‘జీ జాంబీ’ చిత్ర రెండో లిరికల్ సాంగ్ త్వరలో విడుదల

0
22

జాంబీ వైరస్ మీద తెలుగులో మొదటగా సినిమా తీస్తున్న మహిళా దర్శకురాలు దీపిక. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన దీపిక సినిమా మేకింగ్ పట్ల ఆసక్తితో జాంబీస్ వైరస్ మీద ‘జీ జాంబీ’ సినిమా రూపొందించారు. ఆర్యన్ గౌర, దివ్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్ర రెండో లిరికల్ సాంగ్ ను త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, తొలి పాటకు మంచి రెస్పన్స్ వస్తోంది. ‘జీ జాంబీ’ చిత్రానికి వినోద్ కుమార్ (విన్ను) సంగీతం, రాంబాబు గోసాల లిరిక్స్ అందించిన పాటలు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. మంచి సంగీతంతో పాటు ఆడియన్స్ థ్రిల్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని చిత్ర బృందం చెబుతోంది. థియేటర్లు ఓపెన్ అయ్యాక ‘జీ జాంబీ’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

‘జీ జాంబీ’ చిత్రానికి కెమెరామెన్: రాజశేఖర్, మ్యూజిక్: వినోద్ కుమార్ (విన్ను), లిరిక్స్: రాంబాబు గోసాల, కో డైరెక్టర్: పవన్, అసోసియేట్ డైరెక్టర్: జన్న ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్స్: నరేష్, లోకేష్, డైరెక్టర్స్: ఆర్యన్, దీపికా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here