కార్తికేయ ‘గుణ369’ ట్రైలర్ అదుర్స్..!

0
51

‘ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ హీరోగా… అన‌ఘ హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం `గుణ 369`. శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల స‌మ‌ర్ప‌ణ‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్స్‌పై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ బోయపాటి శిష్యుడు అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచయం అవుతున్నారు.
చైత‌న్ భ‌రద్వాజ్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ చిత్రం ట్రైలర్ ఈరోజే విడుదలైంది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ అటు ప్రత్యక్షంగా గానీ.. ఇటు సోషియల్ మీడియాలోగానే చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా కార్తికేయ మాస్ లుక్ కి మంచి మార్కులు వేస్తున్నారు. ఇక యాక్షన్ సీన్స్ కూడా మాస్ కు గుస్ బమ్స్ తెప్పించేలా వుండటంతో ట్రైలర్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బోయపాటి తరహా యాక్షన్ సీన్స్ ఇందులో వున్నట్లో ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోందని ఆడియన్స్ అంటున్నారు.
అలానే కార్తికేయ డైలాగ్ డిక్షన్ కూడా స్లోలో చాలా బాగుంది. ఇంతకు ముందు సినిమాలకు ఇందులో అతడు పలికిన సంభాషణలకు చాలా వేరియషన్ వుంది. స్లోగా ఎమోషన్ లో పలికిన డైలాగులు చాలా బాగున్నాయి. అతనికి జంటగా నటించిన అనఘతో కార్తికేయకు కెమిస్ట్రీ బాగా కుదిరింది. హ్లోమ్లీ లుక్ లో ఈ తమిళ్ పొన్ను తెలుగు ఆడియన్స్ ను బాగా అలరించనుందనే చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన లిరిక్సికి తోడుగా ఈరోజు విడుదలైన ట్రైలర్ రావడంతో యూత్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్.ఎక్స్.100తో యుత మదిని ఎలాగైతే దోచేశాడో… గుణ369తో కూడా కార్తికేయ మరోసారి యూత్ ను ఆకర్షింబోతున్నాడని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ఇప్పటికే ప్రీ బిజినెస్ తో మంచి అప్లాజ్ అందుకున్న ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లెట్స్ ఎంజాయ్ ‘గుణ369’ ట్రైలర్..!

Here’s #Guna369Trailer 👉 http://bit.ly/Guna369Trailer

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here