డాక్టర్ బిందు మీనన్ కి ‘సాక్షి’ఎక్సలెన్స్ అవార్డు!!

0
556

ధనార్జనే ధ్యేయంగా.. దర్జాగా బ్రతకడమే లక్ష్యంగా వ్యహహరించే డాక్టర్లు ఎక్కువైపోతున్న తరుణంలో.. సేవే పరమావధిగా, ఆత్మ సంతృప్తే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కేరళకు చెంది.. ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడిన డాక్టర్ బిందు మీనన్. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం కలిగిన ఈ అసాధారణ యువ ప్రతిభాశాలి.. బాహ్య సౌందర్యం కంటే.. అంతఃసౌందర్యం ముఖ్యమని నమ్ముతారు. న్యూరాలజిస్ట్ గా తిరుపతి స్విమ్స్ లో ఆరేళ్ళు, న్యూరాలాజి హెడ్ గా నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ లో నాలుగేళ్లు సేవలందించి.. ప్రస్తుతం నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ బిందు మీనన్ .. వైద్యరంగంలో అందిస్తున్న సేవలకు గాను ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డు అందుకున్నారు. తెలంగాణ గవర్నర్ ఐ.ఎస్.ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి భారతి ముఖ్య అతిధులుగా హాజరైన వేడుకలో డాక్టర్ బిందు మీనన్.. అభిమానులు, ఆహుతుల కరతాళ ధ్వనుల నడుమ ఈ అవార్డును స్వీకరించారు. డాక్టర్ బిందు మాధవి తన కెరీర్ బిగినింగ్ నుంచి పక్షవాతం, మూర్ఛ వ్యాధుల నివారణకు, వాటిపై ప్రజల్లో అవగాహనా పెంచేందుకు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. సెలవుల్లో మారుమూల గ్రామాలకు వెళ్లి.. ఈ వ్యాధుల పై ఉచిత వైద్య శిబిరాలు, అవగాహనా సదస్సులు నిర్వహిస్తూ ప్రజాభిమానాన్ని దండిగా పొందుతున్నారు. ఇప్పటికే ఆమె కీర్తి కిరీటంలో ‘వైద్య రత్న’ వంటి బిరుదులూ వచ్చి చేరగా, తాజగా హెల్త్ కేర్ విభాగంలో ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు జత కలిసింది. 2013లో ‘బిందు మీనన్ ఫౌండేషన్’ పేరుతొ ఒక స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 400 మంది పిల్లల్ని, వృద్ధుల్ని దత్తత తీసుకొని.. వారి బాగోగులు చూస్తున్నారు డాక్టర్ బిందు మీనన్. సాక్షి ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న సందర్భంగా వైద్యరత్నడాక్టర్ బిందు మీనన్ మాట్లాడుతూ.. వ్యాధి వచ్చాక వైద్యం చేయించుకోవడం కంటే.. అసలు వ్యాధి అన్నది మన జోలికి రాకూంగా ఉండేలా నివారణ చర్యలు చేపట్టడం మంచిదన్నది నా అభిప్రాయం. అందుకనే .. ప్రాణాంతక వ్యాధులైన పక్షవాతం, మూర్ఛలపై ప్రజల్లో.. ముఖ్యంగా గ్రామీణుల్లో అవగాహన కల్పించేందుకు నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. మతిమరుపు, అతి శుభ్రం వంటి డిజార్డర్స్ పై సినిమాలు రూపొందిస్తున్న మన దర్శక నిర్మాతలు.. సందర్భానుసారం వివిధ రోగాలపై ప్రజలను చైతన్య పరిచే సన్నివేశాలకు రూపకల్పన చేయాలి… అన్నారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here