సినిమాల్లోకి రావడానికి రాజశేఖర్ గారే కారణం- దర్శకుడు సుకుమార్

0
45

డెత్ బెడ్ నుండి తిరిగొచ్చి సినిమా చేయగలిగాను అంటే దానికి కారణం మీ అందరి ఆశీర్వాదం వలనే..అందరూ కలసి నన్ను బతికించినట్లే నా సినిమాను చూసి మా బతుకు తెరువును మళ్లీ బతికించండి. అన్నారు హీరో రాజశేఖర్.

వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “శేఖర్”. ఈ చిత్రాన్ని నిర్వాణ సినిమాస్ సృజన ఎరబోలు ఓవర్సీస్ లో విడుదల చేస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం లోని పాటలను విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా మే 20న గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భంగా “శేఖర్” ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ హోటల్ దస్పల్లా లో చిత్ర యూనిట్ ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన సక్సెస్ ఫుల్ దర్శకుడు సుకుమార్, జాంబి రెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మ, పాటల రచయిత రామజోగయ్య శాస్ట్రీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నటుడు సముద్ర ఖని, దర్శకుడు విజయ్ భాస్కర్, హీరో రాజ్ తరుణ్, కమెడియన్ శివారెడ్డి, నిర్మాత రాజ్ కందుకూరి, హీరో శివ కందుకూరి, కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్, నిర్మాత రామసత్య నారాయణ , దొరసాని దర్శకుడు మహేంద్ర,, దర్శకుడు జ్ఞాన సాగర్, మరియు చిత్ర యూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం సక్సెస్ ఫుల్ దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ..నా జీవితంలో రాజశేఖర్ గారితో నిజమైన ఎక్స్పీపీరియన్స్ ముడిపడింది సినిమాకు సంబంధించి.ఆయన పీక్ లో ఉన్నప్పుఫుడు ఆహుతి, ఆగ్రహం,తలంబ్రాలు, మగాడు, అంకుశం, వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చూసి నేను తనకు ఎంతో వీరాభిమాని నయ్యాను.అప్పుడే మొట్ట మొదటి సారి సినిమాకు సంబంధించిన ఆర్ట్ ఫామ్ అంటే.. నేను కూడా సినిమాలు చేయగలను అనే కాన్ఫిడెంట్
ఇచ్చింది..దాంతో నేను మొదటిసారి రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేసి మాట్లాడేవాన్ని దాంతో మా ఊర్లో నేను చాలా ఫెమస్ అయ్యాను. ఆ తర్వాత నన్ను స్కూల్ లో తనలా మాట్లాడమనే వారు. అలా.. నేను కూడా సినిమాల్లోకి రాగలను ఏమైనా చేయగలను అనే అనుబంధం ఫామ్ అవ్వడానికి మీరే కారణం ఇది అతిశయోక్తి కానే కాదు . అయితే ఇలా చెప్పే సందర్భం ఎప్పుడూ రాలేదు కాబట్టి ఇప్పుడు చెపుతున్నాము..ఇలా నాకు సినిమాకు సంబంధించిన లైఫ్ ను ఇంత అద్భుతంగా మార్చినందుకు చాలా థాంక్స్. మనం మన ఫ్యామిలీని ఇండస్ట్రీకి దూరం పెడతాం కానీ రాజశేఖర్ గారు తన ఇద్దరి ఆడపిల్లలను కూడా ఇండస్ట్రీకి తీసుకు రావడం చాలా గ్రేట్. జీవిత గారు చాలా హార్డ్ వర్కర్..తను ఫ్యామిలీ ని చూసుకుంటూ సినిమాతో పాటు దర్శకత్వం చేయడం చాలా కష్టం.కాబట్టి ఈ సినిమా జీవిత గారి కోసం సక్సెస్ కావాలి. రామ జోగయ్య శాస్తి గారు అద్భుతమైన పాటలు రాస్తాడు. అనూప్ గారు ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా ఇలాగే వినయంగా ఉంటాడు. ఈ నెల 20 న వస్తున్న శేఖర్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుతున్నాను అన్నారు.

హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ కు సుకుమార్, సముద్ర ఖని గార్లు రావడం చాలా సంతోషంగా ఉంది.ఇంకా ఇక్కడకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు.కోవిడ్ కారణంగా నేను ఎంతో ఇబ్బంది పడ్డాను.డెత్ బెడ్ నుండి తిరిగొచ్చి సినిమా చేయగలిగాను అంటే దానికి కారణం మీ అందరి ఆశీర్వాదం…ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు అందరూ కలసి నన్ను బతికించినట్లే నా సినిమాను చూసి మా బతుకు తెరువును మళ్లీ బతికించండి. మే 20 న వస్తున్న మా సినిమాను మీరందరూ థియేటర్ కు వచ్చి చూడండి మా సినిమా నచ్చితేనే.. పదిమందికి చెప్పండి.అపుడే మాతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది.ఈ సినిమా కోసం నాకంటే కూడా జీవిత చాలా కష్టపడింది.తనెంత కష్టపడింది అనేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. అలాగే మా ఇద్దరు కూతుర్లు కూడా పోస్ట్ ప్రొడక్షన్ లో జీవితకు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాకు ఇంత పేరు వచ్చిందంటే.. దానికి ముఖ్య కారణం అనూప్. చాలా అద్భుతమైన పాటలు ఇచ్చాడు. హీరోయిన్స్ చాలా చక్కగా చేశారు.నటీనటులు, టెక్నీషియన్స్ అందరి సపోర్ట్ చేయడంతో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది అన్నారు.

దర్శకురాలు జీవితరాజశేఖర్ మాట్లాడుతూ..నేను అందరిలాగే సాధారణ మైన మనిషినే..నాకు ఊహ తెలిసినప్పటినుంది ఫైటింగ్ ఫైటింగ్.నేను ఎవరినీ ఎప్పుడూ మోసం చేయలేదు.నాకు చేతనైన సహాయం చేస్తా..అలాగే నాకు కూడా చాలా మంది హెల్ప్ చేశారు.నేను అడిగిన వెంటనే వారు ఏంతో బిజీ గా ఉన్నా ఈ ఫంక్షన్ కు వచ్చి స్టేజ్ మీద మాట్లాడిన మీ మాటలు మాకెంతో ధైర్యాన్ని ఇచ్చాయి.ఇలా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ.. ఒకరికొకరు చేయూతనిస్తే.. తప్పకుండా ఈ ప్రపంచంలో అందరూ బాగుంటాము.కోవిడ్ తర్వాత అందరూ థియేటర్ కు రావడం లేదు ఓటిటి లోనే చూస్తారు అని చెప్పారు.నేను ప్రేక్షకులకు ఒకటే చెపుతున్నా ఈ సినిమా చాలా మంచి సినిమా.ఇప్పటివరకు మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారు.మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను కూడా ఆదరించండి.టికెట్ రేట్స్ పెరగడం వలన ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదని విన్నాను.మా వినిమకు టికెట్ రేట్స్ పెంచడం లేదు.గవర్నమెంట్ పెట్టిన రేట్లకే మా సినిమాను ప్రదర్శిస్తున్నాము.మా సినిమా రిలీజ్ చేస్తున్న ప్రతి బయ్యర్స్ కు డిస్ట్రిబ్యూటర్స్ కు చెప్పాము.ఈ సినిమా టికెట్ రేట్స్ మీకు అందుబాటు దరలోనే ఉంటాయి. దయచేసి మీరందరూ ఈ నెల 20 న థియేటర్స్ కు వచ్చి మా సినిమాను సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. రాజశేఖర్ గారి ఫ్యామిలీ ఎప్పుడు కూడా సినిమా తప్ప వేరే లోకం ఉండదు. వారికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.

దర్శకుడు విజయ్ భాస్కర్ డైలాగ్ ప్రోమోను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ.. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అన్నారు.

నటుడు సముద్ర ఖని మాట్లాడుతూ.. ఈ రోజు నేను పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను అంటే మీ ఇన్స్పిరేషన్ వల్లే..అటువంటిది ఈ రోజు రాజశేఖర్ గారితో స్టేజ్ షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

సంగీత దర్శకుడు అనూప్ మాట్లాడుతూ..ఇది నాకు వెరీ స్పెసల్ మూవీ.జీవిత గారి ఫ్యామిలీ తో ఈ సినిమా కొరకు చాలా రోజులు జర్నీ చేశాను.ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు.

