కేంద్రం గుడ్డలిప్పదీసిన చంద్రబాబు..! సిగ్గుతో అడ్డుకోబోయిన రాజ్‌నాథ్..!!

0
159

నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు .. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రదానమంత్రి నరేంద్రమోదీని కడిగిపారేశాడు. రాజకీయ కారణాలతో ఆంధ్రప్రదేశ్ పై చూపిస్తున్న వివక్షను… కళ్ల ముందు కట్టినట్లు నీతిఆయోగ్ సమావేశం ద్వారా చంద్రబాబు దేశం ముందు పెట్టారు. చంద్రబాబు చెబుతున్న ఒక్కో అంశంతో… బీజేపీ నేతలకు… ముఖ్యంగా ప్రధాని మోదీకి, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కళ్లు బైర్లుకమ్మాయి. అందరి ముందు..తమను నగ్నంగా ఊరేగిస్తున్న ఫీలింగ్‌లో వారిద్దరూ పడిపోయారు. అందుకే రాజ్‌నాథ్‌.. చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇచ్చిన సమయం ఏడు నిమిషాలేనని… అంతకు మించి ప్రసంగించకూడదని.. సొల్లు కబుర్లు చెప్పి… తమ పరువును కాపాడుకుందామని ప్రయత్నించారు.

కానీ అక్కడ ఉన్నది… వైఎస్ జగనో…కేసీఆరో కాదుగా.. చెప్పినట్లు వినడానికి…చంద్రబాబు… అక్కడ ఉంది చంద్రబాబు. నిలువుగా కడిగిపారేసేవరకూ.. ఆయన ప్రసంగాన్ని ఆపాలనుకోలేదు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన రాజ్‌నాధ్ కు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల లాంటిది కాదంటూ… నేరుగానే చెప్పారు. తన ప్రసంగాన్ని కొనసాగించారు. రైల్వే జోన్ నుంచి.. స్టీల్ ప్లాంట్ వరకూ… బడ్జెట్ లోటు భర్తీ దగ్గర్నుంచి కేంద్ర సంస్థలకు నిధుల వరకు… కేంద్ర ప్రభుత్వం ఎంత దారుణంగా… ఆంధ్రప్రదేశ్ తో వ్యవహరించిందో… లెక్కలతో సహా చంద్రబాబు వివరించి చెబుతూంటే.. సమావేశం మొత్తం ఆసక్తిగా చూసింది. రాష్ట్ర విభజన నాటి నుంచి నాలుగేళ్ల పాటు.. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం చూపించిన సవతి తల్లి ప్రేమను… క్షణ్ణంగా వివరించారు. దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్న ఆ సమావేశంలో.. .అందరూ… ఏపీకి కేంద్రం ఇంత అన్యాయం చేసిందా అని.. ఆసక్తిగా విన్నారు.

బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా… చంద్రబాబు చెబుతున్న వివరాలను ఆసక్తిగా విన్నారు. ప్రజల్లోకి సూటిగా వెళ్లే అంశాలు… అదీ కూడా.. కేంద్రం దుర్నీతిని బట్టబయలు చేసే విధంగా చంద్రబాబు ప్రసంగం సాగింది. చంద్రబాబు దూకుడు చూసి.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రాజ్‌నాథ్‌ కూడా సైలెంటయిపోయారు. దాదాపుగా ఇరవై నిమిషాల పాటు… ఏపీని కేంద్రం ఎంతగా మోసం చేసిందో చంద్రబాబు సాక్ష్యాలతో సహా వివరించారు. ఏపీ విషయంలో మోదీ తీరును… దేశం ముందు నగ్నంగా ఉంచారు చంద్రబాబు.
చంద్రబాబు ప్రసంగంతో మోదీ క్రెడిబులిటి పూర్తి స్థాయిలో ప్రమాదంలో పడినట్లే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here