నోరూరించే పాల రుచులతో.. డుమాంట్!

0
35

ఇప్పటి వరకు మార్కెట్లో కి ఎన్నో మిల్క్​ షేక్​లు, డ్రింక్స్​, ఐస్​క్రీమ్స్​ వచ్చాయి. కానీ.. అచ్చమైన, స్వచ్ఛమైన రుచి, పాల ఫ్లేవర్​ అందించినవి అర కొర అనే చెప్పాలి. ఇప్పుడు ఆ లోటును పూడుస్తూ.. మార్కెట్లోకి ఐస్​క్రీమ్స్​, అండ్​ మిల్క్​షేక్స్​ ను సరికొత్త రుచుల్లో అందించడానికి వచ్చింది డుమాంట్. మామిడి పండు తిన్న అనుభూతి రావాలంటే మామిడి పండే తినాలి. కానీ.. కృత్రిమంగా ఏదో మ్యాంగో ఫ్లేవర్​ తింటే.. మామిడిపండు తిన్న అనుభూతి రాదు. ఏదైనా ఐస్​క్రీమ్​ కూడా ఫలానా ఫ్లేవర్​ అని ఏరికోరి కొనుక్కుని తింటాం. కానీ.. పూర్తిగా ఆ ఫ్లేవర్​లో రాదు. మిల్క్​షేక్స్​ కూడా కొన్నిసార్లు ఏవో తాగామా అంటే. .తాగాం అని సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ.. నేరుగా రైతుల నుంచి సేకరించిన పండ్లు, పాలతో ఐస్​క్రీమ్స్​, మిల్క్​షేక్స్​ తయారుచేసి అందించడానికి అడుగు ముందుకు వేసింది డుమాంట్.

హైదరాబాద్​లోని దస్పల్లాలో డుమాంట్ ఐస్​క్రీమ్స్​ అండ్​ మిల్క్​షేక్స్​ ప్రీ లాంచింగ్​ కార్యక్రమం జరిగింది. మ్యూజిక్​ విత్​ మిల్క్​ షేక్ పేరుతో వినూత్నంగా ఈ కార్యక్రమం నిర్వహించారు నిర్వాహకులు. ఇప్పటి వరకు ఎవరూ చేయని తరహాలో సరికొత్త ఐడియాతో చేసిన ఈ లాంఛ్ ప్రోగ్రామ్​ నగరవాసులను ఆకట్టుకుంది.

డుమాంట్ ఐస్​క్రీమ్స్​ అండ్​ మిల్క్​షేక్స్​ ప్రీ లాంచ్ కార్యక్రమంలో సంస్థ ఎండీ వివేక్​ మాట్లాడుతూ.. ‘సౌత్​ ఇండియాలో ఎక్కడా దొరకని దాదాపు 15 రకాల ఫ్లేవర్లను
డుమాంట్ పరిచయం చేయనుంది. ఓ వైపు ఐస్​క్రీమ్స్​ చేస్తూ, మరోవైపు మిల్క్​షేక్స్​ కూడా తయారుచేసి అమ్ముతున్న సంస్థల్లో నాణ్యతను పాటించే అతి తక్కువ సంస్థల్లో డుమాంట్ ఒకటి. రుచి, శుభ్రత, క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా పనిచేస్తున్న కంపెనీ
డుమాంట్. హైద్రాబాద్ తో పాటు విజయవాడలో, బెంగళూరులో ఈ నెల 19 నుంచి స్టోర్స్ అందుబాటులోకి వస్తాయి.’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here