“ది మిస్టీరియస్ మేహెమ్” బుక్ ను లాంచ్ చేసిన రచయిత శ్రీ రాజ్‌దీప్ సర్దేశాయ్

0
77

ఈశాన్వి కేసిరెడ్డి ఇండియా నుండి హార్రీ పోర్టర్ లాంటి కథలు రాసే స్థాయికి ఎదగాలి.. జర్నలిస్ట్, రచయిత శ్రీ రాజ్‌దీప్ సర్దేశాయ్

10 సంవత్సరాల అమ్మాయి ఈశాన్వి కేసిరెడ్డి రాసిన ” ది మిస్టీరియస్ మేహెమ్” బుక్ ను లాంచ్ చేసిన రచయిత శ్రీ రాజ్‌దీప్ సర్దేశాయ్ మరియు సినీ నటుడు నిఖిల్ సిద్దార్థ్

యువ/ వర్ధమాన రచయిత్రి ఈశాన్వి కేసిరెడ్డి ఇద్దరు అమ్మాయిలు సాహసాలను బుక్ గా రాసి తన పాఠకులకు అందిస్తుంది. ఈ అమ్మాయి రచించిన తొలి పుస్తకం ‘ ది మిస్టీరియస్ మేహెమ్’. ఈ పుస్తకాన్ని వైట్ ఫాల్కన్ పబ్లిషింగ్ ప్రచురించింది.10 సంవత్సరాల వయస్సులో ఉండే ఈశాన్వి కేసిరెడ్డి ఈ పుస్తకాన్ని రాయడం విశేషం.ఈశాన్వి ఇంత చిన్న వయసులో ఇలాంటి అడ్వెంచర్ & మిస్ట్రీ కథతో బుక్ రాయడం వలన చాలా మంది పిల్లలకు ప్రేరణగా నిలిచింది.ఈ బుక్స్ నుండి వచ్చే ఆదాయమంతా టి. హోప్ ఆర్గనైజేషన్ కు వెళ్తుంది. దాని ద్వారా అనాదపిల్లలకు చేరుతుంది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌ లోని రాడిసన్ హోటల్ లో సాయంత్రం 4 గంటలకు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ఇండియన్ న్యూస్ యాంకర్, జర్నలిస్ట్ మరియు రచయిత శ్రీ రాజ్‌దీప్ సర్దేశాయ్ మరియు సినీ నటుడు నిఖిల్ సిద్దార్థ్ లు లాంచ్ చేయడం జరిగింది.అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

జర్నలిస్ట్ మరియు రచయిత శ్రీ రాజ్‌దీప్ సర్దేశాయ్ మాట్లాడుతూ.. కోవిడ్ టైమ్ లో ఈశాన్వి కేసిరెడ్డి ఈ బుక్ రాయడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలు రాయడం మంచిది. రైటింగ్ అనేది ఈ మధ్య తగ్గిపోతుంది.ఇలాంటి టైమ్ లో ఈ అమ్మాయి రాసిన బుక్స్ చదివి ఇన్స్పిరేషన్ అయ్యి చాలా మంది రాయడానికి ముందుకు రావాలి.అలాగే సొసైటీలో ఏం జరుగుతుంది అనేది తెలియడానికి పిల్లలకు చిన్నప్పటి నుండే న్యూస్ పేపర్ చదవడం అలవాటు చెయ్యాలి.ప్రతి సంవత్సరం తను ఇలాంటి మిస్ట్రీ బుక్స్ రాయాలని కోరుతున్నాను.. ఈ అమ్మాయి బుక్ రాయడానికి తన పేరెంట్స్ ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే “హార్రీ పోర్టర్ ” లాంటి అడ్వెంచర్ కథలను రాసిన వారు పెద్దవాళ్ళు అయితే ఇంత చిన్న వయసులో మిస్ట్రీ, అడ్వెంచర్ రాయడమనేది చాలా గ్రేట్. ఈశాన్వి ఇండియా నుండి హార్రీ పోర్టర్ లాంటి కథలు రాసే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

సినీ నటుడు నిఖిల్ సిద్దార్థ్ మాట్లాడుతూ..ఇంత చిన్న వయసులో ఈశాన్వి “ది మిస్టీరియస్ మేహెమ్” బుక్ రాయడం చాలా గ్రేట్. ఈ అమ్మాయి రాసిన బుక్ చూసి నా చిన్న తనం గుర్తుకు వచ్చింది. నేను చిన్నప్పుడు పుస్తకాలు చదివాను. ఇప్పుడున్న ఇంటర్నెట్ కాలంలో పేపర్ మీద పెన్ను పెట్టి బుక్ రాయడం చాలా గ్రేట్ అన్నారు.

ఈశాన్వి కేసిరెడ్డి మాట్లాడుతూ.. నేను రాసిన “ది మిస్టీరియస్ మేహెమ్” బుక్ లాంచ్ చేయడానికి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు. నాకు బుక్స్ చదవడం రాయడం అన్నా .మిస్ట్రీ, అడ్వెంచర్ స్టోరీస్ అన్నా ఎంతో ఇష్టం.నాకు రచయిత మాలాల రాసిన బుక్స్ అంటే ఎంతో ఇష్టం.నేను 11 సంవత్సరాల అమ్మాయి రాసిన బుక్ చదివాను. అమ్మాయి రాసిన బుక్ కు ఇన్స్పిరేషన్ గా తీసుకొని “ది మిస్టీరియస్” మేహెమ్” బుక్ ను 2020 లో స్టార్ట్ చేశాను. మా అమ్మ, నాన్న లు సపోర్ట్ చేయడంవలెనే నేను ఈ బుక్ రాయగలిగాను.ఈ కథ గురించి చెప్పాలంటే .మియా మరియు సోఫీల అడ్వెంచర్ & మిస్ట్రీ తో కూడిన కథ ఇది . మియా మరియు సోఫీ ఫ్లోరిడాకు విహారయాత్ర కు వెళ్ళడానికి రెడీ అవుతారు ,అయితే వారు ఎక్కాల్సిన విమానం కాకుండా పొరపాటున వేరే విమానంలో ప్రయాణం చేయడంతో అక్కడనుండి వారి మిస్ట్రీ స్టార్ట్ అవుతుంది ఆతరువాత ఎం జరిగిందనే మిస్ట్రీ అడ్వెంచర్ కథే “ది మిస్టీరియస్ మేహెమ్”అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఈశాన్వి పేరెంట్స్ దివ్య రెడ్డి, రాజశేఖర్ రెడ్డి లతో పాటు సుభాషిణి,ఉపేందర్ రెడ్డి, సుజాత, సౌర్యా రెడ్డి తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here