‘అనుకొన్నది ఒక్కటి… అయినది ఒక్కటి’ ఆకట్టుకొనే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్

0
259

ఆడియన్స్ ను థ్రిల్ కు గురిచేసే సినిమాలకు మంచి ఆదరణ వుంది. దానికి కొంచెం రొమాంటిక్ క్రైమ్ బేస్డ్ స్టోరీ అయితే మరింత ఆదరణ పొందుతుంది. తాజాగా ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, కోమలి ప్రసాద్, సిద్ధి ఎడ్నాని ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘అనుకొన్నది ఒక్కటి అయినది ఒక్కటి’ ఇలాంటి సినిమానే. సినిమా జర్నలిజంలో స్థిరపడాలని వచ్చిన బాలు అడుసుమల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.

కథ: ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, కోమలి ప్రసాద్, సిద్ధి ఎడ్నాని మంచి స్నేహితులు. కార్పొరేట్ కల్చర్ కలిగిన ఈ నలుగురు యువతులు ఓ ఫ్రెండ్ మ్యారేజ్ కోసం గోవా వెళతారు. అక్కడ వీళ్ళు తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం వలన ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అసలు వాళ్లు తీసుకున్న ఆ అనాలోచిత నిర్ణయం ఏమిటీ? వారు ఎవరిని మర్డర్ చేశారు? మరి ఈ మర్డర్ కేసు నుండి వాళ్ళు బయటపడ్డారా? ఈ నలుగురు యువతుల కథ చివరికి ఎలా ముగిసింది? అనేది మిగతా కథ…

విశ్లేషణ: కొత్త దర్శకుడు బాలు అడుసుమల్లి ఆడపిల్ల స్వేచ్ఛ హద్దులు దాటితే ఎటువంటి పర్యవసానాలు ఎదురుకోవాల్సి వస్తుంది అనే మంచి పాయింట్ ని కథా వస్తువుగా తీసుకున్నారు. నేటి ఆధునిక యుగంలో కొందరు యువతుల జీవన శైలి ఎలా ఉంటుంది… అనే విషయాన్ని ప్రస్తావించిన విధానం బాగుంది. కథకు తగ్గట్టుగా ఆయన రాసుకున్న సన్నివేశాలు, సిట్యువేషనల్ కామెడీ ఆకట్టుకున్నాయి. అలాగే చివరి అరగంట ఆయన సినిమాను ఆసక్తిగా మలిచారు. ఆధునిక యువతుల ఆలోచనా తీరు, వాటి పర్యావసానాలు ఎలా వుంటాయనే ఓ కొత్త పాయింట్ ను దర్శకుడు తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే… ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘అనుకున్నది ఒక్కటి… అయినది ఒక్కటి’ చిత్రం ఆద్యంతో యూత్ ను ఆకట్టుకునే అంశాలతోనే తెరకెక్కించడంలో దర్శకుడు బాలు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా మాస్ ను దృష్టిలో వుంచుకుని రాసిన సీన్స్ గానీ, డైలాగ్స్ గానీ యూత్ కి బాగా నచ్చుతాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయే ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, కోమలి ప్రసాద్, సిద్ధి ఎడ్నాని బోల్డ్ కంటెంట్ రోల్స్ లో చాలా చక్కగా నటించారు. సినిమాలో వీరి గ్లామర్ మెప్పిస్తుంది. ధాన్యా బాలకృష్ణ అటు గ్లామర్ పరంగా ఇటు ఎమోషన్స్ కూడా బాగా పండించింది. త్రిదా చౌదరి రోల్ మిగతా ముగ్గురి పాత్రలకు మంచి సపోర్ట్ ఇవ్వగా కోమలి ప్రసాద్ పాత్ర నలుగురిలో ప్రత్యేకంగా నిలిచింది. ఆమె బోల్డ్ రోల్ చేయడంతో పాటు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు మంచి నవ్వులు పంచింది. ఇక పోలీస్ పాత్రలో సమీర్ పాత్రకు తగ్గట్టుగా చక్కగా ఒదిగిపోయారు. బిగ్ బాస్ ఫేమ్ హిమజ పాత్ర తెరపై కొన్ని నవ్వులు పంచింది. సంగీతం పర్వాలేదు. బీజీఎమ్ మరియు కెమెరా వర్క్ ఓకే. గోవా అందాలను బాగా చూపించారు. బోల్డ్ డైలాగ్స్ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని మెప్పిస్తాయి. ఓ వరాల్ గా ‘అనుకొన్నది ఒక్కటి… అయినది ఒక్కటి’ ఆకట్టుకొనే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here