సినిమా రంగం పుష్పక విమానం లాంటిదనే విషయం ఇప్పుడు కొత్తగా చెప్పేదేమీ కాదు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇక్కడ సీటు దొరుకుతుంది. ఈ పుష్పక విమానంలో తనకంటూ ఓ చోటు దక్కించుకునేందుకు అడుగులు వేస్తోంది అందాల భామ అలేఖ్య శెట్టి.
ఇంజినీరింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ అయిన ఆలేఖ్య శెట్టి.. ‘సత్యమేవ జయతే-1948’ చిత్రంతో అరంగేట్రం చేస్తోంది. ‘మహానటి’లో సమంత పోషించిన పాత్ర తరహాలో.. ‘సత్యమేవ జయతే-1948’లో తాను జర్నలిస్ట్ గా నటిస్తున్నానని.. తన పాయింటాప్ లోనే సినిమా నడుస్తుందని ఆలేఖ్యశెట్టి చెప్పింది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత మహర్షిగారికి రుణపడి ఉంటానని ఆలేఖ్యశెట్టి పేర్కొంది. చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని కలలు కంటూ పెరిగానని.. అందుకనే ఇంజినీరింగ్ లో టాపర్ అయినప్పటికీ.. యాక్టింగ్ ను కెరీర్ గా తీసుకుంటున్నానని, ఏ ఇనిస్టిట్యూట్ లోనూ తాను చేరలేదని.. అద్దమే తన గురువని.. సినిమాలు చూడడం.. అద్దం ముందు సాధన చేయడం ద్వారానే నటనకు మెరుగులు దిద్దుకుంటున్నానని, వెస్ట్రన్ డాన్స్ లో తనకు ప్రావీణ్యం ఉందని అలేఖ్య శెట్టి చెబుతోంది. ఆరంగేట్రంతోనే ఆదరగొట్టి, అంచెలంచెలుగా అగ్ర హీరోయిన్ కావాలని ఆశ పడుతున్న ఆలేఖ్యశెట్టి.. తన ప్రయత్నంలో ఏమేరకు సఫలీకృతమవుతుందో వేచి చూడాల్సిందే!!