రాఫర్ చూసే కోణాన్ని ఎలివేట్ చేస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా వుంటే బాగుండు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా వున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా ముగ్గురూ ఖర్చు పెట్టారు.

చివరగా.. జై ఎన్టీఆర్..! జోహార్ ఎన్టీఆర్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here