చంద్రబాబుచే హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ డాట్ కాం.వెబ్ సైట్ లాంచింగ్

0
28

చంద్రబాబుచే హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ డాట్ కాం.వెబ్ సైట్ లాంచింగ్.(www.100yearsofntr.com)

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల అసోసియేషన్ రూపకల్పన చేసిన హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ డాట్ కాం ( www.100yearsofntr.com) వెబ్ సైట్ ను తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు ప్రజల చేత డిజిటల్ సంతకాల సేకరణ నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు మీద ఒక అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేయించి, ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న ముఖ్యులకు అభినందనలు తెలిపారు. ఇంతటి కార్యక్రమాన్ని ఎంతో అంకిత భావంతో నిర్వహించడం వారికి ఎన్టీఆర్ మీద వున్న అభిమానానికి నిదర్శనమన్నారు. తెలుగు ప్రజల శక్తి, యుక్తి తెలుగు తేజం, ఆరాధ్య దైవం అయిన ఎన్టీఆర్ రేపటి తరమే కాదు, తరతరాలు జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానుభావుడు అని చంద్రబాబు కొనియాడారు. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మరెన్నో చేయాలని అసోసియేషన్ సభ్యులని ప్రశంసించారు. చంద్రబాబు గారిని శాలువతో సత్కరించి, మెమోంటోతో పాటు ఎన్టీఆర్ చిన్న విగ్రహాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కనపర్తి రవిప్రసాద్, సెక్రటరీ తుమ్మల రమేష్, వైస్ ప్రెసిడెంట్ పంద్రాకులా ఏసు రాజు, జాయింట్ సెక్రటరీ పి శ్రీనివాస్, ట్రెజర్ నాగ సురేష్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ పేనికేలపాటి అనిల్ కుమార్, గుత్తికొండ భువనేశ్వరి, కొల్లూరి శ్రీనివాసరావు, శివరామకృష్ణ చెరుకూరి ఆర్కే యోగా స్టూడియో రామకృష్ణ, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here