ఎంగేజింగ్ థ్రిల్లర్ ‘యురేక’

0
52

థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. సరైన కథ… కథనాలతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తే… బాక్సాఫీస్ వద్ద కాసులపంటే… అందుకే కొత్త దర్శకులు గానీ.. హీరోలు గానీ మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న కథలను ఎంచుకొని సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అవుతున్నారు. తాజాగా కార్తీక్ ఆనంద్, సయ్యద్ సోహైల్ రియాన్, డింపుల్ హయతి, షాలిని ప్రధాన పాత్రల్లో ‘యురేక’ అనే థ్రిల్లర్ తెరకెక్కింది. లక్ష్మీప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై కార్తీక్ ఆనంద్ దర్శకత్వం వహించి… నటించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.

కథ: యువ(కార్తీక్ ఆనంద్), రేవంత్(సయ్యద్ సోహైల్ రియాన్) లిద్దరూ క్లాస్ మేట్స్. ఇద్దరూ చదువులో గానీ… కాలేజ్ లో నిర్వహించే ప్రతి ఈవెంట్ పోటాపోటీగా నిర్వహిస్తుంటారు. అలా తమ కాలేజీలో ‘యురేక’పేరుతో కాలేజ్ ఫెస్ట్ ను నిర్వహించాలనుకుంటారు. ఏదైనా కొత్త విషయాన్ని కనుగొన్నప్పుడు దాన్ని రివీల్ చేయడానికి పెట్టే పేరే యురేక… మరి ఈ యురేక ఫెస్ట్ లో ఏమి రివీల్ అయిందనేదే ఈ సినిమలో అసలు ట్విస్ట్. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: మర్డర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను ఇంతకు ముందు చాలానే చూసాము. కానీ యురేక చిత్రంలో మాత్రం… ఇంతకు ముందు చూడని ఓ యూనిక్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది. దాన్ని హీరో కం డైరెక్టర్ కార్తీక్ ఆనంద్ చాలా ఎంగేజింగ్ గా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ ను ఎంటర్టైనింగా తెరకెక్కించి… సెకెండ్ హాఫ్ మొత్తం థ్రిల్లర్ గా మలిచిన తీరు ప్రేక్షకులకు ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. ఎక్కడా డీవియేట్ కాకుండా ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేయడంలో కార్తీక్ సక్సెస్ అయ్యారు. ప్రయివేటు కళాశాలల్లో జరిగే కొన్ని యాంటీ సోషియల్ యాక్టివిటీస్ ని… వాటి యాజమాన్యాల వ్యాసనాలను కూడా టచ్ చేయడంతో… ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది.
దర్శకుడు కం హీరో కార్తీక్ ఆనంద్ కొత్తవాడైనా ఓ మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ ను ఎంచుకుని… దాన్ని ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరమీదకు ఎక్కించి విజయం సాధించారు. ఓ వైపు దర్శకత్వ బాధ్యతలు… మరో వైపు లీడ్ రోల్ లో నటించడం… రెండింటినీ బ్యాలెన్సింగా డీల్ చేసాడు. అతనితో పాటు నటించిన సయ్యద్ సోహైల్ రియాన్ కూడా కాలేజ్ ఎపిసోడ్స్ లో బాగా నటించారు. ఇక సెకండ్ హాఫ్ లో బ్రహ్మాజీ ఎపిసోడ్ హైలైట్. ఇక షార్ట్ ఫిలిం మేకర్ గా ఇట్టా మహేష్ బాగా నవ్వించాడు. కాలేజ్ ప్రిన్సిపాల్ గా శివన్నారాయన… కాలేజ్ యజమానిగా రఘుబాబు… తమ పాత్రలకు న్యాయం చేశారు.
డింపుల్ హయతి,షాలిని , అభయ్, రాకెట్ రాఘవ, మస్త్ అలీ, ఆర్.కె తదితరులు అంతా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.

మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నరేష్ కుమరన్ తన శక్తి మేరకు బిజిఎమ్ సెకెండ్ హాఫ్ లో ఇచ్చి మరింత థ్రిల్ కలిగేలా చేశాడు. డివోపీ ఎన్.బి. విశ్వకాంత్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా రిచ్ గా ఉంది. మెయిన్ గా ద్వితీయార్థంలో నైట్ మోడ్ లో విజువల్స్ బాగున్నాయి. నిర్మాత ప్రశాంత్ తాత ఖర్చుకు వెనకాడకుండా సినిమాను రిచ్ గా తెరకెక్కించారు. నిర్మాణ విలువలు క్వాలిటీగా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here