మా బ్యానర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా ‘హుషారు’- బెక్కం వేణుగోపాల్

0
76

‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్ ‘మేము వయసుకు వచ్చాం’ , ‘ సినిమా చూపిస్త మావ’ లాంటి సూపర్ హిట్లు తీశారు. ఈ సంస్థలో 9 వ చిత్రంగా ‘హుషారు’ తీస్తున్నారు. రియాజ్ మరో నిర్మాత. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, దక్ష నాగర్కర్, ప్రియా వడ్లమాని, రాహుల్ రామకృష్ణ హేమ ఇంగ్లే ప్రధాన తారాగణం. ‘అర్జున్ రెడ్డి’ తో పాపులర్ అయిన సంగీత దర్శకుడు రథన్ , ఛాయాగ్రాహకుడు రాజ్ తోట ఈ చిత్రానికి పనిచేసారు . ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత తెలిపారు. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలేంటో వారి మాటల్లోనే…

దర్శకుడు హర్ష మాట్లాడుతూ ‘నలుగురు కుర్రాళ్ల జీవితంలో జరిగిన సంఘనటల్ని సరదాగా చెప్పాం. ఈలోకం వదిలి వెళ్లేటప్పుడు జ్ఞాపకాలు తప్ప ఇంకేం తీసుకెళ్లలేము అనే కాన్పెప్ట్ తో తెరకెక్కించాం. హుషారెక్కించే సీన్స్, సాంగ్స్ ఎంటర్ టైన్ చేస్తాయి.నలుగురు కుర్రాళ్ల జీవితం అందర్నీ ఎంటర్ టైన్ చేస్తుంది. బీరు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఎమోషనల్ గా, ఇన్ స్పైరింగ్ గా ఉంటాయి. ఈ సినిమా కోసం నిర్మాత చాలా సపోర్ట్ చేశారు. రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ మరో ఎస్సెట్. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే హుషారు త్వరలోనే మీ ముందుకు వస్తుంది’ అన్నారు.

రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ… ఫ్రస్టేటెడ్ బాస్ క్యారెక్టర్లో నటించాను. ఈ బాస్ కి ఈ నలుగురు కుర్రాళ్లకు లింక్ ఏంటి… వాళ్లతో ట్రావెలింగ్ ఫన్నీగా సాగుతుంది. డైరెక్టర్ చేప్పిన స్టోరీ లైన్ నచ్చిన తర్వాత రెండు రోజుల్లో ఫైనల్ చేశాను. అని అన్నారు.

హీరో తేజస్ కంచర్ల మాట్లాడుతూ… సినిమా చాలా బాగా వచ్చింది. మేం అనుకున్న దానికంటే దర్శకుడు హర్ష చేశాడు. బెక్కం గారి సపోర్ట్ మర్చిపోలేము. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది. ట్రెండీగా ఉండే ఫ్రెండ్ షిప్ స్టోరీ ఇది. కామెడీ ఎమోషనల్ గా సాగుతుంది. అని అన్నారు.

తేజ్ కూరపాటి మాట్లాడుతూ… నేను బంటి అనే క్యారెక్టర్లో నటిస్తున్నాను. అన్నీ తెలుసు అనుకునే క్యారెక్టర్. కానీ ఏమీ తెలీదు. లైఫ్ ని ఎంజాయ్ చేసే పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమా నాకు మంచి పేరు తీసుకొస్తుంది. అని అన్నారు.

అభినవ్ చుంచు మాట్లాడుతూ… నాది ఇన్నోసెంట్ క్యారెక్టర్. నేను బాగుండాలని నా ఫ్రెండ్స్ కోరుకునే పాత్రలో నటించాను. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఈ ప్రాజెక్టులో చేరాను. అనుకోకుండా ఇందులో మంచి క్యారెక్టర్ చేశాను. నాకు మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను. అని అన్నారు.

దినేష్ తేజ్ మాట్లాడుతూ… నా క్యారెక్టర్ అగ్రెసివ్ గా ఉంటుంది. గొడవలకు ముందుంటాను. మంచి క్యారెక్టర్ తో ఇండస్ట్రీ కి పరిచయమౌతున్నాను. అని అన్నారు.

హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ… నాది ఇది మూడో సినిమా. కానీ నేను ఫస్ట్ సైన్ చేసిన సినిమా ఇదే. యాక్టింగ్ కోసం ఇక్కడ జరిగిన వర్క్ షాప్స్ బాగా ఉపయోగపడ్డాయి. అమెరికా వెళ్లాలనుకునే అమ్మాయి పాత్రలో నటించాను. ఈ సినిమా నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నాను.

హీరోయిన్ దక్ష నాగర్కర్ మాట్లాడుతూ…. నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. నా పెయిర్ తేజస్ తో రొమాన్స్ బాగుంటుంది. డైరెక్టర్ హర్ష చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఫుల్ ఫన్ ఎమోషన్ తో సాగుతుంది. అందరికీ ఈ సినిమా మంచి పేరు తెస్తుంది. హుషారెక్కించే సాంగ్స్, కంటెంట్ అందరినీ మెప్పిస్తుంది. అని అన్నారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ  ‘మా బ్యానర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా ఇది. కథ, కథనాలు చాలా ఇన్నోవేటివ్ గా, ట్రెండీగా ఉంటాయి. దర్శకుడు శ్రీ హర్ష ఎక్స్ లెంట్ గా తెరకెక్కించాడు. షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉంది. లిరికల్ వీడియో సాంగ్ కి మంచి అప్లాజ్ వచ్చింది. కథ, కథనాల మీద మాకు మంచి నమ్మకం ఉంది. ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేసినప్పటికీ అన్న వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే కంటెంట్ ఉంది. నా వెల్ విషర్ దిల్ రాజు గారికి ట్రైలర్ బాగా నచ్చింది. మంచి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ప్రమోషన్ కూడా అగ్రెసివ్ గా చేస్తున్నాం. మెయిన్ కాలేజెస్ లో మా టీం సందడి చేయనుంది. మంచి డేట్ చూసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’  అన్నారు.

ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్: వీణా రాణి

అసోసియేట్ ప్రొడ్యూసర్స్: లక్ష్మినారాయణ, లింగా శ్రీనివాస్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here