యూత్ ని మెప్పించే ‘హిప్పి’

0
62

‘Rx100’తో  యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన కార్తికేయ…. ఇప్పుడు మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ హిప్పీతో మన ముందుకొచ్చాడు. Rx100లో బోల్డ్‌ సీన్స్‌తో రెచ్చిపోయిన కార్తీకేయ… ‘హిప్పీ’లోనూ అలాంటి సీన్లతో రెచ్చిపోయాడు. తమిళ ప్రొడ్యూసర్‌ కలైపులి ఎస్‌ థాను నిర్మాతగా… TN కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు యూత్ ని ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ ; హిప్పి అలియాస్ దేవదాస్‌  (కార్తికేయ)  మార్షల్‌ ఆర్ట్స్ ప్లేయర్. అతనికి స్నేహ (జజ్బా సింగ్) అనే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఓ సారి స్నేహతో కలిసి షికారుకు వెళ్లినప్పుడు బైక్ రిపేర్ రావడంతో… రోడ్డుపైనే రొమాన్స్ మొదలుపెడతారు. అదేసమయంలో బైక్ పై గోవా వెళుతున్న స్నేహ ఫ్రెండ్‌ ఆముక్తమాల్యద(దిగంగన సూర్యవంశీ) వస్తుంది. దాంతో  హిప్పి… ఆముక్తమాల్యదను చూసిన తొలి చూపులోనే మళ్లీ ప్రేమలో పడతాడు. స్నేహను కాదని ఆముక్తమాల్యద చుట్టూ తిరుగుతుంటాడు. హిప్పీకి ఇన్నాళ్లు తన మీద ఉన్నది ప్రేమ కాదు ఎట్రాక్షన్ అని అర్థం చేసుకున్న స్నేహ… వేరే పెళ్లి చేసుకొని… హిప్పి ని ప్రేమించమని ఆముక్తమాల్యదకు చెప్పి వెళ్లిపోతుంది. అక్కడి నుంచే అసలు కథ మొదలువుతుంది. ఆముక్తమాల్యద తన ఆంక్షలతో హిప్పీకి నరకం చూపించి… అప్పులపాలు కూడా చేస్తుంది. దీంతో ఎలాగైనా ఆముక్తమాల్యదను వదిలించు కోవాలనుకుంటాడు హిప్పీ. అందుకోసం హిప్పీ ఏం చేశాడు? చివరకు వీళ్ళ ప్రేమ కథ ఎలా ముగిసిందన్నదే  మిగతా కథ.

కథ… కథనం విశ్లేషణ: ప్రేమ పేరుతో ఒకరితో రొమాన్స్ చేయడం… చివరకు అది అట్రాక్షన్ అని తెలిసి మరొకరిని ప్రేమించడం… ఆమెతోనూ సరిగా అడ్జెస్ట్ కాలేకపోవడం లాంటి కాంటెంపరరీ స్టోరీ కథలు సమాజంలో మనకు చాలా కనిపిస్తుంటాయి. అలాంటి కథనే రొమాంటిక్ గా… కాస్త డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో…. యూత్ కి నచ్చే సీన్లు…. సంభాషణలతో హిప్పి ని తెరమీద చూపించాడు దర్శకుడు. తొలి పది నిమిషాల్లోనే జేడీ చక్రవర్తి చెప్పే డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌తో సినిమా ఎవరిని టార్గెట్‌ చేసి రూపొందించారు క్లారిటీ ఇచ్చేశారు. రొమాంటిక్‌ సీన్స్‌ విషయంలోనూ కాస్త లిమిట్స్‌ క్రాస్‌ చేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. కథ పరంగా బాగానే ఉన్నా కథనం మాత్రం సుధీర్ఘంగా సాగుతుంది. వెన్నెల కిషోర్ కామెడీ బాగానే వర్క్‌ అవుట్ కావటం కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఆర్‌డీ రాజశేఖర్‌ సినిమాటోగ్రఫి బాగుంది. నివాస్‌ కే ప్రసన్నా సంగీతం పరవాలేదు. పాటలు విజువల్‌గా బాగున్నాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఆర్‌ఎక్స్‌ 100లో ఒకే ఎక్స్‌ప్రెషన్‌లో కనిపించిన కార్తికేయకు ఈ సినిమాలో వేరియేషన్స్‌ చూపించే అవకాశం దక్కింది. లుక్స్‌తో పాటు నటనపరంగానూ మంచి మార్కులు సాధించాడు. యాక్షన్‌ సీన్స్‌లో సూపర్బ్ అనిపించాడు. హీరోయిన్‌ దిగంగనా సూర్యవంశీ.. ఆముక్తమాల్యద పాత్రలో ఒదిగిపోయింది. నటనతో పాటు గ్లామర్‌ షోతోను యూత్‌ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. మరో కీలక పాత్రలో నటించిన జేడీ చక్రవర్తి, తన అనుభవంతో అరవింద్‌ పాత్రను అవలీలగా పోషించాడు. వెన్నెల కిశోర్‌ తన కామెడీ టైమింగ్‌తో  నవ్వించాడు. ఇతర పాత్రల్లో జజ్బా సింగ్‌, బ్రహ్మాజీ, సుదర్శన్‌ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. గో అండ్ వాచ్ ఇట్..!

రేటింగ్: 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here