పురాణపండ ‘నన్నేలు నా స్వామి’ మహాగ్రంధాన్ని ఆవిష్కరించిన అమిత్ షా.

0
21

ప్రముఖ రచయిత , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ మరొక సారి పవిత్ర సంచలనానికి తెర లేపారు.

సాక్షాత్తూ ఈ దేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా చే ఈ ఉదయం ఒక అద్భుతమైన , అనిర్వచనీయ ఒక అఖండ మహా గ్రంధాన్ని ఆవిష్కరింప చేసి ప్రశంసలు పొందారు.

ప్రముఖ చలన చిత్రనిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం సంస్థ అధినేత సాయి కొర్రపాటి సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క శక్తి క్షేత్రంగా మలచి , ఒక భౌతికాతీతమైన అపురూప ఆంజనేయ స్వామి మహా మంత్ర వాగ్మయంతో , వ్యాఖ్యానాలతో రచించి, సంకలనం చేసి ‘ నన్నేలు నాస్వామి’ పేరుతో దేశంలోనే మొదటి అఖండ గ్రంధంగా సంచలనం సృష్టించారు

న్యూఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఈ ఉదయం ‘ నన్నేలు నాస్వామి’ మహా గ్రంధాన్ని ఆవిష్కరించినఅమిత్ షా మాట్లాడుతూ నాకు తెలుగు రాకపోయినా ఈ మహా గ్రంధాన్ని పూర్తిగా పేజీలు తిప్పి చూస్తుంటే ఏదో శక్తి ఆవహిస్తున్నట్లుందని, హనుమద్భక్తులకు ఆత్మశక్తినిచ్ఛే ఈ మహా విజయాల సాధనా గ్రంధాన్ని ఆంజనేయ స్వామి కటాక్షం వల్లనే పురాణపండ శ్రీనివాస్ ఇంతటి తేజస్సుతో అందించగలిగారని అభినందించారు.

వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి పర్యవేక్షణలో తొలిప్రతిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి కి అందజేశారు.

ఈ గ్రంథ రచనా సంకలన కర్త పురాణపండ శ్రీనివాస్ నిర్మాణాత్మక సామర్ధ్యం , అసాధారణ ప్రతిభ, అద్భుత రచనా శైలి , విరామమెరుగక చేసే కృషి, నిస్వార్ధ సేవ తనను ఎంతో ఆకట్టుకోవడంతో , తాను ఆంజనేయస్వామిపై ఒక మహా గ్రంధాన్ని అందించమని శ్రీనివాస్ ని కోరడంతో ఈ అద్భుతాన్ని శ్రీనివాస్ ఎంతో పరిశ్రమించి అందించారని , అమిత్ షా వంటి మహా శిఖరం ఈ గ్రంధాన్నిఆవిష్కరించడం తనను అనుభూతికి లోను చేసిందని, ఈ కార్యంలో సహకరించిన కిషన్ రెడ్డికి , పురాణపండ శ్రీనివాస్ కి సాయి కొర్రపాటి వినయ పూర్వకంగా కృతజ్ఞతలుచెప్పారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమారుడు హర్షవర్ధన్ , మరొక కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రచయిత పురాణపండ శ్రీనివాస్ ఆద్యంతం వినయంగా , మౌనం గా ఉండటం గమనార్హం.

తెలుగు రాష్ట్రాలతోనే కాకుండా దేశ దేశాలలో గత దశాబ్ద కాలంగా పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలకు వున్న ఫాలోయింగ్ వేరే చెప్పక్కర్లేదు. అందమైన శైలితో పాటు, అద్భుతమైన వక్తగా విశేషఖ్యాతి పొందిన పురాణపండ శ్రీనివాస్ మహోన్నత ఆధ్యాత్మిక గ్రంధాల తేజస్సు వెనుక రేయింబవళ్ల నిర్విరామ కృషి , నిస్వార్ధ సేవ , రాజీపడని మనస్తత్వంతో పాటు తిరుమల శ్రీనివాసుని కటాక్షమేనని సన్నిహితులు చెబుతుంటారు.

Amit Shah Unveils Puranapanda Srinivas’s “Nannelu Naa Swamy” Book

Noted author and former editor of Andhra Pradesh Endowment Department official monthly magazine ‘Aradhana’ Puranapanda Srinivas has created another sensation.

He won accolades for Union Home Minister Amit Shah unveiling his glorious book this morning.

Popular producer Sai Korrapati of Vaaraahi Chalana Chitram presented the wonderful epic “Nannelu Naa Swamy” penned by Puranapanda Srinivas.

After launching “Nannelu Naa Swamy” book at Home Ministry office in New Delhi this morning, Amit Shah said, “Though I don’t know Telugu, I can sense a great power while flipping pages of the book. I presume Puranapanda Srinivas has penned the book that will give the instinct to devotees of Lord Anjaneya with blessings from the god.

The first copy was handed over to Union Home Minister of State G Kishan Reddy in presence of Sai Korrapati, the head of the film Vaaraahi Chalana Chitram.

Sai Korrapati said, “Overwhelmed with Puranapanda Srinivas’s efficiency, exceptional talent, eccentric writing style, reliability and selfless service, I requested him to write a book on Lord Anjaneya Swamy and he came up with an ideal book. I’m really pleased for a great person like Amit Shah launching the book. I’m really thankful for Kishan Reddy and Puranapanda Srinivas for their support for the event.”

The event was attended by Harshavardhan, son of Vice President Venkaiah Naidu, and another Union Minister Nityanand Rai. Interesting aspect was Puranapanda Srinivas was mum all through the event.

Needless to say that Puranapanda Srinivas has great following not just in the Telugu states, but also across the globe for last decade. His close aides say that there’s excess hard work, relentless efforts, selfless service and uncompromising mentality, besides Tirumala Balaji’s blessings behind his spiritual works.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here