సుకుమార్ చేతులు మీదుగా ‘2+1’చిత్రం మోషన్ పోస్టర్ విడుదల

0
56

శంకర్ హీరోగా కాచిడి గోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఎస్ .కె. పిక్చర్స్ , ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా సురేష్ కొండేటి , ఎడవెల్లి వెంకట్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న చిత్రం 2+1 ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను దసరా కానుకగా మరియు ప్రముఖ నిర్మాత సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ ‘2+1’చిత్రం మోషన్ పోస్టర్ను విడుదల చేశారు
ఈ సందర్భంగా అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ మాట్లాడుతూ, `శ‌క‌ల‌క శంక‌ర్ నాకు స్ర్ట‌గిలింగ్ డేస్ నుంచి తెలుసు. త‌నిప్పుడు ఈస్థాయికి చేరుకుని హీరోగా సినిమా చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చాడు. శంక‌ర్ ట్యాలెంటెడ్ ప‌ర్స‌న్. ఎవ‌రినైనా ఇమిటేట్ చేయ‌గ‌ల‌డు. ఏ పాత్ర అయినా చేగ‌ల‌డు. ఈ సినిమాతోనే ఇద్ద‌రు కొత్త‌ ద‌ర్శ‌క‌, నిర్మాతలు ప‌రిచయం అవుతున్నారు. అలాగే సురేష్ కొండేటి సినిమా భాగ‌స్వామ్యం అవ్వ‌డం సంతోషం. ఈ సినిమా విజ‌యం సాధించింది అంద‌రికీ మంచి పేరు తీసుకురావాలి. వీళ్లంతా భ‌విష్య‌త్ లో మంచి సినిమాలు చేయాలి. అలాగే సురేష్ కొండేటికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు` అని అన్నారు.

హీరో ష‌క‌ల‌క శంక‌ర్ మాట్లాడుతూ, ` మా కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ సుకుమార్ చేతులుగా లాంచే అవ్వ‌డం సంతోషంగా ఉంది. మా సినిమా ప్ర‌చారం సుకుమార్ గారి ద‌గ్గ‌ర నుంచే ప్రారంభ‌మైంది` అని అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ, ` నేను ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన త‌ర్వాత నా మొద‌టి బ‌ర్త్ డేను అల్లు అర‌వింద్ గారు మ‌గ‌ధీర స‌క్సెస్ మీట్ లో చేసారు. త‌ర్వాత ఎప్పుడూ బ‌ర్త్ డేని అలా జ‌రుపుకోలేదు. మ‌ళ్లీ అనుకోకుండా ఈరోజు సుకుమార్ గారి ఇంట్లో ఈ సినిమా సంద‌ర్భంగా జ‌రిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ బ‌ర్త్ డేని నా జీవితంలో మ‌ర్చిపోలేను. సుకుమార్ నాకు ఎప్ప‌టి నుంచో స్నేహితుడు. ఆ ఫ్యామిలీతో మంచి రిలేష‌న్ ఉంది. ఇద్ద‌రం ప‌క్క ప‌క్క ఊళ్ల నుంచి వ‌చ్చిన వాళ్లం. ఈ సినిమా క‌చ్చితంగా మా అంద‌రికీ మంచి పేరు తెస్తుంద‌ని, శంక‌ర్ కి ప‌దేళ్ల పాటు గర్తుండిపోయే సినిమా అవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా. కొత్త , ద‌ర్శ‌క‌, నిర్మాతలు ఈ సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌యం అవుతున్నారు. సినిమా బాగా వ‌స్తోంది. నా గ‌త సినిమాలు ఆద‌రించిన‌ట్లుగా తెలుగు ప్రేక్ష‌కులంతా ఈ చిత్రాన్ని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా` అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ, ` శ‌క‌ల‌క శంక‌ర్, సురేష్ గారితో నా తొలి సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది . మోష‌న్ పోస్ట‌ర్ ని సుకుమార్ గారు లాంచ్ చేయ‌డం ఆనందంగా ఉంది. అందుకు ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా క‌తృజ్ఞ‌త‌లు తెలుపుతున్నా. అలాగే సురేష్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు ` అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ,` నా అభిమాన ద‌ర్శ‌కుడు సుకుమార్ గారు. మా సినిమా మోష‌న్ పోస్ట‌ర్ ఆయ‌న రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. హీరరో, నిర్మాత నా మీద పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాను అన్న‌ న‌మ్మ‌కం ఉంది. అలాగే సురేష్ కొండేటి గారు ఇలాంటి మ‌రెన్నో పుట్టి రోజులులు జ‌రుపుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here