యష్ రంగినేని నిర్మిస్తున్న చిత్రం ప్రారంభం

0
18

ఘనంగా ప్రారంభమైన బిగ్ బెన్ సినిమాస్ ప్రొడక్షన్ నెం. 6 సినిమా

“పెళ్లి చూపులు”, “డియర్ కామ్రేడ్”, “దొరసాని” వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ తన 6వ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించింది. యష్ రంగినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతన్య రావ్, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ పిట్ట కథ చిత్రంతో ప్రతిభవంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చెందు ముద్దు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో శుక్రవారం ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నిర్మాత సురేష్ బాబు క్లాప్ నివ్వగా దర్శకులు తరుణ్ భాస్కర్ కెమెరా స్విఛ్ ఆన్ చేసారు అలాగే మొదటి షాట్ కు దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు . ఇంకా ఈ కార్యక్రమంలో మధుర శ్రీధర్ రెడ్డి, సందీప్ రాజ్, సాయి రాజేష్, తమ్మారెడ్డి భరద్వాజ, శరత్ మరార్, దర్శకుడు కే వి ఆర్ మహేంద్ర, మాటల రచయిత లక్ష్మీ భూపాల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

*నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ*…మా మొదటి సినిమా పెళ్లి చూపులు విడుదలైన తేదీ జూలై 29. అదే రోజున మా కొత్త చిత్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. పిలిచిన ప్రతి ఒక్కరూ మా కార్యక్రమానికి అతిథులుగా వచ్చి మా టీమ్ కు విశెస్ తెలియజేశారు. మా సంస్థలో ఆరో సినిమాగా ఇది. గ్రామీణ నేపథ్యంతో సాగుతుంది. దాదాపు అంతా కొత్తవాళ్లే నటిస్తున్న ఈ సినిమాకు కథే స్టార్. చాలా ఫ్రెష్ గా ఉండే సబ్జెక్ట్ తో దర్శకుడు చెందు ముద్దు తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 1 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. అమలాపురం, అరకు ప్రాంతాల్లో దాదాపు నెల రోజులు షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత సెప్టెంబర్ లో కేరళ షెడ్యూల్ ఉంటుంది. అక్టోబర్ కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసేందుకు ప్రయత్నిస్తాం. అన్నారు.

*హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ*…నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు థాంక్స్. చెందు ముద్దును కలిసిినప్పుడు ఈ కథ చెప్పారు. ఆయన ఓ పిట్ట కథ సినిమా నాకు బాగా నచ్చింది. నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. ఈ సబ్జెక్ట్ విన్నాక నా కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది అనిపించింది. సక్సెస్ మీట్ లో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాం అనే నమ్మకం కలిగింది. ఈ సినిమాతో ఓ విజయాన్ని ఇచ్చి నిర్మాతకు, దర్శకుడికి థాంక్స్ చెప్పుకుంటాం. అన్నారు.

*హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ*…పల్లెటూరి నేపథ్యంగా సాగే చిత్రమిది. అన్ని కమర్షియల్ అంశాలు కథలో ఉన్నాయి. చెందు చేసిన ఓ పిట్ట కథ నా ఫేవరేట్ మూవీ. ఈ కథతోనూ ఆయన ఓ మంచి సినిమా చేస్తారని నమ్మకం కలిగింది. ఇందులో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అని చెప్పింది.

*నటి ఉత్తర మాట్లాడుతూ*…మా సినిమాకు మంచి స్క్రిప్ట్ కుదిరింది. ఈ చిత్రంలో నేనొక కీలక పాత్రలో నటిస్తున్నాను. మాలాంటి న్యూ టాలెంట్ కు అవకాశం ఇచ్చిన నిర్మాత యష్ గారికి థాంక్స్.

*దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ*…విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ ఇది. మా టీమ్ అంతా దాదాపు కొత్తవాళ్లం. ఒక కొత్త తరహాలో, ప్రయోగాత్మక పద్ధతిలో ఈ సినిమా మేకింగ్, లొకేషన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. ఒక హిట్ సినిమాను మా నిర్మాత యష్ గారికి ఇవ్వబోతున్నాం. అన్నారు.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రాఫర్ పంకజ్ తొట్టాడ, నటి మిహిరా తదితరులు పాల్గొన్నారు.

*నటీనటులు* : చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, రాఘవ, ఆదిత్య తదితరులు

*సాంకేతిక నిపుణులు* : సంగీతం – ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రఫీ – పంకజ్ తొట్టాడ, ఎడిటర్ – డి వెంకట్ ప్రభు, పీఆర్వో – జీఎస్కే మీడియా, బ్యానర్ – బిగ్ బెన్ సినిమాస్, నిర్మాత – యష్ రంగినేని, రచన దర్శకత్వం – చెందు ముద్దు.

 

Big Ben Cinemas Production 6 launched grandly!!

Passionate producer Yash Rangineni’s Big Ben Cinemas have been coming up with path breaking films since their first film ‘Pelli Choopulu’.

Continuing the zeal, Big Ben Cinemas 6th production starring Chaitanya Rao, Lavanya as the leads in ‘O Pitta Katha’ fame Chendu Muddhu’s direction launched today.

Ace Producer Suresh Babu gave the clap to the film, new-gen filmmaker Tharun Bhascker switched on the camera and first shot directed by Vivek Athreya. Madhura Sreedhar Reddy, Sandeep Raj, Sai Rqzesh, Lakshmi Bhupal and other guests graced the event commenced in Ramanaidu Studios. Speaking on the occasion…

Producer Yash Rangineni says, “Our first production ‘Pellichopulu’ was released on this day July 29th. It feels exciting to start our 6th production on the same day. Everyone we invited has graced the event and wished success to the team. Filming with a village backdrop story, we’ve casted many new talents. Story itself is the crowd pulling star of this film. Regular shoot will commence from August 1st in the locations of Amalapuram and Araku for a month. Kerala schedule will begin from September. We’ll make sure the First copy will be ready by October.”

Hero Chaitanya Rao says, “I thank my producer and director for this opportunity. I liked my dir Chendu Muddhu’s previous film O Pitta Katha. As soon as he narrated the story when I met him I loved it and pretty sure that it’s gonna be first blockbuster in my career. I strongly believe we’ll definitely meet you in its success meet”

Heroine Lavanya says, “Helmed with a village backdrop story, it has all the commercial elements too. Our director Chendu’s O Pitta Katha is my fvt film. I’m sure this will be another exciting flick from him. My character is very interesting in this project”

Actress Uttara says, “We’ve a good script for this film. I’m playing a crucial role in it. Thanks to producer Yash for encouraging new talents like us with opportunities”

Director Chendu Muddu says, “This film’s story has village backdrop. We’ve young team in this project. Planning it differently with an experimental screenplay, making and locations. We’re sure about presenting a hit film to our producer Yash.”

Cast: Chaitanya Rao, Lavanya Rao, Mihira, Uttara, Raghava, Aditya etc.

Technicians:
Music director – Prince Henry
Cinematography – Pankaj Tottada
Editor – D. Venkat Prabhu
PRO – GSKMEDIA
Banner – Big Ben Cinemas
Producer – Yash Rangineni
Written & Directed by Chendu Muddu.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here