‘లడకీ” (అమ్మాయి) సినిమాపై కోర్టు స్టే

0
49

రాంగోపాల్ వర్మ: ‘లడకీ” (అమ్మాయి) సినిమాపై కోర్టు స్టే

ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ రూపొందించిన “లడకీ” (అమ్మాయి) సినిమాపై కోర్టు స్టే విధించింది. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో వర్మ నిర్మించిన ఈ సినిమాను నిలుపుదల చేయాలంటూ ఎన్. రవి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ లోని గౌరవ సిటీ సివిల్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఎన్.రవి స్పందిస్తూ,. గతంలో ‘లక్ష్మీస్ ఎన్ఠీఆర్’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మాకు చెందిన శివం సెల్లులాయిడ్స్ సంస్థకు రాంగోపాల్ వర్మ అమ్మారు. ఆ తర్వాత మాకు హక్కులు ఉన్నప్పటికీ, ముంబై కి చెందిన వేరొక సంస్థకు రాంగోపాల్ వర్మ మాకు తెలియకుండానే అమ్మేశారు. ఈ నేపథ్యంలో అనేకమార్లు వర్మను అడిగే ప్రయత్నం చేశాం. ఫిలిం ఛాంబర్ లో కూడా వర్మ పై పిర్యాదు చేశాం. అయినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాం. ఆ మేరకు కోర్టు ఈ నెల 14వ తేదీన రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘లడకీ” సినిమా ప్రదర్శనను నిలుపుదల చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అన్నిరకాల డిజిటల్, ప్లాట్ ఫామ్స్ లో కూడా సినిమాను అమ్మడానికి కానీ బదిలీ చేయడానికి, కానీ ప్రదర్శించడానికి వీలులేకుండా తాత్కాలిక నిషేధం విధిస్తూ కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందని ఆయన చెప్పారు.

N.RAVI

SIVAM CELLULOIDS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here