చంద్రబాబు స్కెచ్ తో మోడీకి దిమ్మతిరగాల్సిందే!

0
405

సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్.. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో సంచలన ప్రకటన చేశారు. తనకు రాజయకీయాల్లో హీరో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఘంటాపథంగా ప్రకటించడంతో.. ఇప్పుడు ఏపీలో వున్న ప్రతి పక్షాల్లో గుబులు రేపుతోంది. దాంతో పాటు.. కేంద్రంలో వున్న బి.జె.పి.పైనా కొంత ప్రభావం చూపింది. ఎందుకంటే.. గతంలోనే జీఎస్టీ ప్రకటించినప్పుడు కేంద్రాన్ని ట్విట్టర్లో ఏకి పారేశాడు కమల్. దాంతో దెబ్బకు కేంద్ర ఆర్థిక మంత్రే ప్రెస్ మీట్ పెట్టి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పబ్లిక్ సమక్షంలో చంద్రబాబే తనకు ఆదర్శం అనే కోణంలో కమల్ చేసిన వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అదీనూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఆసీనులైన ఈ వేదికపైనే కమల్ అలా అన్నాడంటే… భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు ఎలా వుంటాయో అనేది ఊహించేయొచ్చు. అయితే కమల్ హాసన్ చంద్రబాబును పొగడటం ఇదే మొదటి సారి కాదు. గతంలోనే ఓ నేషనల్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలోనూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు పార్టీ ప్రకటించిన రోజే ఇలా చంద్రబాబును పొగటం చూస్తుంటే వచ్చే ఎన్నికల సమయంలో ఒక వేళ కమల్ పార్టీ క్లిక్ అయితే చంద్రబాబు అడుగు జాడల్లో నడిచే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై శీతకన్ను వేసిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు.. చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి నడుం బిగిస్తాడనడంలో సందేహం లేదు. ఇప్పటికే అకాళీదళ్, శివసేన, తృణముల్, ఆప్ పార్టీలు చంద్రబాబుతో టచ్ లో వున్నాయి. నితీష్, అఖిలేష్ లాంటోళ్లు ఎప్పుడైనా బాబు పిలిస్తే పలికేవాళ్లే. ఈ రాష్టాలే వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరోసారి రాబోవు కాలంలో చక్రం తిప్పుతాడనేది నిస్సందేహంగా చెప్పొచ్చు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here