నటి శివాని రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఈవెంట్ కు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అనూప్ గారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. డిఓపి గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మా నిర్మాతలు రాలేకపోయినా వారెంతో మాకు సపోర్ట్ చేశారు.సినిమా స్టార్ట్ అవుతుందనగా నా వల్ల తనకు కోవిడ్ వచ్చింది. నా వల్ల తను చాలా సిక్ అయ్యాడు.ఒకానొక టైం లో డాక్టర్స్ వచ్చి చాలా సీరియస్ గా ఉంది.ఈ క్షణంలో నైనా వెంటిలేటర్ పై పెట్టచ్చు అన్నారు. దాంతో అందరూ నీ జాతకంలో దోషం ఉందేమో అనే వారు. ఆరు సంవత్సరాల నుండి నా సినిమా రిలీజ్ అవ్వడం లేదు. ఇప్పుడు నీ వల్ల మీ ఫ్యామిలీ కి కోవిడ్ రావడం అనే వారు.అయితే మా డాడీ నన్ను సపోర్ట్ చేశాడు.మాకు అమ్మ, నాన్నల దోరకడం దేవుడిచ్చిన వరం. మా కోసం కాకుండా మా నాన్న పునర్జన్మ లా తిరిగి వచ్చి చేసిన ఈ సినిమా మా నాన్నకు గొప్ప విజయం సాధించాలి అన్నారు.

నటి శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ.. మా సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో ఈ సినిమా చాలా బాగా వచ్చింది.ఈ నెల 20 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.

దొరసాని దర్శకుడు మహేంద్ర మాట్లాడుతూ.. నాకు రాజశేఖర్ గారంటే నాకెంతో ఇష్టం.అటువంటి వారి ఫ్యామిలీ అంతా కష్టపడి. చేసిన ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. రాజశేఖర్ గారికి ఇంత ఏజ్ వచ్చినా తను తెల్ల గడ్డం లో చాలా యంగ్ గా వున్నాడు.

దర్శకుడు జ్ఞాన సాగర్ మాట్లాడుతూ..ఇందులోని పాటలు వింటుంటే మా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి.ఇప్పటి వరకు యాంగ్రీ యంగ్ మెన్ చూసిన మాకు ఈ సినిమాలో తన నటనకు ట్రాన్స్ లో వెళ్లిపోతాము

నటుడు భరణి శంకర్ మాట్లాడుతూ.. రాజశేఖర్ గారు ఇందులో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేశాడు.వారితో వర్క్ చేయడం మాకు వండర్ఫుల్ జర్నీ.అనూప్ గారు తన పాటలతో సినిమాకు ప్రాణం పోశారు. అన్ని కూడా మంచి హిట్ పాటలు ఇచ్చారు. స్క్రీన్ మీద మీకు మేం చేసిన అల్లరి చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు అన్నారు.

డిఒపి మల్లికార్జున గారు మాట్లాడుతూ… ఈ సినిమాకు నేను డిఓపి గా పని చేస్తాను అనుకోలేదు..ఈ క్రెడిట్ అంతా జీవితా రాజశేఖర్ లాగారికే చెందుతుంది.సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు.

నటుడు సమీర్ మాట్లాడుతూ.. మాకు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని క్యూరియాసిటీ తో ఉన్నాము. రాజశేఖర్ గారికి ఈ స్టేజ్ మీద ఒకటే చెప్పదలచుకొన్నాను. ఈ నెల 20 న వస్తున్న ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ సినిమా అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది.సెట్ లో జీవిత గారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అన్నారు.

నటుడు రవి వర్మ మాట్లాడుతూ..డే వన్ రోజు ఎంత కాన్ఫిడెంట్ గా వర్క్ చేశామో ఈ రోజు కూడా ఈ చిత్రంపై అదే కాన్ఫిడెన్స్ గా ఉన్నాము. ఈ మూవీ లో చాలా షేడ్స్ ఉన్నాయి.

నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. రాజశేఖర్ గారు సింహారాశి లో ఎలాంటి సెట్టిల్డ్ పెరఫార్మెన్స్ చేశారో.. ఈ సినిమాలో కూడా అంతే న్యాచురాలిటీ గా యాక్ట్ చేశాడు. జీవిత గారు, రాజశేఖర్ గారు ఈ సినిమా కొరకు చాలా కష్టపడ్డారు. ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

నటుడు శివారెడ్డి మాట్లాడుతూ.. ఎవరికి ఏ కష్ట మొచ్చినా ఫస్ట్ రెస్పాన్డ్ అయ్యేది రాజశేఖర్ కుటుంబమే.. అటువంటి మంచి కుటుంబం నుండి వచ్చే “శేఖర్” సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

లిరిసిస్ట్ రామజోగయ్య శాస్ట్రీ మాట్లాడుతూ..ఈ మధ్య తెలుగులో కంటెంట్ బేస్డ్ సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలో కూడా మంచి కంటెంట్ ఉంది.నేను జోసెప్ సినిమా చూశాను ఆ సినిమా చాలా బాగుంది. ఇందులో నేను మూడు పాటలు రాశాను.ఆ పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.అనూప్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.ఈ నెల 20 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

హీరోయిన్స్ ముస్కాన్, ఆత్మీయ రాజన్ లు మాట్లాడుతూ.. ఇది నా రెండవ సినిమా ఈ సినిమా కొసం నేను ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నాను..జీవిత మేడమ్ రాజశేఖర్ సర్ లతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన

నిర్మాత రాజ్ కందుకురి మాట్లాడుతూ.. ఈ సినిమా కథకు తగ్గట్టే టెక్నికల్ వ్యాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. రాజశేఖర్ కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమా చేశారు.దర్శకురాలు జీవిత గారు తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాను అందిస్తున్నారు. జీవిత గారు ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో సినిమాలు తీయాలి అన్నారు.

