అమెరికా అధ్యక్షుడి కుటుంబానికి టచ్ లో ఉన్న హైదరాబాద్ ఆస్ట్రాలజర్

0
422

అమెరికా అధ్యక్షుడి కుటుంబానికి టచ్ లో ఉన్న హైదరాబాద్ ఆస్ట్రాలజర్

AstroMD – Balu Munnangi

ఈ సృష్టిలోని ప్రతి అణువణువు దివ్యశక్తితోనే నడుస్తుంది. అదే విధంగా మన మనసులో వచ్చిన ఆలోచనను విజయవంతంగా అమలు చేయడంలో మన చుట్టూ ఉండే వారే కాకుండా ఆయా పరిస్థితుల సహకారంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే కలిగే ఆలోచనలు మాత్రం కేవలం కర్మను బట్టి ఉంటాయనేది వాస్తవం. మనిషి జీవితంలో జరిగే సంఘటనలు ఏవీ యాదృచ్ఛికం కావు. ప్రతీది ముందుగానే నిర్ణయించబడుతుంది. అది మన అరచేతి రేఖలో నిక్షిప్తం అయి ఉంటుంది. ఒక మనిషి తాను తయారు చేసే వస్తువు పనిచేయడానికి ఎలా మాన్యువల్ ఇస్తాడో, ఆ భగవంతుడు మనిషికి అందచేసిన మాన్యువల్…. అరచేతిలోని రేఖలు. వీటిని చదవడం వల్లనే ఆయా వ్యక్తి బలం, బలహీనతనలు, అదృష్ణ.. దురదృష్టాలు. జీవితంలో ఎలాంటి పరిస్థితులకు గురవుతాడో తెలియజేస్తుంటాయి. ఈ అరచేతి రేఖలను తెలిపే శాస్త్రమే పామిస్ట్రీ. గత 20 సంవత్సరాలుగా ఆస్ట్రాలజీ (జ్యోతిష్యం), పామిస్ట్రీ ( హస్తసాముద్రికం), న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) లో నిత్యం పరిశోధనలు చేస్తూ తనదైన ప్రత్యేక శైలి ఏర్పర్చుకొని భూత, భవిష్యత్, వర్తమానాలను అత్యంత కచ్చితంగా చెప్పడంలో నైపుణ్యం సంపాదించారు బాలు మున్నంగి.

ఇప్పటివరకు ఎందరో అంతర్జాతీయ, జాతీయ సెలెబ్రిటీలు ఆయన వద్ద జ్యోతిష్యం చెప్పించుకొని నివారణ మార్గాలను సైతం తెలుసుకొని సక్సెస్ అయ్యారు. బాలు పుట్టింది గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని మున్నంగి అనే పల్లెటూర్లో అయినప్పటికీ… హస్త సాముద్రికంపై మక్కువతో దానిలోని లోతు (డెప్త్)ను అందుకోవాలన్న ఒకే ఒక్క పట్టుదలతో… విశేష పరిశోధనలు చేసి ఘనాపాటిగా నిలిచారు. అందుకే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబ సభ్యుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. అరచేతిలో ఉన్న రేఖలు, దాని ఆకారం (షేప్) , రంగు, చేతి వేళ్ల పొడుగు మొదలగువాటిని పరిశీలించి జరిగిపోయిన సంఘటనలు, జరిగేవి సైతం కచ్చితంగా చెప్పగలుగుతారు బాలు. కాకపోతే పుట్టిన సమయం, తేది మాత్రం తప్పనిసరి. ఇవి కచ్చితంగా ఉంటే తాను ఆ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలు, వివాహం, చివరకు మరణ తేదీని సైతం స్పష్టంగా చెప్పగలుగుతారు.

నేపథ్యం…
మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన మున్నంగి సీతారామరెడ్డి, భారతి రెండో సంతానమే బాలు. మున్నంగిలోనే ఆయన పదవ తరగతి చదివారు. ఆ పై డిగ్రీని మైక్రోబయాలజీలో తెనాలిలోని విఎస్ఆర్-ఎన్వీఆర్ కళాశాలలో చేయగా…. గుంటూరులోని ఆర్ విఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంబిఏ పూర్తి చేశారు. విశేషమేమిటంటే…. బాలుకి చిన్నతనం నుంచి మాయలు, మంత్రాలతో కూడిన సినిమాలంటే చాలా ఇష్టం. విఠలాచార్య సినిమాలు ఏమాత్రం మిస్ కాకుండా చూసేవారు. అంతే కాకుండా తన చిన్నప్పుడు మేనమామ తాతిరెడ్డి హస్త సాముద్రికం చెబుతుండేవారు. దీంతో ఆయనపై వీరిందరి ప్రభావం పడింది. ఆ విధంగా హస్త సాముద్రికంపై ఆసక్తి కలిగింది. డిగ్రీ చదువుతున్నప్పుడు ప్రముఖ యురోపియన్ న్యూమరాలజిస్ట్ కిరో రాసిన పుస్తకం “కన్ఫెషన్ అండ్ మెమోరీస్ ఆఫ్ ఏ మోడ్రన్ సీర్” (“Confession and Memmories of a Moodern Seer”) అనే పుస్తకాన్ని చదవిన తర్వాత హస్తసాముద్రికంపై మక్కువ మరింత పెరిగింది. ఇది ఎంతవరకంటే సీరియస్ గా పరిశోధనలు చేసేంతవరకు. దాంతో తనకు కనిపించిన ప్రతీ వారిని నిశితంగా పరిశీలించడం, ఎవరైనా హస్తసాముద్రికానికి అంగీకరిస్తే వారి అరచేతిని క్షుణ్ణంగా శోధించి చెప్పేవారు. ఇలా ఒకసారి కాదు. బస్సులో వెళుతున్నప్పుడు, కాలేజీలో, ఇంటివద్ద…. ఈ విధంగా కొన్ని వందల అరచేతులను పరిశీలించారు. అప్పుడే ఆయనకు ప్రపంచంలో ఏ వ్యక్తి అరచేతి మరొకరిని పోలి ఉండదని తెలుసుకున్నారు. ఓ వైపు చేతులు పరిశీలించడమే కాకుండా… పామిస్ట్రీకి సంబంధించిన పలు పుస్తకాలు కొని చదవడంతో దానిపై ఆయనకు పట్టు లభించింది.

