తీస్ మార్ ఖాన్ ట్రైలర్ కి అనూహ్య స్పందన

0
34

ఆకట్టుకుంటున్న ఆది సాయికుమార్ తీస్ మార్ ఖాన్ ట్రైలర్

ఆది సాయికుమార్ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా *తీస్ మార్ ఖాన్* అనే చిత్రం రాబోతుంది. విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి  ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం *ఆగస్ట్ 19న* విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

2 నిమిషాల 42 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లో ప్రతి సన్నివేశం కూడా సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. *మా అమ్మను తప్పుగా చూశారు.. మా అమ్మ జోలికొస్తే ఏ అమ్మ కొడుకైనా కొడతా* అంటూ పదునైన డైలాగ్ తో ఆది సాయి కుమార్ ఎంట్రీ చూపించి ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ అనేది చెప్పేశారు. పోలీస్ గా ఆది సాయి కుమార్ ఎలివేషన్ హైలైట్ చేస్తూనే కామెడీ పండించడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ పోలీస్ రోల్ ఉండబోతోందని స్పష్టమయింది.

*ఇలాంటి అందమైన అమ్మాయిలు అంత అందంగా డాన్స్ చేస్తుంటే ఎంత ఖర్చు పెడితే వస్తాయి చెప్పండి ఇలాంటి విజువల్స్..* ఆది సాయి కుమార్ చెప్పిన డైలాగ్, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో రొమాంటిక్ సీన్స్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోలో మరో హైలైట్. మొత్తంగా చూస్తే ఈ ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. చివరగా మీ *TMK* అని స్టైలిష్ గా చెబుతూ *ఆగస్టు 19న* థియేటర్స్ లో కలుద్దాం అన్నారు ఆది సాయి కుమార్.

స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ , పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Aadi Saikumar, Kalyanji Gogana, Vision Cinemas’ Tees Maar Khan Trailer Released

Promising hero Aadi Saikumar and talented director Kalyanji Gogana’s is proving to be a perfect combination, although they are working together for the first time. Both the teasers got exceptional response. With double the enthusiasm, the makers released theatrical trailer of the movie.

The very first episode shows how caring the protagonist is towards his family. He is shown as a student, a rowdy and then as a cop. He has a love interest played by Payal Rajput. While Aadi looked highly energetic through-out the trailer, Payal Rajput oozed glamour. Aadi and Payal shared sizzling chemistry.

Poorna and Sunil have played vital roles in the movie that has all the commercial ingredients. What intrigues us is the way Kalyanji showed Aadi. It’s very exciting to see the actor in such an energetic role for the first time and that too it has three shades.

Bal Reddy with his brilliant cinematography and Sai Kartheek with his terrific background score complement each other. The trailer has set the bar high on the movie. Manikanth is the editor.

Produced by Popular Businessman Nagam Tirupathi Reddy under Vision Cinemas, the film is all set to hit the big screens on 19th August.

Cast: Aadi Saikumar, Payal Rajput, Sunil, Poorna and others.

Crew:
Banner: Vision Cinemas
Director: Kalyanji Gogana
Producer: Nagam Tirupathi Reddy
Executive Producer: Tirumal Yella
Music: Sai Kartheek
Editor: Manikanth
Cinematographer: Bal Reddy
PRO: Sai Satish, Parvataneni Rambabu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here