ఎంగేజింగ్ థ్రిల్లర్ ‘ఎవరు’

0
236

థ్రిల్లర్ మూవీస్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వుంది. ఇటీవల వచ్చిన చాలా థ్రిల్లర్లు అటు బాలీవుడ్ లోనూ… ఇటు టాలీవుడ్లోనూ విజయాలు సాధించాయి. తాజాగా వెంక‌ట్ రామ్‌జీ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రెజీనా కాసాండ్రా హీరోయిన్‌ గా నవీన్ చంద్ర కీలక పాత్రలో తెరకెక్కిన థ్రిల్ల‌ర్ మూవీ ‘ఎవరు’. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌ పై పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.

కథ: సమీర (రెజీనా) అశోక్ కృష్ణ (నవీన్ చంద్ర)ను ఊహించని పరిస్థితుల్లో హత్య చేసి కేసులో ఇరుక్కుంటుంది. ఆ తరువాత జరిగే సంఘటనల అనంతరం ఈ కేసును ఛేదించేందుకు కరెప్టెడ్ పోలీస్ అధికారి అయినటువంటి అడవి శేష్(విక్రమ్ వాసుదేవ్)రంగంలోకి దిగుతాడు. అతని విచారణలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి.. అలాగే ఓ మిస్సింగ్ కేస్ కి రెజీనాకి ఎలాంటి కనెక్షన్ ఉంటుంది.. చివరికి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడే నిజాలు ఏమిటి? ఈ నేపథ్యంలో శేష్ మరియు రెజినాల కథకు ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఆ హత్య రెజీనా ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? రెజీనా ఈ కేసు నుంచి బయట పడిందా? లేదా? లాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ సినిమాను వెండి తెరపై చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: ఇంతకు ముందు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ చాలానే వచ్చాయి. వాటన్నింటికీ భిన్నంగా… అనేక మలుపులతో ఓ మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమం.. ‘ఎవరు’ చిత్రం ఆద్యంతం ప్రేక్షకుల్ని ఉత్కంఠతకు గురిచేస్తుంది. క్రైమ్ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌ తో ఓ మిస్సింగ్ కేసు మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతూ సప్సెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మరియు ఇంట్రస్టింగ్ ప్లేతో ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు అలరిస్తాయి. ప్రధానంగా సినిమాలో వినయ్ వర్మ పాత్ర మిస్ అవ్వడం.. ఆ పాత్ర మిస్ అవ్వడానికి గల ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన రెజీనా.. నవీన్ చంద్రల పాత్రలు.. ఆ పాత్రల పాయింట్ అఫ్ వ్యూస్ లో వచ్చే ప్లాష్ బ్యాక్స్… సెకెండ్ హాఫ్ లో వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయి.
ఇక విక్రమ్ వాసుదేవ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన అడవి శేష్ తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ సినిమాలో సీరియస్ నెస్ తో పాటు ప్లేలోని ఇంట్రస్ట్ ను తన ఎక్స్ ప్రెషన్స్ తో మెయింటైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన నవీన్ చంద్ర కూడా ఎప్పటిలాగే చాల బాగా నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్ నటించిన రెజీనా తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో మరియు ప్లాష్ బ్యాక్స్ లో అలాగే కొన్ని బోల్డ్ సీన్స్ లో రెజీనా నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక దర్శకుడు ఈ చిత్రాన్ని ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ గా ఆద్యంతం ఉత్కంఠను పెంచుతూ.. చివర్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మరియు బలమైన ట్విస్ట్ లతో సినిమాని ముగించడం బాగా ఆకట్టుకుంటుంది.
దర్శకుడు వెంక‌ట్ రామ్‌జీ క్రైమ్ థ్రిల్లర్ ను ఆడియన్స్ మెచ్చే విధంగా తీయడంలో సక్సెస్ సాధించారు. తొలి సినిమానే అయినా ఎక్కడా తడబాటు లేకుండా తెరకెక్కించి విజయం సాధించారు. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా వుంది. క్రైమ్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు శ్రీచ‌ర‌ణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్ చాలా క్రిస్పీగా వుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్ గా వున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ ను ఇష్టపడే ప్రేక్షకులను ‘ఎవరు’ బాగా థ్రిల్లింగ్ చేస్తుందనడంలో సందేహం లేదు. గో అండ్ వాచ్!
రేటింగ్: 3.5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here