రివ్యూ: గేమ్ ఓవర్(Game Over)

0
43

తాప్సీ బాలీవుడ్ కెళ్లిన తరువాత కథలో ప్రధాన్యత వున్న పాత్రలకే ప్రధాన్యత ఇచ్చి.. మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు, తమిళ్, మళయాలంలో థ్రిల్లర్ గా  తెరకెక్కిన ‘గేమ్ ఓవర్’ చిత్రంలోనూ అలానే చేసింది. ‘వైనాట్ స్టూడియోస్’ నిర్మించిన ఈ చిత్రానికి ‘మాయ’ డైరెక్టర్ అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తగా 1200 స్క్రీన్లలో విడుదలైంది. వీడియో గేమ్ డిజైనర్ గా నటించిన తాప్సీ ఈ చిత్రంలో ఏమాత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వున్నాయో తెలుసుకుందాం పదండి.

కథ: స్వప్న (తాప్సి) ఒక వీడియో గేమ్ డిజైన‌ర్‌ డిజైనర్ అయిన స్వప్న(తాప్సీ) ఎప్పుడూ వీడియో గేమ్ ఆడుతూ థ్రిల్ అవుతూ వుంటుంది. అయితే డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగిన ఓ అనుకోని సంఘటన ద్వారా తల్లిదండ్రులకు దూరంగా… చీకటంటే భయపడుతూ జీవిస్తూ వుంటుంది. ఆమెతో పాటు పనిమనిషి కళమ్మ(వినోదినీ వైధ్యనాథ్) వుంటుంది. తనకు టాటూ లంటే ఇష్టం. దాంతో చేతికి ఓ టాటూ వేయించుకుంటుంది. ఆ టాటూ అస్తమానూ స్వప్నను ఇబ్బంది పెడుతూ వుంటుంది. ఎందుకు అలా అని విచారించగా… ఆ టాటూను వేసినప్పుడు ఆ ఇంకులో అమృత(సంచిత నటరాజన్) అస్థికలు కలిశాయని టాటూ డిజనర్ చెబుతుంది. దాని వల్లే మీకు ఇలాంటి నొప్పి ఏమైనా వస్తోందేమోనని చెబుతుంది.స్వప్నపై ఆ టాటూ ప్రభావం ఎలా చూపింది? అసలు అమృత ఎవరు? ఆమెను ఎవరు చంపేశారు?  స్వప్న చీకటంటే ఎందుకు భయపడుతూ వుంటుంది? చివరకు స్వప్న ఎలా వీటన్నింటి నుంచి బయటపడింది అనేదే మిగతా కథ.

కథ.. కథనం విశ్లేషణ: ముందు నుంచి సినిమా యూనిట్ ప్రచారం చేసినట్టుగానే.. ఇప్పటి వరకూ భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎప్పుడూ రాని ఓ కొత్త కథను తీసుకుని… దాని చుట్టూ వెన్నులో వణుకు పుట్టేలా కథనాన్ని రాసుకుని ప్రేక్షకుణ్ని ప్రతి క్షణం థ్రిల్ కు గురయ్యేలా చేశాడు దర్శకుడు అశ్విన్. ఇంతుకు మాయా చిత్రంలో భయపెట్టి వణుకు పుట్టించిన ఈ దర్శకుడు…ఇందులోనూ అదే పంథాను కొనసాగించి ప్రతి ఒక్క ప్రేక్షకుని చేత ఔరా అనిపించాడు. సినిమా నిడివి కూడా తక్కవే కావడంతో ఆడియన్స్ కూడా ఎక్కడా బోరింగ్ ఫీల్ అవ్వరు. ప్రతి సీన్ తరువాత నెక్ట్స్ ఏం జరగబోతోందననే ఉత్సూకతను పెంచి ప్రేక్షకులు కుర్చీలో నుంచి కదలనీయకుండా చేశారు. మూవీ స్టార్టింగ్ నుంచే ప్రేక్షకుడు సినిమాలో లీనమయ్యేలా చేసి థ్రిల్ కు గురిచేశాడు దర్శకుడు. తప్పకుండా ఇది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది.
కథ.. కథనాలను తాప్సీ చుట్టూనే రాసుకుని ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. అందుకు తాప్పీ కూడ తన నటనతో ఆకట్టుకుంది. ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి.. ఫ్యామిలీకి దూరంగా జీవిస్తూ… తన రూమ్ ఎలా వుంటుంది… తన జీవన శైలి ఏంటి? తదితర అన్ని విషయాల్లోనూ మన పక్కింటి అమ్మాయిలానే కనిపించి మెప్పిస్తుంది తాప్సీ.  ముఖ్యంగా భయపడే సన్నివేశాల్ని చాలా బాగా చేసింది. పని మనిషి కళమ్మ (వినోదిని వైద్యనాథన్) పాత్ర కీలకంగా చెప్పుకోవాలి. దాదాపు సినిమా అంతా ట్రావెల్ అవుతుంది. తాప్సీ పాత్రకు కళమ్మ పాత్రను బాగా హెల్ప్ అయ్యేలా చాలా బాగా సింక్ చేశారు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పండాయి. అమృత‌ని చంపిన సైకో కిల్లర్లే స్వప్నని ద‌గ్గరికి ఎలా వ‌చ్చారనే దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. తాప్సీకి వచ్చే కలలతోటి భయపెట్టాడు దర్శకుడు. చివర్లో తాప్సీ పనిమనిషి పాత్రతో కలిసి ఫైట్ చేసే సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే కిల్లర్స్ ఎవరు వారు ఎందుకు చంపుతున్నారనే దాంట్లోకి వెళ్లి దర్శకుడు టైం వేస్ట్ చేయలేదు. ప్రేక్షకులు చాలా తెలివిగలవారు అనే విషయాన్ని మరోసారి నిరూపించాడనిపించింది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టప‌డే ప్రేక్షకులకి అమితంగా న‌చ్చుతుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అశ్విన్‌, కావ్య రామ్‌కుమార్‌లు క‌లిసి క‌థ‌, క‌థ‌నాల్ని రాసుకున్న విధానం మెప్పిస్తుంది. రోన్ ఏతాన్ యోహాన్ సంగీతం, ద్వితీయార్ధంలో రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్‌, ఎ.వసంత్ ఛాయాగ్రహ‌ణం చిత్రానికి ప్రధాన బ‌లం.  నిర్మాణ విలువ‌లు రిచ్ గా వున్నాయి. చాలా అరుదుగా వచ్చే ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ ని తప్పకుండా చూడాల్సిందే. గో అండ్ వాచ్ ఇట్.

చివరగా.. ఎంగేజింగ్ థ్రిల్లర్ ‘గేమ్ ఓవర్‘
రేటింగ్: 3.5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here