‘వదలడు’ చిత్రంలో జ్యోతి అనే టీచర్‌గా  కనిపిస్తా- కేథరిన్

0
72

‘తమిళం, తెలుగు భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన కేథరిన్ థెరిసా… ఇప్పుడు సిద్ధార్థ్ తో కలిసి ‘వదలడు’ చిత్రంతో మనముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘భాషలు వేరైనా సినిమా ఎక్కడైనా ఒకటే’ అంటోంది.  ‘ఇద్దరమ్మాయిలతో’,  ‘సరైనోడు’, తదితర  చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె. ..11న వస్తున్న ‘వదలడు’ చిత్రంతో అలరించబోతోంది. సాయి శేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన  ఈచిత్రం గురించి మరిన్ని విశేషాలు ఆమె  మాటల్లోనే….
‘ఈ చిత్రంలో జ్యోతి అనే టీచర్‌గా  కనిపిస్తా. తను వాసనను గుర్తించలేదు. సామాజిక సందేశం ఉన్న చిత్రమిది. ఆహార కల్తీ అనర్థాల గురించి చెప్పబోతున్నాం. యాక్షన్‌ అంశాలూ ఉంటాయి. సిద్ధార్థ్‌ ఆహార భద్రత అధికారిగా కనిపిస్తారు. సిద్ధార్థ్‌ తరచూ సమాజంలోని సమస్యలపై సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తుంటారు. నేనూ అలా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. నటనపరంగా  సిద్ధార్థ్‌ సలహాలు ఇస్తుంటారు. తమన్‌ ఇచ్చిన సంగీతం చాలా బాగుంది. నేను నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే ఎంచుకుంటున్నా. ‘సరైనోడు’లో నేను చేసిన ఎమ్మెల్యే పాత్రకు ఎంతో పేరొచ్చింది. కొత్తదనం నిండిన కథలు దొరికితే ఏ భాషలోనైనా ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధం. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడమంటే నాకు అసలు నచ్చదు. ప్రస్తుతం నేను తెలుగులో విజయ్‌ దేవరకొండతో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో నటిస్తున్నా’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here