ప్రేక్షకులు మెచ్చిన “చిత్రపటం” మోషన్ టిజర్..!

0
24

ప్రముఖ కవి, రచయిత, సంగీత దర్శకుడు గా మనల్ని ఇంతకాలం అలరించిన బండారు దానయ్య కవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “చిత్రపటం” సినిమా మోషన్ టిజర్ విడుదలయింది. పచ్చని పంట పొలాలను చూపిస్తూ ఒక పాతకాలం కుర్చీ, దానిపై ఒక కండువా, ఆ పక్కన ఒక చిన్న స్టూల్ దానిపై ఒక రాగి చెంబు ఆ రెండింటి మధ్య కింద పాతకాలం కిర్రు చెప్పులతో క్లోజ్ అయ్యే షాట్ ఒక్కసారిగా మనల్ని పల్లెటూరు బ్యాక్డ్రాప్ కలిగిన అందమైన సినిమా లుక్ లోకి తీసుకెల్లాయి. ఈ సినిమా మోషన్ టిజర్ గురించి ఆ చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ మా “చిత్రపటం” నుండి విడుదల అయిన మోషన్ టిజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మోషన్ టిజర్ లో చెప్పినట్టు “చిత్రపటం” ఇదేం పేరు అనుకోకండి, చిత్రా.. అని పిలవండి పలుకుతాను”. ఈ డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతేకాక ఈ టిజర్ లో ఉండే బ్యాకగ్రౌండ్ స్కోర్ కి అద్బుతమైన స్పందన వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల నుండి, ప్రేక్షుకులు నుండి కూడా బ్యాకగ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది అంటూ అందరూ చెప్తున్నారు. ఇటివల టాక్ పార్ట్ పూర్తి అయింది, భద్రాచలం, రాజమండ్రి తదితర ప్రాంతాలలో అందమైన లోకేషన్ లలో ఈ నెలలోనే పాటల చిత్రీకరణ జరిపి అతి త్వరలో సినిమాను ప్రేక్షకులకు అందించనున్నాం అని తెలిపారు.

కేరింత ఫేం పార్వతిశం, శ్రీవల్లి లు హీరో హీరొయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాలో కోటా శ్రీనివాస రావు, పోసాని కృష్ణ మురళీ, శరణ్య, ‘బాహుబలి’ ప్రభాకర్, ‘అసురన్’ నారెన్, బాలాచారి వంటి తదితర తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా ఎస్ మురళీ మోహన్ రెడ్డి, నిర్మాత పుప్పాల శ్రీధర్ రావు, కథ కథనం మాటలు పాటలు సంగీతం దర్శకత్వం బండారు దానయ్య కవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here