బబ్లీగా ఉండే క్యారెక్టర్ నాది- హేమ‌ల్ ఇంగ్లే

0
34

బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ‘హుషారు’. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ హేమ‌ల్ ఇంగ్లే మాట్లాడుతూ “తెలుగులో ఇది `హుషారు` తొలి చిత్రం. మాది మ‌హారాష్ట్ర కోలాపూర్‌. నేను చ‌దువుకుంటూనే బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనేదాన్ని మిస్ యూనివ‌ర్సిటీ 2015 విజేత‌గా నిలిచాను. త‌ర్వాత మ‌రికొన్ని అందాల పోటీల్లో పాల్గొన్నాను. తొలి చిత్రంగా హుషారులో వ‌న్ ఆఫ్ ది లీడ్ రోల్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. మంచి పాత్ర చేశాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ప్ర‌మోష‌న‌ల్ టూర్‌కి కూడా వెళ్లాం. సినిమా విష‌యానికి వ‌స్తే ముంబై నుండి వ‌చ్చిన సౌమ్య అనే అమ్మాయిగా క‌న‌ప‌డ‌తాను. కెరీర్‌కి మొద‌టి ప్రాధాన్య‌త ఇచ్చే అమ్మాయి పాత్ర నాది. దినేష్ తేజ్ ఇందులో దినేష్ తేజ్ నా జోడిగా న‌టించారు. నా పాత్రకు గ్లామ‌ర్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. క‌చ్చితంగా నాకు మంచి సినిమా అవుతుంద‌ని భావిస్తున్నాను. బబ్లీగా ఉండే క్యారెక్టర్ నాది. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. నేను రెండు పాటల్లో ఉంటాను. డైరెక్టర్ హర్షకి చాలా కొత్త ఐడియాస్ ఉన్నాయి. చాలా ఎక్స్‌లెంట్‌గా డైరెక్ట్ చేశాడు. నా క్యారెక్టర్ కాకుండా సినిమాలో బంటి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఇందులో మొత్తం నాలుగు పెయిర్స్ ఉంటాయి. ఫ్రెండ్‌షిప్‌ని బేస్ చేసుకుని చేసిన కథ ఇది. దానికి ఏజ్‌తో సంబంధం లేదు. ఏ ఏజ్ వారికైనా ఫ్రెండ్స్ ఉంటారు. ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష చిత్రాన్ని చ‌క్క‌గా తెర‌కెక్కించారు’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here