తెలుగు రాష్ట్రాలకు ‘భారత్‌ యూనివర్సిటీ చెన్నై’ రూ.10 లక్షల విరాళం.

0
254

కరోనా కష్టకాలంలో భారత్‌ యూనివర్సిటీ చెన్నై డీన్, అడ్మిషన్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ యం. రాజశేఖర్‌ రెడ్డి అండ్‌ టీమ్‌ రెండు తెలుగు రాష్ట్రాల సీయంల సహాయనిధికి 10 లక్షల విరాళాన్ని అందచేయనున్నారు. 5 లక్షలను తెలంగాణకు, 5లక్షలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఇస్తున్నామని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు విధ్యార్ధులు తమ తల్లితండ్రులు సేఫ్‌గా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఇదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీలో చాలామంది తెలుగు విద్యార్ధులు చదువుతున్నారు. దేశంలోని కాలేజీలు, యూనివర్సిటీలు, తమ తెలుగు విధ్యార్ధుల కోసం తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాలకు తమకు తోచిన విధంగా ఎంతోకొంత సాయం చేయాలని ఆయా కాలేజీల యాజమాన్యాలను కోరారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ను పాటిస్తూ కరోనా కాలంలో ఎంతో కొంత సహాయం అందించాల్సిన అవసరం ఉందని రాజశేఖర్‌ రెడ్డి కోరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here