ఎంగేజింగ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘అశ్వథ్థామ’

0
219

యంగ్ హీరో నాగశౌర్య ఎంచుకునే కథలన్నీ చాలా వైవిధ్యంగా వుంటాయి. ప్రతి సినిమాకు వేరియేషన్ చూపించి ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. దిక్కులు చూడకు రామయ్య, ఛలో చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన నాగశౌర్య.. ఇప్పుడు ‘అశ్వద్థామ’ అనే ఓ యాక్షన్ క్రైమ్ థ్రిల్లరో మూవీతో అలరించడానికి రెడీ అయ్యారు. ఇందులో నాగ శౌర్య, మెహ్రిన్ పిర్జా జంటగా నటించారు. దీనికి దర్శకుడు రమణ తేజ. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ చేసిందో చూద్దాం పదండి.

కథ: చెల్లి ప్రియ(సర్గన్ కౌర్) అంటే అమితంగా ప్రేమించే అన్నయ్య గణ(నాగ శౌర్య)కి ఆమె పెళ్ళికి ముందే గర్భవతి అని తెలిసి షాక్ కి గురవుతాడు.ఐతే ఆమె గర్భానికి కారణం ఎవరో ప్రియకే తెలియకపోవడంతో అందుకు కారణమైన వాడిని పట్టుకొనే క్రమంలో కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు. వైజాగ్ వేదికగా అనేక మంది ఆడపిల్లలు కిడ్నాప్ అవుతూ ఉంటారు.ఇది తెలుసుకున్న గణ ఆ కిడ్నాప్ లు ఎందుకు జరుగుతున్నాయి అని తెలుసుకున్నాడా? ఈ కిడ్నాప్ల వెనుక ఎవరు వున్నారు? వాళ్లు ఎందుకు అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నారు? మరి గణ వాళ్ళని పట్టుకొని శిక్షించాడా? అనేది తెరపైన చూడాలి…

కథ.. కథనం విశ్లేషణ: ఓ మాస్ లుక్ లో.. ప్రేక్షకుల్ని అలరించేలా మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ లో నాగశౌర్య కనిపిస్తే ఎలావుంటుందో ఇందులో దర్శకుడు యాక్షన్ సన్నివేషాలను చిత్రీకరించిన విధానాన్ని బట్టి చూస్తే… అర్థమవుతుంది. తన లవర్ బాయ్ ఇమేజ్ కి భిన్నంగా ఓ మాస్ రోల్ ట్రై చేసి… నాగ శౌర్య చాలా వరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సాలిడ్ బాడీ తో యాక్షన్ సన్నివేశాలలో ఇరగదీసిన ఆయన, సీరియస్ ఎమోషనల్ సన్నివేశాలలో కూడా డిఫరెంట్ మేనరిజం తో అలరించారు. మాస్ హీరోగా నిరూపించుకోవాలన్న ఆయన ప్రయత్నం సఫలం అయ్యిందనే చెప్పాలి. అశ్వథామ చిత్రంలో యాక్షన్ చెప్పుకోదగ్గ అంశం. ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ లో మెయిన్ విలన్ తో ఫైట్ సీన్ ఆకట్టుకుంది. ఓ క్రైమ్ థ్రిల్లర్ ని దర్శకుడు చాలా వరకు కన్వీన్సింగ్ గా తీశాడు.తాను చెప్పాలనుకున్న స్టోరీని ఎక్కడా డీవియేట్ కాకుండా తెరకెక్కించిన విధానం బాగుంది. మొదటి సగంలో సస్పెన్సు క్యారీ చేసిన విధానం బాగుంది. ఇక ఈ చిత్రంలో విలన్ గా చేసిన బెంగాలీ నటుడు జిష్షు సేతు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కామాంధుడైన సైకో విలన్ గా ఆయన నటన కట్టిపడేసింది.సెకండ్ హాఫ్ ని చాలా వరకు ఆయన నటన నడిపించింది. అయన బాడీ లాంగ్వేజ్ కి హేమ చంద్ర వాయిస్ బాగా సరిపోయింది. హీరోయిన్ మెహ్రిన్ కి కథ రీత్యా నటనకు అంత స్కోప్ లేకపోయినా ఉన్న పరిధిలో చక్కగా నటించారు. పోలీస్ గా పోసాని, హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించిన సత్య, బావగా నటించిన ప్రిన్స్ తో పాటు సపోర్టింగ్ రోల్స్ చేసిన అందరు నటులు ఆకట్టుకున్నారు. హీరో చెల్లి పాత్ర చేసిన సర్గన్ కౌర్ నటన ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకుంది.
అశ్వథామ చిత్రానికి శ్రీచరణ్ పాకాల అందించిన పాటలు పరవాలేదు. జిబ్రాన్ బీజీఎమ్ సినిమాకు బాగా ప్లస్ అయింది. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ చక్కగా కుదిరింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా వున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరమీదకెక్కించారు. ఇక దర్శకుడు రమణ తేజ నూతన దర్శకుడు అయినప్పటికీ చాలా వరకు ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించారు. చెప్పాలనుకున్న కథ నుంచి ఎక్కడా డీవియేట్ కాకుండా నడిపించిన విధానం బాగుంది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడంలో సక్సెస్ అయింది. వీకెండ్ లో మంచి థ్రిల్ అయ్యే సినిమా. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3.5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here