“డిపి ఎస్ సినిమాటిక్ ఫోటోగ్రఫీ & యాడ్ మేకింగ్ స్టూడియో” ప్రారంభం

0
57

“డిపి ఎస్ సినిమాటిక్ ఫోటో గ్రఫీ&యాడ్ మేకింగ్ స్టూడియో” ప్రారంభం….
ప్రముఖ సినీ కెమెరామెన్ ఇఫ్తేఖార్ ఫలక్ నామ ప్యాలెస్ దగ్గర “డిపి ఎస్ సినిమాటిక్ ఫోటో గ్రఫీ&యాడ్ మేకింగ్ స్టూడియో”ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖనటులు నాగమహేశ్ మరియు,పి ఆర్ ఓ వీరబాబు పాల్గొని ఆఫీస్ ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇఫ్తేఖార్ మాట్లాడుతూ”ఫ్యాషన్ ప్రపంచం వేగంగా మారుతున్న ఈ రోజుల్లో నేటి యువత అభిరుచులకు తగ్గట్టు ఫోటోగ్రఫీ ని సవరించుకుని కొత్త కొత్త ఆలోచనలతో యాడ్ మేకింగ్ చేయడం మా ప్రధాన ఉద్దేశం.తక్కువ కాస్ట్ తో కొత్త తరహా ఫోటో గ్రఫీతో యువతి యువకులను సరికొత్తగా తీర్చిదిద్దటం మా ప్రధాన ఉద్దేశ్యం. అలాగే అలాగే కార్పొరేట్ సంస్థలకు, మరియు రియల్ ఎస్టేట్ సంస్థలకు కమర్షియల్ యాడ్స్ చేయనున్నాం. అలాగే మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రముఖ నటులు నాగమహేశ్ గారికి, పి ఆర్ ఓ వీరబాబు గారికి , ప్లాట్స్ కాకా డాట్ కమ్ సి ఈ ఓ గారికి మరియు హైదరాబాద్ ఫోటో&వీడియో అసోసియేషన్ సభ్యులకు స్పెషల్ థాంక్స్ తెలుపుకుంటున్నాము” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here