పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సమీక్ష

0
167

పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం పనుల పురోగతిపై 64వ సారి వర్చువల్ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు ఇప్పటివరకు 55.38% పూర్తి అయ్యాయని, కుడి కాలువ నిర్మాణం 89.96%, ఎడమ కాలువ నిర్మాణం 61.28% పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలట్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌ తవ్వకం పనులు 75.20% పూర్తయ్యాయని చెప్పారు.

 

స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 26.10%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.17%, కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ 86.60% పూర్తి అయినట్లు అధికారులు వివరించారు. గత వారం స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 3.02 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయిన తవ్వకం పనులు జరగాయని చెప్పారు. స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 28 వేల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు పూర్తి అయినట్లు చంద్రబాబుకు అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here