టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ‘చిత్రపటం’

0
28

కవి ఫిల్మ్ సిటీ సమర్పణలో, శ్రీ క్రియేషన్స్ పతాకంపై పార్వతీశం(నూకరాజు), శ్రీవల్లి హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు బండారు దానయ్య కవి దర్శకత్వంలో, పుప్పాల శ్రీధర్ రావు నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘చిత్రపటం’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం టాకీ పార్టు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ.. ‘‘విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే యూత్ & ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరణ జరిపాం. కోట శ్రీనివాసరావు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే పోసాని, శరణ్యగారు, నారెన్, బాహుబలి ప్రభాకర్ వంటి సీనియర్ ఆర్టిస్టులందరూ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలతో, యూత్‌ని ఆకట్టుకునే సంగీతంతో ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. అలాగే నెక్స్ట్ షెడ్యూల్‌లో పాటల చిత్రీకరణ జరపనున్నాం..’’ అని అన్నారు.

చిత్ర నిర్మాత పుప్పాల శ్రీధర్ రావు మాట్లాడుతూ.. ‘‘మా డైరెక్టర్ కవిగారు సినీ ఇండస్ట్రీలో పాటల రచయితగా అందరికీ సుపరిచితమైన వ్యక్తే. ఆయన చెప్పిన కథ అద్భుతంగా ఉంది. అలాగే ఆయన సినిమా తీస్తున్న విధానం ముచ్చటేస్తుంది. శరవేగంగా షూటింగ్ చేస్తూ నిర్మాతల మనిషి అనిపించుకుంటున్నాడు. మా సినిమాలో సీనియర్ ఆర్టిస్టులందరూ నటిస్తున్నారు. టాకీ పార్ట్ ఫినిష్ అయ్యింది. నెక్స్ట్ మంత్‌లో ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా పాటలను ఆవిష్కరించనున్నాం’’ అని అన్నారు.

పార్వతీశం, శ్రీవల్లి, కోట శ్రీనివాసరావు, బాలాచారి (‘విద్యార్థి’ సినిమా డైరెక్టర్) పోసాని, శరణ్య, నారెన్, బాహుబలి ప్రభాకర్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్. మురళీ మోహన్ రెడ్డి, ఎడిటర్: వినోద్, డిజైనర్: అజయ్, పి.ఆర్.ఓ: బి. వీరబాబు, నిర్మాత: పుప్పాల శ్రీధర్ రావు; కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: బండారు దానయ్య కవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here