పరిశోధన
మరోవైపు బాగా చదువుకున్నా… మంచి ఉద్యోగం కోసం ఆశించకుండా పామిస్ట్రీపై ఆసక్తి కనబరుస్తున్న కుమారుడిని చూసి తల్లితండ్రులు ఆందోళన చెందారు. అయితే బాలు మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తాడనుకున్న కుమారుడు…దానికి తిలోదకాలు ఇచ్చి ఉద్యోగ ప్రయత్నాలకు గుడ్ బై చెప్పి 1998లో హస్తసాముద్రికంపై పరిశోధనకు శ్రీకారం చుట్టారు. ఇతరత్రా ఏమీ పట్టించుకోకుండా తనకు ప్రీతిపాత్రమైన పామిస్ట్రీపైనే పరిశోధనలు చేయడానికే సమయాన్ని వెచ్చించారు. అలా మొదలై… ఇప్పటికీ 21 ఏళ్ల విశేష అనుభవం…. కొన్ని వేల చేతులను విశ్లేషించిన ఘనత లభించింది.

మామూలుగా నేటి సమాజంలో జ్యోతిష్యాన్ని చాలామంది ఒక వృత్తిగా చేపట్టినవారే ఎక్కువ మంది. వీరిలో దీనికి సంబంధించి తెలిసిన వారు కొందరైతే….. కాకిలెక్కలతో దండుకునే వారు మరికొందరు.
కసిగా, పట్టుదలగా దానిలోని అంచులు చూడాలనుకునే వారిని వేళ్లమీదే లెక్కించవచ్చు. అలాంటి వారిలో ఒకరు బాలు. అందుకనే అమెరికా అధ్యక్షుడి కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ మత గురువు దలైలామా, అజయ్ దేవగణ్, కాజోల్, గ్రామీ అవార్డు విన్నర్ తన్వీర్ షాతో పాటు పలువురు ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ తారలు, కేంద్రమంత్రులు, కొన్ని రాష్ట్రాల సిఎంలు సైతం బాలుని సంప్రదించినవారే. బాలు కేవలం రేఖలను పరిశీలించి జ్యోతిష్యం చెప్పడమే కాదు… మెడికల్, బిజినెన్, కెరీర్ ఈ మూడింటికి సంబంధించి వివరంగా చెప్పగలుగుతారు. ఈ మూడింటిపై చాలా స్టడీ చేయడమే ఇందుకు కారణం. మిగతా పామిస్ట్రీలకు భిన్నంగా వ్యాపారానికి సంబంధించి తేదీల ప్రాధాన్యతను , మెడికల్ లో అయితే ఎదురయ్యే రోగాలు, వాటిని ఎంతవరకు క్యూర్ చేయగలగవచ్చునో వివరిస్తారు. కెరీర్ లో ఆ వ్యక్తి గతంలో జాబ్ చేశాడా? అతడికి మళ్లీ ఉద్యోగం వస్తుందా? అందుకు ఏం చేయాలి? ఏ అంకె లక్కీగా ఉంటుంది? తదితర వివరాలన్నీ అందిస్తారు.

అసలు ఈ పామిస్ట్రీ అంటే ఏమిటి… దీనికి ఎందుకంత ప్రాముఖ్యం….
ఇందులో రెండు భాగాలుంటాయి. ఒకటి కిరోమాన్సీ (chiromancy) రెండోది కిరోగనమీ (chirognomy)
కిరోమాన్సీ – వ్యక్తి చేతిరేఖలను పరిశీలించి అతడి భవిష్యత్ ను చెప్పడం
కిరోగనమీ – చేతి ఆకారం, వేళ్లు, రంగు, గోళ్లు వీటిని పరిశీలించి ఆ వ్యక్తిని అంచనా వేయడం.
అదే విధంగా ప్రపంచంలో 7 రకాల అరచేతులు (షేప్ ఆఫ్ ది హ్యాండ్) ఉంటాయని ఈ సందర్భంగా బాలు చెప్పారు. కిరోమాన్సీ, కిరోగనమీ ద్వారా జరిగిపోయిన సంఘటనలు, జరిగేవి చెప్పడమే హస్త సాముద్రికం. భగవంతుడు ఒక్కో మనిషికి ఒక్కో విధమైన అరచేతిని అందజేస్తుంటాడు. ఈ చేతిలోని రేఖలే అతడి అదృష్టం లేదా దురదృష్టానికి అద్దం పడుతుంటాయి.

