ఉగ్రవాదంపై ‘ఏక్’ పోరు

0
24

ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. ఈ జోనర్ సినిమాలకు సరైన స్క్రీన్ ప్లే రాసుకుంటే చాలు… ప్రేక్షకులను థియేటర్ రప్పించొచ్చు. తాజాగా అలాంటి నేపథ్యంతో తరకెక్కిన చిత్రమే ‘ఏక్’. ఇందులో సందేశం కూడా ఇచ్చారు. బిష్ణు అధికారి హీరోగా అపర్ణ శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సుమన్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఏమాత్రం ప్రేక్షకుల్ని మెప్పించిందో చూద్దాం పదండి.

కథ: తెలివైన స్టూడెంట్ సిద్ధూ(బిష్ణు అధికారి). అతను అపర్ణ శర్మను ప్రేమిస్తాడు. తను కూడా సిద్ధూ ప్రేమను అంగీకరిస్తుంది. ఇలా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకునే క్రమంలో.. అకస్మాత్తుగా ఉగ్రవాదుల దాడిలో అపర్ణ శర్మ చనిపోతుంది. దాంతో చలించిపోయిన సిద్ధూ.. ఉగ్రవాదులను అంతం చేయడానికి పూనుకుంటాడు. మరి ఉగ్రవాదాన్ని ఎలా అంతమొదించారు? దానికి ఎంచుకున్న మార్గం ఏమిటి? ఉగ్రవాదాన్ని అణచివేయడంలో సిద్ధూ విజయం సాధించారా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సాంకేతిక.. నటీనటులపై విశ్లేషణ: ఉగ్రవాదులను… అరాచక వాదులను అంతం చేయాలనే సిద్దు పాత్రలో అద్భుతంగా రాణించాడు బిష్ణు అధికారి. నటనలోనే కాదు మంచి ఫిజిక్ తో కూడా ఆకట్టుకున్నాడు బిష్ణు  అపర్ణ శర్మ గ్లామర్ తో అలరించింది. అలాగే హిమాన్షి ఖురానా గ్లామర్ కే పరిమితం అయ్యింది. కీలక పాత్రలో సుమన్ నటించాడు. ఇక సుమన్ గురించి కొత్తగా చెప్పేదేముంది. అలాగే బెనర్జీ , శ్రవణ్, 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు తమ తమ పాత్రల్లో రాణించారు. మంత్ర ఆనంద్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది , అలాగే విజువల్స్ కూడా బాగున్నాయి . ఖర్చుకు వెనుకాడకుండా మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించి తన నిర్మాణ దక్షతని నిరూపించుకున్నారు హరి . ఇక దర్శకుడు సంపత్ విషయానికి వస్తే బర్నింగ్ పాయింట్ ని కథా వస్తువుగా ఎంచుకొని మంచి ప్రయత్నమే చేసాడు . నటీనటుల నుండి చక్కని నటన ని రాబట్టుకున్న దర్శకుడు యువతని ఆలోచింప జేసే విధంగా ఏక్ చిత్రాన్ని మలిచాడు .

రేటింగ్: 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here