అలరించే పొలిటికల్ థ్రిల్లర్ “బందోబస్తు”

0
11

వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అలరిస్తున్నాడు సూర్య. ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడు. సూర్య నటించిన తాజా సినిమా ‘బందోబస్త్’ కూడా అలాంటిదే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకుడు. ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం పదండి.

కథ: ప్రధాని చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్) ప్రజల మేలు కోరే స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు. నిజాయితీ గల ప్రధానిగా దేశానికి కీడు చేస్తోన్న వారి పై యాక్షన్ తీసుకోవటానికి ఆర్డర్స్ పాస్ చేస్తాడు. ఈ క్రమంలో రవి కిషోర్ (సూర్య) ఒక పవర్ ఫుల్ ఆఫీసర్. సీక్రెట్ ఆపరేషన్స్ లో భాగంగా తన డ్యూటీ చేస్తూ.. చంద్రకాంత్ వర్మకి దగ్గర అవుతాడు. ప్రధానికి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా రవి కిషోర్ (సూర్య) నియమించబడతాడు. ఈ క్రమంలో అంజలి (సయేషా సైగల్)తో ప్రేమలో పడతాడు రవి కిషోర్. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఉగ్రవాదుల పేరుతొ జరిగిన దాడిలో ప్రధాని చంద్రకాంత్ వర్మ చనిపోతారు. ఆ తరువాత ఎవరు ప్రధాని అయ్యారు ? అసలు ప్రధానిని చంపింది ఎవరు ? దాని వెనుకున్న రహస్యాన్ని చేధించడానికి రవి కిషోర్ ఏమి చేశాడు ? ఇంతకీ మహావీర్ (బోమన్ ఇరానీ) ప్రధాని హత్యకి సంబంధం ఏమిటి ? చివరికి రవి కిషోర్ అసలు నిందితులను పట్టుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: పొలిటికల్ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో వచ్చిన ఈ సినిమా యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో  ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ సీన్స్ అలరిస్తాయి. ప్రధానంగా సినిమాలో పీఎం చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్) పాత్ర హత్య జరగడం. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన సూర్య మరియు మిగిలిన ప్రధాన పాత్రలు..  సినిమాలోని కొన్ని విచారణ సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకే ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి.
పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలో సూర్య ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. ముఖ్యంగా తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ తన యాక్టింగ్ తో సినిమాలో సీరియస్ నెస్ తో పాటు ఇంట్రస్ట్ ను కూడా బాగా మెయింటైన్ చేశారు. ఇక పీఎం చంద్రకాంత్ వర్మ అనే పాత్రలో మోహన్ లాల్ తన నటనతో ఈ సినిమాలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. సయేషా సైగల్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన హీరో ఆర్య కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు బోమన్ ఇరానీ, సముద్రఖని, పూర్ణ, తమ నటనతో ఆకట్టుకున్నారు

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ఈ సినిమాకి కెమెరామెన్ గా పని చేసిన ఎం ఎస్ ప్రభు సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు హరీష్ జయ్ రాజ్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ స్ లో నేపథ్య సంగీతం చాల బాగుంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. నిర్మాత సుభాస్కరన్‌ అల్లిరాజా పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు మంచి కథాంశం తీసుకుని.. ఆ కథాంశానికి తగ్గట్లు ఉత్కంఠభరితమైన కథాకథనాలను రాసుకున్న తీరు బాగుంది. ఓవరాల్ గా బందోబస్తు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది.
రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here