రివ్యూ: నవ్వించే… క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘బ్రోచేవారెవరురా’

0
275

‘మెంటల్ మదిలో’ చిత్రాన్ని శ్రీవిష్ణుతో తెరకెక్కించి… అందరి మన్ననలు పొందిన వివేక్ ఆత్రేయ… ఇప్పుడు మరోసారి శ్రీవిష్ణుతోనే  ‘బ్రోచేవారెవరురా’ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో శ్రీవిష్ణుతో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రయదర్శి, సత్యదేవ్ లు నటించగా… ఫిమేల్ లీడ్ గా నివేదా థామస్, నివేత పేతురాజ్ నటించారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. మరి ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.

కథ: రాహుల్(శ్రీవిష్ణు), రాఖీ(ప్రయదర్శి), ర్యాంబో(రాహుల్ రామకృష్ణ) ముగ్గురూ మంచి మిత్రులు. ఇంటర్లో మూడు సార్లు తప్పి… అక్కడే చదువుతూ వుంటారు. వాళ్ళు చదివే కాలేజీలోకే ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయిన ఆర్కే(శ్రీకాంత్ అయ్యంగార్) కూతురు మిత్ర(నివేదా థామస్) కూడా వస్తుంది. శ్రీవిష్ణు గ్యాంగ్ తో స్నేహం చేస్తుంది. ఆ తరువాత జరిగే ఓ ప్రధాన సంఘటన వల్ల మిత్ర తన తండ్రికి దూరంగా వెళ్లిపోయి… తనకిష్టమైన భరత నాట్యంలో రాణించాలని హైదరాబాద్ కి వచ్చేస్తుంది. అయితే.. హైదరాబాద్ లో మిత్ర కిడ్నాప్ కి గురవుతుంది. ఆమెను కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఆమె కిడ్నాప్ నుంచి ఎలా బయటపడింది? ఆమె హైదరాబాద్ కు పోవడానికి శ్రీవిష్ణు బ్యాచ్ ఏవిధంగా సహాయం చేసింది? తదితర విషయాలు తెలయాలంటే సినిమా చూడాల్సిందే.

కథ, కథనం విశ్లేషణ: కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన బ్రోచేవారు ఎవరురా.. చిత్రం ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్విస్తూనే వుంటుంది. చలనమే చిత్రము.. చిత్రమే చలనము అని ట్యాగ్ లైన్ పెట్టినప్పుడే ఈ చిత్రం ఏంటో అర్థమైంది. ఈ రెండు పదాల్లోనే సినిమా కథ అంతా చెప్పేసాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. మెంట‌ల్ మ‌దిలో సినిమాతో ఏదో తెలియ‌ని మ్యాజిక్ చేసి.. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న వివేక్ ఆత్రేయ… ఇప్పుడు అదే మ్యాజిక్ ను బ్రోచేవారు ఎవరురాలోనూ చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను నవ్వించారు. స్టోరీలో కొత్తదనం లేకపోయినా… స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయింది. ఎక్కడో మొదలు పెట్టి… వాటిని ఎక్కడెక్కడో కనెక్షన్ ఇచ్చేసి.. చివరకు కథను సుఖాంతం చేయడం చాలా ఎంటర్టైనింగ్ గా వుంటుంది. ప్ర‌తి స‌న్నివేశంలోనూ త‌న‌ ముద్ర వేసి.. ప్రేక్షకును మెప్పించాడు. కాలేజ్ స‌న్నివేశాల‌న్నీ చాలా బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి.. ఫ‌న్ కూడా బాగుంది. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు కామెడీగా క‌థ సాగినా.. ఆ త‌ర్వాత మాత్రం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అయిపోయింది. స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో సెకండాఫ్ మ‌రింత ప‌క‌డ్భందీగా రాసుకున్నాడు వివేక్ ఆత్రేయ‌. చూసినంత సేపు హాయిగా సాగిపోయే డిఫెరెంట్ ఫ‌న్ ఎంట‌ర్ టైన‌ర్ బ్రోచేవారెవరురా.

శ్రీ‌విష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. వీరి ముగ్గురు చేసే కామెడీ… వీరి మధ్య వచ్చే సన్నివేషాలన్నీ చాలా ఫన్నీగా.. థ్రిల్లింగ్ గా వున్నాయి. అలానే నివేద థామస్ కూడా తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసింది. డైరెక్టర్ కావాలనే ఉత్సాహం వున్న యువకుని పాత్రలో సత్యదేవ్ నటించారు. అతనికి తోడుగా నివేత పేతురాజ్ నటించింది. వీరిద్దరి కెమెస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయింది. నివేత థామస్ తండ్రిగా ఆర్కే… పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన హర్ష మధ్య వచ్చే సీన్స్ చాలా కామెడీగా వున్నా.. క్లైమాక్స్ లో సాగే ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ‘ఇట్ ఈజ్ సమ్ థింగ్ ఫిష్షీ’ డైలాగ్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. మిగతా పాత్రలన్నీ ఒకే.

వివేక్ ఆత్రేయ.. మరోసారి తన మార్కు మ్యాజిక్ తో ఆకట్టుకున్నాడు. స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా రాసుకుని.. తెరమీద చూపించారు.దాంతో ప్రతి ఒక్క ఆడియన్ ఇట్టే కనెక్ట్ అయిపోతారు. ఈ చిత్రానికి సంగీతం కూడా బాగుంది. నేపథ్య సంగీతం ఇంట్రెస్టింగ్ గా వుంటుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. గో అండ్ వచా్ ఇట్..!

చివరగా… వన్వించే… క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘బ్రోచేవారెవరురా’

రేటింగ్: 3.25

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here