శివ కందుకూరి మాట్లాడుతూ.. రాజశేఖర్ లుక్ ఎక్స్ట్రార్డినరీ గా ఉంది..ట్రైలర్,పాటలు చాలా అద్భుతంగా ఉంది.జీవిత రాజశేఖర్ ఫ్యామిలీకి ఈ సినిమా గొప్ప హిట్ అవ్వాలి అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న శేఖర్ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు.

నటీనటులు
రాజశేఖర్, ప్రకాష్ రాజ్, శివాని రాజశేఖర్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటిస్తున్న

సాంకేతిక నిపుణులు
సమర్పణ: వంకాయలపాటి మురళీక్రిష్ణ, నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవితా రాజశేఖర్, సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని, పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ పార్ట్నర్: టికెట్ ఫ్యాక్టరీ, కళ: సంపత్, రైటర్: లక్ష్మీ భూపాల

Dr. Rajasekhar garu is the reason I entered the film industry: Director Sukumar at pre-release event of ‘Shekar’

“If I could bounce back from the death bed and do this film, it is only because of your blessings. Just as you made me do this film, give us money by watching this movie,” said hero Rajasekhar at the pre-release event of his May 20th release ‘Shekar’. The event was attended by director Sukumar as the chief guest. ‘Zombie Reddy’ maker Prasanth Varma, lyricist Ramajogayya Sastry, Producers Council General Secretary Prasanna Kumar, actor Samuthirakani, director Vijay Bhaskar, hero Raj Tarun, comedian Shiva Reddy, producer Raj Kandukuri, hero Shiva Kandukuri, ‘Colour Photo’ director Sandeep Raj, producer Ramasatyanarayana, ‘Dorasani’ director Mahendra, director Gnana Sagar, and the unit of ‘Shekar’ were also present.

Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, and Boggaram Venkata Srinivas have joined hands to produce it on Pegasus Cinecorp, Taurus Cinecorp, Sudhakar Impex IPL, and Tripura Creations. ‘Shekar’ is presented by Vankayalapati Murali Krishna. Come May 20, ‘Shekar’ is going to be released overseas by Srujan Yarabolu.

Speaking on the occasion, successful filmmaker Sukumar said, “I have a special experience in life with Rajasekhar garu’s filmography. He did super hit movies like Ahuthi, Agraham, Thalambralu, Magadu, Ankusham and I became a big fan of his. Cinema as an art form started making sense to me. It gave me the confidence that I can do movies. When I started imitating Rajasekhar garu, I became famous in the village. It would not be an exaggeration to say that he is the prime reason for my entering the film industry. I thank him for being such an inspiration. It’s commendable that he has allowed his two daughters to enter the film industry when the norm is otherwise in the film industry. Jeevitha garu is a hard worker. She has been looking after her family and also directed ‘Shekar’. This film must become a blockbuster for her. Ramajogayya Sastry garu has penned amazing lyrics. Anup Rubens remains the same humble person even after so many hits. Everyone should watch ‘Shekar’ on May 20.”

Actor Rajasekhar said that he was very happy that Sukumar and Samuthirakani attended the event. He recalled the days when he was down with a severe Covid-19 infection. “I was on the death bed. It’s because of your blessings that I am here. My fans and well-wishers should now bless my film like they wished me a speedy recovery when I was hospitalized. If you like ‘Shekar’, convey the talk to others. Only then can we and the film industry can thrive. More than me, Jeevitha has worked really hard on ‘Shekar’. You will know it when you watch the movie. My daughters helped her a great deal during the post-production phase. Anup’s music has made ‘Shekar’ all the more popular. The heroines, other artists and technicians have done a great job. ‘Shekar’ will connect with one and all.”

