రివ్యూ: గ్యాంగ్ లీడర్

0
253

వరుస విజయాలతో దూసుకుపోతున్న.. నాని ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ గా మరోసారి అలరించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ప్రియాంక అరుల్ మోహన్‌ నానికి జంటగా నటించగా.. ఆర్ ఎక్స్ 100 ఫేం కార్తికేయ విలన్ పాత్రలో నటించారు. ఓ బేబీతో మళ్లీ తెరంగేట్రం చేసిన సీనియర్ నటీ ఇందులో మరోసారి కీ రోల్ పోషించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్టెట్ చేసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం ఏమాత్రం అలరించిందో చూద్దాం పదండి.

కథ: ఆరుగురు(కార్తికేయ అండ్ బ్యాచ్) కలిసి పంజాగుట్టలోని ఓ బ్యాంక్‌లో రూ.300 కోట్లు దొంగతనం చేస్తారు. అయితే వాళ్ళలో ఒకడు మిగితావాళ్లను చంపి ఆ డబ్బు మొత్తం పట్టుకుపోతాడు. దాంతో ఆ చనిపోయిన అయిదుగురుకి సంబందించిన వ్యక్తులు(లక్ష్మీ, ప్రియాంక అరుల్ మోహన్, శరణ్య, స్వాతీరెడ్డి, బేబి) ఒక గ్యాంగ్‌గా ఏర్పడి వాళ్ళ పగను తీర్చుకోవడానికి రివేంజ్ నవలా రచయిత అయిన పెన్సిల్ పార్థసారథి(నాని) సాయం కోరతారు. అప్పటి వరకు ఇంగ్లిష్ సినిమాలు చూసి రివేంజ్ బుక్స్ రాసిన పార్థసారధి కూడా ఒక ఒరిజినల్ బుక్ రాయడం కోసం వాళ్ళు వెతుకుతున్న వ్యక్తిని కనిపెట్టి, అతనిపై పగ తీర్చుకోవడానికి వాళ్లకి హెల్ప్ చెయ్యడానికి ఒప్పుకుంటాడు. అలా ఆ రివేంజ్ గ్యాంగ్‌కి లీడర్‌గా మారిన నాని వాళ్ళతో కలిసి ఆ క్రిమినల్‌ని కనిపెట్టి, అతన్ని ఎలా అంతం చేసాడు అనేది సినిమా కథ.

కథ.. కథనం విశ్లేషణం: ఇది పూర్తిగా భిన్నమైన కథ. అందుకే ఈ సినిమా టైటిల్‌కి లింకప్ చేసిన కథని ఎంచుకోవడంలోనే డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ స్పెషాలిటీ తెలుస్తుంది. అయితే విక్రమ్ రాసుకున్న ఈ కథని, ఆ కథలోని పెన్సిల్ పాత్రని నాని ఓన్ చేసుకున్న విధానానికి మెచ్చుకోవాలి. ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు నాని. లైటర్ ఫన్‌తో ఉండే సన్నివేశాలను కూడా తన నటనతో ఫుల్ కామెడీగా మార్చేశాడు. నానిలోని సెటిల్ యాక్టర్ మరోసారి ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. నాని తనని నేచురల్ యాక్టర్ అని ఎందుకంటారు అనే విషయాన్ని సినిమాలో చాలా చోట్ల ప్రూవ్ చేసాడు. నాని కాకుండా వేరే ఎవరు హీరో అయినా ‘గ్యాంగ్ లీడర్’ ఈ స్థాయిలో అయితే ఉండేది కాదు. ‘ఓ బేబీ’ సినిమాలో పూర్తిస్థాయిలో ఎమోషన్స్ పండించి అలరించిన సీనియర్ యాక్టర్ లక్ష్మి ఈ సినిమాలో మరింతగా ఆకట్టుకుంది. నానికి ఆమె కామెడీ టైమింగ్ కూడా తోడవ్వడంతో చాలా సీన్స్ పేలాయి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్‌ కూడా హోమ్లీగా కినిపించి మెప్పించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ క్యూట్‌గా ఉంది. వెన్నెల కిషోర్ చేసిన గే కామెడీ నవ్విస్తుంది.. ఈ సినిమా కోసం విలన్‌గా మారిన హీరో కార్తికేయ బాగా చేసాడు. స్టైలిష్ బ్యాడ్ బాయ్ పాత్రలో ఎక్కడా తడబడకుండా నటించాడు. అతని ప్రెజెన్స్ సినిమాకి ప్లస్ అయ్యింది. మిగతా నటీనటులంతా పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
మంచి కథని ఎంచుకున్న విక్రమ్ కె.కుమార్ ఈ సినిమాలో నాని హీరో అనగానే కాస్త రిలాక్స్ అయ్యి స్క్రీన్ ప్లే రాసుకున్నాడేమో అనిపించింది. సినిమా టేకాఫ్‌లోని రాబరీ సీన్‌నే కొత్తగా చూపించి, సినిమా మొదటి పదిహేను నిమిషాలతో అంచనాలు పెంచాడు. కీలకమైన సెకండ్ హాఫ్‌లో విక్రమ్ రైటింగ్ ఆకట్టుకుంది. చాలా చోట్ల సినిమాటిక్ లిబరిటీస్ కాస్త ఎక్కువ వాడుకున్నాడు. ‘మనం, ఇష్క్’ సినిమాల్లో అడుగడుగునా అలరించిన విక్రమ్ సెన్సిబిలిటీస్ ని ఇందులోనూ చూపించాడు. ఈ సినిమాకి టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చే సీన్ బావుంది. అనిరుథ్ అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణవిలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ రివేంజ్ గ్యాంగ్.. లీడర్ ను చూసేయొచ్చు. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here