ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేష‌న్‌కు అల్లు అర్జున్ అభినందన… రూ.10 లక్షల ఆర్థిక సహాయం

0
79

‘అల… వైకుంఠపురంములో’ చిత్రంతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులు (నాన్ బాహుబలి) నెలకొల్పిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను బుధవారం ‘ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ ప్రెసిడెంట్ వి. లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ వై. జె. రాంబాబు, జనరల్ సెక్రటరీ నాయుడు సురేంద్ర కుమార్, జాయింట్ సెక్రటరీ జి. శ్రీనివాస్ కుమార్, ట్రెజరర్ జి. జలపతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పి. రఘు, వై. రవిచంద్ర, కె. ఫణి, వి. శ్రీనివాస రావు, జి. శ్రీనివాస్ తది కలిశారు. సినిమా భారీ విజయం సాధించిన సందర్భంగా ఆయనను అభినందించారు.

మాటల మధ్యలో జర్నలిస్టుల సంక్షేమానికి ‘ఫిల్మ్ న్యూస్‌ క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు, ఎంతో మంచి పని చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. వెంటనే తన వంతుగా 10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు. తాము వచ్చింది అభినందించడానికి మాత్రమేనని, ఆర్థిక సహాయం కోరడానికి కాదని అసోసియేషన్ ప్రతినిధులు అల్లు అర్జున్ గారితో చెప్పగా… “మీరు చేస్తున్న పనులు నాకు బాగా నచ్చాయి. ఇది టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అమౌంట్ మాత్రమే. ఇకముందు కూడా మీకు సహాయం చేస్తాను” అని ఆయన అన్నారు. తన పెద్ద మనసును చాటుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ… “జర్నలిస్టుల ఆరోగ్య భద్రత, సంక్షేమం, ఇతర కార్యక్రమాల కోసం ‘ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ చేస్తున్న కృషి ప్రశంసనీయం. మంచి పనులు చేస్తున్నారు. ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు నాకు ఎంతగానో నచ్చాయి. అందుకని, నా వంతుగా కొంత సహాయం చేస్తున్నాను. భవిష్యత్తులోనూ అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. జర్నలిస్టులపై నాకెంతో గౌరవం ఉంది. మా సినిమాలను అభిమానులు, ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్ళేది జర్నలిస్టులే. వాళ్ల సంక్షేమంలో నేను భాగం కావడం సంతోషంగా ఉంది. జర్నలిస్టులకు ఏ సహాయం కావలసిన నేను ముందుంటాను. మీరు అందరూ సమిష్టిగా పని చేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఒకే తాటిపైకి రావాలి. మీకున్న పవర్ చాలా పెద్దది. ఇండస్ట్రీలో ఎటువంటి డిఫరెన్స్ లేకుండా మీరంతా ఒకటే అని చూపించాలి” అని అన్నారు.

Allu Arjun appreciates Film Newscasters Association, donates Rs 10 lakh

Stylish Star Allu Arjun has scored an all-time industry hit (non-Baahubali) with the Sankranthi sensation, ‘Ala Vaikunthapurramuloo’. On Wednesday, Film Newscasters Association of Electronic Media’s President V Lakshmi Narayana, Vice-President YJ Rambabu, General Secretary Naidu Surender Kumar, Joint Secretary G Srinivas Kumar, Treasurer G Jalapathy, Executive Members P Raghu, Y Ravichandra, K Phani, V Srinivasa Rao, and G Srinivas today met the Mega hero to congratulate him on the massive success of his movie.

During an informal chat with the members, Allu Arjun learned about the welfare activities that have been undertaken by the Film Newscasters Association for the well-being of cine journalists. He not only expressed his happiness over the Association’s measures but also immediately pledged Rs 10 lakh. When the Association office-bearers told the Stylish Star that they had visited him only to congratulate him on the film’s success, the kind-hearted actor replied that he liked the activities of the Association. He said, “Accept my financial contribution as a token of appreciation. I will be there to help your Association in the future as well.”

Allu Arjun added, “It’s commendable that the Association has been taking steps towards the health insurance and welfare of journalists. These welfare activities have to be encouraged. I assure that I will be there to help the Association. I have a lot of respect for journalists. It’s the media that takes our movies into the audience. I am happy to be a part of their welfare. I will be there to render any kind of help to the Association, and I hope it will continue to work for journalists’ welfare in a collaborative manner. The media’s power is immense, and you people have to stay united without differences.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here