Director Jeevitha Rajasekhar said, “I am like everybody else. I have had my share of struggles all my life. I have never been unfair to anybody in life. I have helped others whenever possible. Likewise, I have received others’ help. It gives us strength today that the people I had invited are here today to bless our movie. Cooperation and support will make the world a better place. There is a narrative that people are watching small movies only on OTT these days. Let me say that ‘Shekar’ is a very good movie. The Telugu audience have always supported good movies. I hope they bless ‘Shekar’. We are not hiking the ticket rates for our movie. Government-mandated rates will remain for ‘Shekar’. Distributors have already been asked to implement the direction. That way, the ticket rates for ‘Shekar’ are affordable. I request you all to watch our movie in theatres on May 20.”

Director Prasanth Varma said, “Rajasekhar garu and his family think only about cinema all the time. I hope this film becomes a big hit for them.”

Director Vijay Bhaskar unveiled a dialogue promo. He said, “This content-based movie should become a massive hit.”

Actor Samuthirakani said, “I am inspired by Rajasekhar garu’s films in portraying the cop character. I am very happy to be sharing the stage with him today.”

Music director Anup Rubens said, “This is a very personal movie to me. I have journeyed for long with Jeevitha garu’s family for ‘Shekar’.”

Actress Shivani Rajasekhar began her speech by thanking the guests. She praised Anup’s music and the cinematographer’s visuals. She also thanked the producers on the occasion, and recalled the tough days when her father was down with a severe Covid infection. “When the doctors said that my father might have to be put on a ventilator at any time, some people commented that my horoscope is jinxed. When others were passing insensitive comments, my father stood by me. I am blessed to have such amazing parents in my life. ‘Shekar’ must become a big hit!” She also spoke of how her father, after recovering from Covid-19, built his physique with sheer grit and determination.

Actress Shivathmika Rajasekhar said, “Thanks to every single artist and technician, our film has come out really well. May there be the audiences’ blessings on our movie this May 20.”

‘Dorasani’ director Mahendra said, “I really like Rajasekhar garu. He and his family have worked really hard on ‘Shekar’. I hope this film becomes a big hit.”

Hero Raj Tarun said, “No matter what is his age, Rajasekhar garu is looking young with the white beard.”

Director Gnana Sagar said, “I am turning teary-eyed listening to the songs from ‘Shekar’. I hope Rajasekhar garu’s performance is going to leave us in a trance.”

Actor Bharani Shankar said, “Rajasekhar garu’s performance is amazing. It has been a wonderful journey working with him. Anup’s songs are enlivening. The audience are going to enjoy our banter on the big screen.”

Cinematographer Mallikarjuna said, “It was an unexpected offer to work as a cinematographer on ‘Shekar’. The credit goes to Jeevitha garu.”

Actor Sameer said, “I am curious about watching ‘Shekar’. I want to say that ‘Shekar’ is going to be a sure-fire hit this May 20. Jeevitha garu encouraged me on the sets.”

Actor Ravi Varma said, “We are as confident about ‘Shekar’ becoming a hit as we were on Day One of the project. You will find a number of shades in ‘Shekar’.”

Producer Prasanna Kumar said, “In ‘Simha Raasi’, Rajasekhar garu gave a subtle performance. He is equally natural in ‘Shekar’. Jeevitha garu and Rajasekhar garu have worked really hard on ‘Shekar’.”

Actor Shiva Reddy said, “Rajasekhar garu’s family is always the first to react when issues crop up. ‘Shekar’ should become a big hit for the nice family.”

Lyricist Ramajogayya Sastry said, “We are witnessing content-based movies in Telugu these days. ‘Shekar’ too is high on content. I have penned three songs in the movie. The audience’s response has been great.”

Heroines Muskaan and Aathmeeya said that they were excited about the movie. They thanked director Jeevitha and the entire team.

Producer Raj Kandukuri said, “The story and technical values are rich in ‘Shekar’. The entire family was dedicated while doing the film.” He also appreciated director Jeevitha and wished that she does many more movies.

Shiva Kandukuri said, “Rajasekhar garu’s look is extraordinary. The trailer and songs are amazing.”

Cast and Crew:

Dr. Rajashekar, Prakash Raj, Shivani Rajasekhar, Aathmeeya Rajan, ‘George Reddy’ fame Muskaan Kubchandhani, Abhinav Gomatam, Kannada Kishore, Sameer, Bharani, Ravi Varma, Shravan Raghavendra and others are the principal cast.

PRO: Naidu Surendra Kumar – Phani Kandukuri (Beyond Media); Digital Partner: Ticket Factory; Art Direction: Sampath; Writer: Lakshmi Bhupala; Cinematographer: Mallikarjun Naragani; Music Director: Anup Rubens; Producers: Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, Boggaram Venkata Srinivas; Screenplay, Direction: Jeevitha Rajashekar.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here