రివ్యూ: ABCD

0
130

రేటింగ్: 3
’శ్రీరస్తు… శుభమస్తు‘ ‘ఒక్క క్షణం’ లాంటి హిట్ సినిమాలతో మెగా అభిమానులను అలరించిన అల్లు శిరీష్… తాజాగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ‘ABCD’ ‘అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి’ అనేది ట్యాగ్ లైన్ చిత్రంలో నటించారు. ఇందులో అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ నటించారు. ఈ చిత్రం మధుర శ్రీధర్‌, యష్‌ రంగినేని నిర్మణంలో తెరకెక్కింది. మలయాళంలో హిట్టయిన ఓ చిత్రానికి ఇది రీమేక్. మరి ఈ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించిందో చూద్దాం పదండి.

కథ: అమెరికాలో పుట్టి పెరిగిన అరవింద్( అల్లు శిరీష్).. విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేసి… తండ్రి సంపాధించిన సొమ్మునంత వేస్ట్ చేస్తుంటాడు. దాంతో అతనికి ఎలాగైన డబ్బు విలువ… డబ్బు సంపాధించడం ఎంత కష్టమో తెలియజేయాలనే ఉద్దేశంతో అరవింద్ తండ్రి(నాగబాబు) ఓ ధృఢ నిశ్చయానికి వస్తాడు. ఓ నెల రోజుల పాటు ఇండియాకు వెళ్లి ఎంజాయ్ చేసిరా అని మాయమాటలు చెప్పి ఇండియాకు పంపుతాడు. ఇండియాకు వచ్చిన తరువాత అక్కడే ఎంబీఏ చదవాలని… అందులోనూ నెలకు ఐదు వేలు మాత్రమే పాకెట్ మనీ పంపుతానని కండీషన్ పెడతాడు. ఈ కండీషన్ కి ఒప్పుకుంటేనే.. తిరిగి అమెరికాకు నిన్ను తీసుకొస్తానని కరాఖండిగా చెబుతాడు. దాంతో చేసేది లేక తండ్రి ఇచ్చే 5వేల ప్యాకెట్ మనీతోనే సర్దుకుని ఎంబీఎ పూర్తి చేయడానికి సంకల్పిస్తాడు. మరి తండ్రి ఇచ్చే పాకెట్ మనీ అరవింద్ కు సరిపోయిందా? అరవింద్ కు డబ్బు విలువ తెలిసిందా? ఈక్రమంలో అరవింద్ ఇండియాలో ఎలాంటి సమస్యలను ఫేస్ చేశాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణం: మలయళంలో హిట్ అయిన ఏబీసీడీ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు దర్శకుడు. తండ్రి సంపాధించిన డబ్బును విచ్చల విడిగా ఖర్చు చేసి.. జల్సా చేసే ఓ ఎన్నారై కుర్రాణ్ని తీసుకుని… అతని చుట్టూ రాసుకున్న కథ.. కథనాలు ఇంప్రెసివ్ గా వున్నాయి. కేవలం ఐదు వేల ప్యాకెట్ మనీతో నెల రోజుల పాటు కుర్రాళ్లు ఎంత పొదుపుగా ఖర్చు చేయొచ్చో… ఓ సందర్భంలో హీరో చేత చెప్పించడం హైలైట్ గా నిలిచింది. ఓ వైపు కాలేజీ బ్యాక్ డ్రాప్.. మధ్యలో హీరోయిన్ తో ప్రేయాణం.. ఈ తరువాత యూత్ ఐకాన్ టెస్టులో గెలవడం కోసం.. హీరో చేసే ప్రయత్నాలన్నీ నేటి యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. అలానే అల్లు శిరీష్ తో పాటు నటించిన మాస్టర్ భరత్ కూడా శిరీష్ తో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకుని అక్కడక్కడ నవ్వించారు. ఓవరాల్ గా ఈ చిత్రం నేటి యువతకు ఓ మంచి మెసేస్ ఇస్తుంది. సంపన్న కుటుంబాల్లో పుట్టిన అబ్బాయిలకు బాగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది.
అల్లు శిరీష్ ఈ సినిమా కోసం అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకుని సినిమా చేసాడు. స్క్రీన్ పై అల్లు శిరీష్ పెట్టిన ఎఫర్ట్ కనిపిస్తుంది. డబ్బు, లైఫ్ వాల్యూ తెలుసుకునే అరవింద్ క్యారెక్టర్‌ లో శిరీష్ చక్కని నటనను కనబరిచాడు. అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, క్లైమాక్స్ లో ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. శిరీష్ తో పాటు మాస్టర్ భరత్ కూడా బాగా నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్ ఛానెల్ హెడ్ పాత్రలో బాగా నవ్వించాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అబ్బాయి రాజా కూడా బాగా ఎదగాలనే యంగ్ పొలిటీషియన్ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. అతని తండ్రిగా నటించిన శుభలేక సుధాకర్ కాసేపే వున్నా పర్వాలేదనిపిస్తుంది అతని పాత్ర. పార్టీ అధినేతగా కోటా శ్రీనివాసరావు నటించారు.
దర్శకుడు సంజీవ్‌ రెడ్డి మలయాళ మాతృకను అక్కడక్కడ మార్పులు చేర్పులు చేసి తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ సాధించారు. రామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ని అందంగా చూపించారు. సంగీత దర్శకుడు జుధా సాంధీ అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. సెకండాఫ్ లో వచ్చే మెల్లగా మెల్లగా సాంగ్ బాగుంది. నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని ఎక్కడా రాజీ పడకుండా సినిమాకు ఖర్చు చేశారు. సో.. ఈ వీకెండ్ లో ఏబీసీడీ చూసి ఎంజాయ్ చేయండి.

నటీనటులు: అల్లు శిరీష్‌, రుక్సార్ థిల్లాన్, నాగ‌బాబు, భరత్, రాజ, వెన్నెల కిశోర్, కోటా శ్రీనివాసరావు తదితరులు.
సంగీతం: జుధా సాంధీ
సినిమాటోగ్రఫర్: రామ్
ఎడిటర్: నవిన్ నూలి
నిర్మాత: మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here