చిరంజీవి & కొరటాల శివ సినిమాకు ముహూర్తం కుదిరిందా ?

0
669

స్టార్ హీరోల సినిమాలు ఏ దర్శకులతో ఉండబోతున్నాయా అని ఆసక్తి ఉండటం కామన్. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో అందరిచూపు హీరోల కంటే కూడా ఓ డైరెక్టర్‌పైనే ఎక్కువగా ఉంది. అందుకు కారణం ఆ దర్శకుడు తీసిన సినిమాలు. పైగా ఆ డైరెక్టర్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు అనేది ప్రస్తుతానికి హాట్ టాపిక్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే… ఆ దర్శకుడు మరెవరో కాదు కొరటాల శివ. హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో వర్క్ చెయ్యాలని ప్రతివోక్కరికి ఉంటుంది. కొరటాల శివ తాజాగా చిరంజీవి తో సినిమా చెయ్యబోతున్నాడనే విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ అంటే అభిమానుల్లో మామూలు అంచనాలు ఉండవు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను రామ్ చరణ్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి ‘మిర్చి’.. ప్రిన్స్ మహేష్ బాబుకి ‘శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’ జూనియర్ ఎన్టీఆర్‌కి ‘జనతాగ్యారేజ్’ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇచ్చిన కొరటాల శివ చిరంజీవితో మెసేజ్ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ చిరంజీవి పుట్టినరోజు సందర్భముగా ఆగష్టు 22న మొదలుకానుందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here