రివ్యూ: బ్లఫ్ మాస్టర్

0
52

తమిళంలో ఘనవిజయం సాధించిన  చిత్రం చ‌తురంగ వేట్టై`. తెలుగులో `బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌` పేరుతో రీమేక్ అయింది.  శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత ర‌మేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాత. గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి దర్శకుడు.  `జ్యోతిల‌క్ష్మి`, `ఘాజి` చిత్రాల ఫేమ్ స‌త్య‌దేవ్ హీరోగా నటించారు . `ఎక్క‌డికి పోతావు చిన్నవాడా` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన  నందితా శ్వేత ఇందులో  నాయిక‌. ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి తమిళంలో లాగ తెలుగులోనూ ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: ఉత్తమ్(సత్యదేవ్) చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. అనాథగా పెరిగిన ఉత్తమ్.. పెరిగి పెద్ద అయిన తరువాత ఎలాగో అలాగ డబ్బులు సంపాధించి గొప్ప ధనవంతుడు అయ్యి.. ఐలాండ్ లో ఓ బంగ్లా కట్టించుకోవాలనేది అతని కల.. అందుకు ఇద్దరి స్నేహితులు సహకారం తీసుకుని వివిధ రకాలుగా ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదిస్తాడు. అయితే ఈ క్రమంలో ఉత్తమ్ అవని(శ్వేతా మీనన్) పరిచయం అయ్యి.. అది ప్రేమగా పెళ్లికి దారితీస్తుంది. ఈ క్రమంలో ఉత్తమ్ ఎలాంటి అడ్డదారులు ఎంచుకున్నాడు… దాని వల్ల అతనికి ఎదురైన ఇబ్బందులేంటి అనేదే మిగతా కథ.

కథ.. కథనం విశ్లేషణ: మనిషికి ఆశ ఉండడం సహజం.. కానీ అది అత్యాశగా మారినప్పుడే అనర్ధాలు జరుగుతాయి.  అత్యాశ‌ప‌రుల‌ను టార్గెట్ చేసే ఓ వ్యక్తి కథను దర్శకుడు తెరకెక్కించిన తీరు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమాజంలో మన చుట్టూ జరుగుతున్న మోసాలనే కథనంగా ఎంచుకుని అనేక ట్విస్టులతో ప్రేక్షకును థ్రిల్ అయ్యేలా బ్లఫ్ మాస్టర్ ని తెరమీద చూపించారు. త‌మిళంలో తెర‌కెక్కిన `చ‌తురంగ వేట్టై` ఎలాగైతే తమిళ ప్రేక్షకులను అలరించిందో… బ్లఫ్ మాస్టర్ కూడా తెలుగు ప్రేక్షకులను అలానే అలరిస్తుందనడంలో సందేహం లేదు.
ప్రజలను చాలా సులువుగా మోసం చేసే పాత్రలో సత్యదేవ్ చక్కగా నటించాడు. అతని స్నేహితులు గా కృష్ణ చైతన్య, మరోవ్యక్తి కూడా బాగా చేశారు. డబ్బు ఈజీగా సంపాధించాలనే అత్యాశపరుని క్యారెక్టర్లో పృథ్వీ నటించి మెప్పించారు. హీరో చేసే మోసాలకు సహాయం చేసే పాత్రలో బ్రహ్మాజీ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన ఆదిత్య మీనన్.. అతనికి సహాయకునిగా టెంపర్ వంశీ చేసిన పాత్రలు ఆకట్టుకున్నాయి. హీరోయిన్ నందిత శ్వేతా కూడా తన పాత్రకు న్యాయం చేసింది.
దర్శకుడు గోపీ గణేష్ బాగా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా ట్విస్టులు బాగా చూపించారు. ఈ చిత్రానికి సంభాషణలు బాగా ప్లస్ అయ్యియి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండు. ఈ వీకెండ్ లో సరదాగా చూడటానికి ‘బ్లఫ్ మాస్టర్’ పర్ ఫెక్ట్ ఛాయిస్. గో అండ్ వాచ్ ఇట్..!
రేటింగ్: 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here