నాకు హిందీలో మంచిమార్కెట్  ఉంది- బెల్లంకొండ శ్రీనివాస్

0
32

‘అల్లుడు శీను’, ‘జయ జానకి నాయక’ లాంటి హిట్ చిత్రాలతో  టాలీవుడ్ లో మంచి హిట్ సాధించిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు తేజ డైరెక్షన్లో ‘సీత’లో నటించారు. ఇది ఈ నెల 24న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు అతని మాటల్లోనే మీ కోసం…

‘సినిమా చాలా బాగా వ‌చ్చింది. చివ‌రి అర‌గంట విప‌రీతంగా ఎమోష‌నల్‌గా ఉంటుంది. అంత‌కు ముందంతా న‌వ్విస్తూ ఉంటుంది. ఇందులో నేను 20 ఏళ్లు జ‌నాల‌కు దూరంగా పెరుగుతా. చాలా డీసెంట్ గా పెరిగిన ఓ అబ్బాయి ఈ జ‌నార‌ణ్యంలోకి వ‌స్తే ఎలా ఉంటుంది? అందులోనూ డ‌బ్బే స‌ర్వ‌స్వం అనుకునే అమ్మాయికి, నిదానంగా ఉండ‌టం మేల‌నుకునే అబ్బాయికి ప‌రిచ‌యం ఏంటి? అది ఏ తీరాల‌కు దారి తీసింద‌నేది ఈ క‌థ‌లో కీల‌కం. ఇందులో చాలా వేరియేష‌న్లు ఉంటాయి. చాలా కొత్త‌గా ఉంటుంది. తేజ‌ రెండు క‌థ‌లు చెప్పారు. నాకు ఈ క‌థ న‌చ్చింది. మా నాన్న‌గారికి మ‌రో క‌థ న‌చ్చింది. న‌న్ను నేను ప్రూవ్ చేసుకోవ‌డానికి ఈ క‌థ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నా న‌మ్మ‌కం. నా తొలి సినిమాలో కాస్త కామెడీ చేశాను. ఆ త‌ర్వాత ఇప్ప‌టిదాకా కామెడీ చేయ‌లేదు. ఈ సినిమాలో తేజ‌ చేయించారు.
తేజతో పనిచేయడం చాలా స్వీట్‌గా ఉంది. ఆయ‌న మంచి ఇన్‌పుట్స్ ఇస్తారు. అలా చేయి.. ఇలా చేయి.. అని చెప్ప‌రు. ఎలా చేస్తే బావుంటుందో ఆలోచించుకోమ‌ని చెబుతారు. అది నాకు చాలా ఉప‌యోగ‌ప‌డుతోంది. `సీత‌` త‌ర్వాత `రాక్ష‌సుడు` సెట్‌కి వెళ్లినా స‌రే, ఆ పార్ములానే యూజ్ చేసి చేసేవాడిని. ఇందులో కాజల్ పాత్ర చాలా సీరియ‌స్‌గా ఉంటుంది. తేజ‌ నాకు ఈ క‌థ చెప్పేట‌ప్పుడే హీరోయిన్‌గా కాజ‌ల్ ఫిక్స‌యి ఉన్నారు. అంత‌టి సీనియ‌ర్ ఈ పాత్ర‌లో న‌టించ‌డం చాలా అవ‌స‌రం. సీత టైటిల్ నేనే సజెస్ట్ చేశా. ఈ సినిమాకు, ఈ టైటిలే క‌రెక్ట్. లేడీ ఓరియంటెడ్‌గా టైటిల్ పెట్టాలంటే చాలా మంది ఒప్పుకోర‌ట‌. నేను ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉంద‌ని కొంద‌రు ఫోన్లు కూడా చేశారు. ఇందులో చాలా హైలైట్స్ ఉంటాయి. సినిమాలో పాత్ర‌ల చిత్రీక‌ర‌ణ‌, కాంబోడియాలోని లొకేష‌న్లు, క‌థ‌, క‌థ‌నం.. ఒక‌టేంటి చాలానే ఉంటాయి. అందులో ఓఓ అని వెరైటీ శ్లాంగ్‌లో నేను చెప్పే ఊత‌ప‌దం ఒక‌టి.  సోనూసూద్ ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. మా సంస్థ‌లో గ‌తంలో ఆయ‌న కందిరీగ చేశారు. అప్పుడే నాకు ఆయ‌న‌తో మంచి ప‌రిచ‌యం ఉంది. కానీ ఈ సినిమాతో క్లోజ్ అయ్యారు. జ‌న‌ర‌ల్‌గా ఇండ‌స్ట్రీలో మ‌న‌కు పెద్ద‌గా ఫ్రెండ్స్ ఉండ‌రు. కానీ సోనూసూద్‌గారు నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. ప్రస్తుతం ‘రాక్ష‌సుడు’ చేస్తున్నా. పూర్తి కావ‌చ్చింది. నాకు హిందీలో మంచి మార్కెట్ ఉంది. అందుక హిందీ కోసం కాస్త స్పెష‌ల్‌గా కొన్నిటిని చేస్తున్నాం. హిందీలో బ‌న్నీవి, నావి ఎక్కువగా చూసే సినిమాలు. భ‌గ‌వంతుడు హిందీ మార్కెట్‌ను క్రియేట్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. `రాక్ష‌సుడు` జులైలో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా నాన్నకు స‌ర్‌ప్రైజ్ ప్యాక్‌. మా అమ్మ‌, త‌మ్ముడు చూశారు. చాలా బాగా క‌నెక్ట్ అయి ఏడ్చేశారు. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here