నవ్యాంధ్ర పై “దొంగలముఠా” దాడి చేస్తోంది- దేవినేని ఉమా

0
400

*నవ్యాంధ్ర పై “దొంగలముఠా” దాడి చేస్తోంది*

*ప్రధాని మోదీ సూత్రధారీ… జగన్, పవన్, కన్నా, కేసీఆర్ పాత్రధారులు*

*ప్రత్యేక హోదా అడిగినందుకే ఐటీ దాడులు చేశారు*

*విభజ హామీలు ఆడిగినందుకే “కోడికత్తి” నాటకం*

*పోలవరం డబ్బులదిగినందుకే 200 మంది ఐటీ సిబ్బంది ని పంపారు*

*రాఫెల్ కుంభకోణంలో మోదీ రూ. 30 వేల కోట్లు అనిల్ కు దోచిపెట్టారు*

*జగన్ కు 14 మంది గాన్ మెన్లను ఇచ్చాం… 3 వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఈగ వాలకుండా చేసాం*

*”కోడికత్తి” పిల్ల రాజకీయాలు బాబుకు చేతకావు*

*ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కులదోసే కుట్ర జరుగుతోంది*

*లక్ష సమస్యలొచ్చినా చంద్రబాబు ఒక్కడే ఢీ కొంటాడు*

*చిన్న నందిగామ గ్రామ దర్శిని గ్రామ వికాశంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు*

_జి.కొండూరు (చిన్న నందిగామ):- ఐదున్నరకోట్ల మంది తెలుగు ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలుచేసేందుకు, కూల్చేందుకు దొంగలంతా కలసి దొంగలముఠా గా ఏర్పడ్డారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం నాడు జి.కొండూరు మండలంలోని చిన్న నందిగామ గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా ప్రసంగించారు. ఈ దొంగల ముఠాకి ప్రధాని మోదీ సూత్రధారి అయితే, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కల్యాణ్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాత్రధారులని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రావాల్సిన డబ్బులివ్వాలని ఆడిగినందుకే వందల మంది ఐటీ అధికారులతో కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుందని, రాష్టంలోని పారిశ్రామిక వేత్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కోడికత్తి నాటకామాడి రాష్టంలో అల్లర్లు సృట్టించేందుకు తద్వారా రాష్ట్రపతి పాలన పెట్టేందుకు కుట్ర చేస్తున్నట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి14 మంది పోలీసులతో సెక్యూరిటీ ఇచ్చామని, 3వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఈగ వాలకుండా చేశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ రక్షణ పరిధిలోని ఎయిర్ పోర్టులో జరిగిన సంఘటన ను సాకుగా చూపి వైకాపా నాయకులు సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. కోడికత్తి లాంటి పిల్ల రాజకీయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు చేతకావని, హత్యా రాజకీయాలకు, ఫ్యాక్షన్ రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ ఎంతో దూరమని తెలిపారు. సమస్యలను ఎదుర్కోవడం చంద్రబాబు కు కొత్తకాదని, లక్ష సమస్యలొచ్చినా ఒకే ఒక్కడిగా ఢీ కొంటారని చెప్పారు. గ్రామదర్శిని కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా సమూహాన్ని చూసి మంత్రి ఉమామహేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు. చిన్న నందిగామలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశామని, ఎస్సి మత్స్యకారులకు రూ. 40 లక్షలతో బిల్డింగ్ నిర్మాణం చేశామని, రూ. కోటి రూపాయలతో సీసీ రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 22 కొత్త ఎత్తిపోతల పథకాలు చేపట్టి రైతులకు సాగు నీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మూడో జోన్ కు నాగార్జున సాగర్ నీళ్లు తెచ్చేందుకు అహర్నిశలు శ్రామిస్తున్నట్లు, చివరి ప్రాంత భూములకు కూడా సాగు నీరు ఇచ్చి తీరుతామని మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు._

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here