శనివారం మణికొండలోని మర్రిచెట్టు జంక్షన్ వద్ద రూట్స్ దంత వైద్య శాలను మఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ సినీ నటులు మాగంటి మురళీమోహన్ గారు, పరుచూరి గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రూట్స్ దంత వైద్యశాల రెండవ శాఖను వారి చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని, రూట్స్ డెంటల్ కేర్ వ్యవస్థాపకులు డా.కురిమిళ్ళ సంతోష్ గౌడ్, డా.సిద్దార్థ్, డా.సురేష్ గౌడ్, డా.కుళ్ళిప్రభుతేజ్లను వారు అభినందించారు. మునుముందు నగరంలో మరిన్ని రూట్స్ డెంటర్ కేర్ శాఖలను స్థాపిస్తూ ముందుకు సాగాలని సూచించారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ గారు మాట్లాడుతూ.. ’చెట్టు పచ్చగా ఉండాలంటే దానికున్న రూట్స్ బలంగా ఉండాలి. ఇల్లు గట్టిగా ఉండాలంటే దానికింద ఉన్న పిల్లర్స్ అంటే రూట్స్ గట్టిగా ఉండాలి. అలాగే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మన తినడానికి సహకరించే దంతాలు, వాటి రూట్స్ బలంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను‘ అన్నారు.
ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ’సర్వేంద్రియానాం నయం ప్రధానం అన్నారు పెద్దలు. కానీ ఇప్పుడు దంతం ప్రధానం అనే రోజులు వచ్చాయి. మనిషి నవ్వితే అందం. ఆ అందానికి కారణం పళ్ళు. ఆ పళ్ళను రూట్స్‌తో సహా కాపాడుతారని హామీ ఇస్తున్నాను. రూట్స్ డెంటర్ కేర్ యువ వైద్యులందరికీ శుభాకాంక్షలు‘ అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖులు మురళీమోహన్‌గారు, దుగ్గిరాల పద్మజా కిశోర్, ప్రముఖ ఆడిటర్ వివేక్ మరియు వారి కుటుంబ సభ్యులు, టీవీ ఆర్టిస్టులు శ్రీరామ్, కొల్లి ప్రవీణ్‌కుమార్, నంద కిశోర్కిశోర్, సూర్యతేజ, అంకిత, ఉమాదేవి, సంతోషం సినీవారపత్రిక వ్యవస్థాపకులు సురేష్ కొండేటి హాజరయ్యి దంత వైద్యులను అభినందించారు.