పామిస్ట్రీని స్టడీ చేయాలంటే….
తప్పకుండా పుట్టిన తేదీ, పుట్టిన సమయం, జన్మించిన స్థలం కరెక్టుగా ఉండాల్సిందే. అప్పుడే అతడి జ్యోతిష్యాన్ని స్టడీ చేయడం వీలవుతుంది. సమయం తప్పయినా లేదంటే తేదీ కరక్టుగా లేకున్నా కచ్చితంగా చెప్పడం కుదరదు. అవి కచ్చితంగా ఇవ్వగలిగితే ఆ వ్యక్తి జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు, అలాగే భవిష్యత్ ను చివరకు మరణించే సమయం కూడా స్పష్టం చేయగలనని ధీమా వ్యక్తం చేశారు.

దురదృష్ట ఘటనలకు నివారణ ఉందా….
చాలామంది జ్యోతిష్యులు ఆ వ్యక్తి జీవితంలో కొన్ని గండాలు ఉన్నాయని చెబుతూ వాటికి నివారణగా పూజలు లేదంటే హోమాలు, ఇంకా తాము చూపించే నివారణ మార్గాలు పాటిస్తే అరికట్టవచ్చని చెబుతుండడం సహజంగా మనం చూస్తుంటాం. కానీ బాలు చెప్పేదేమిటంటే… వ్యక్తి అరచేతిలోని రేఖను మార్చడం ఎవ్వరి వల్ల కాదు. ఒక వ్యక్తి జీవితంలో ఆ దురదృష్టకర సంఘటన జరగాలని ఉంటే దాన్ని మనం మార్చలేం.

అదే విధంగా ఆయన చెప్పిన కొన్ని ఉదాహరణలేమిటంటే…. వ్యాపారంలో బాగా నష్టపోయిన వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి లక్కీ సంఖ్యలేమిటి … దురదృష్టాన్ని తెచ్చే సంఖ్యలేమిటి తదితరమైన వాటిని అతడి గత సంఘటనలను విశ్లేషించి తెలుసుకుంటాను. మాములుగా ఒక్కో వ్యక్తికి కొన్ని లక్కీ నంబర్లు (న్యూమరాలజీ) ఉంటాయి. ఆ తేదీల్లో కాకుండా నెగిటివ్ నంబర్లతో కూడిన తేదీల్లో చేసినప్పుడు నష్టమే జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల అనుభవంలో నా సలహా స్వీకరించి ప్రతీ ఒక్కరూ లాభపడ్డారు. అదే విధంగా దీర్ఘకాల రోగాలకు గురైన వారి కేసులను పూర్తిగా స్టడీ చేయడం, కేరీర్ కు సంబంధించిన తేదీలను నిర్ధారించడం లాంటివి కూడా అందిస్తారు. రోగాలకు సంబంధించి తాను మెడికల్ ఆస్ట్రాలజీ కూడా చూస్తున్నానని, ఇందులో సైతం తాను ఎంతో రీసెర్చ్ చేశానన్నారు. పిల్లలు పుట్టిన సంవత్సరం లోపు ఆ తర్వాత ఎదురవుతున్న వ్యాధులను స్టడీ చేసి క్యూరబుల్, ఇన్ క్యూరబుల్ డివిజన్ చేసి వాటిని చెప్పగలుగుతానని బాలు వివరించారు. మెడికల్ ఆస్ట్రాలజీకి సంబంధించి తనకు ఫేస్ బుక్ కూడా ఉందని (AstroMD-Balu munnangi) ఆసక్తి ఉన్నవారు దీన్ని పరిశీలించి తనను సంప్రదించవచ్చన్నారు.

పామిస్ట్రీ అనేది చాలా లోతైన సబ్జెక్టు. అందరూ సబ్జెక్టుపై కమాండ్ సంపాదించలేరు. అలా సంపాదించాలంటే తప్పకుండా సంవత్సరాల పరిశోధన, అనుభవం, నిరంతర శోధన చాలా అవసరం. అయితే బాలుకు మాత్రం పామిస్ట్రీనే అన్నీ. ఆయన అనునిత్యం దానిపై రీసెర్చ్ చేస్తుంటారు. ప్రముఖుల చేతి రేఖలను పరిశీలిస్తుండడం.. చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంతే కాకుండా ఈ రేఖలకు సంబంధించిన సమాచారమంతా ఆయనకు ఆ వ్యక్తికి తప్ప మరొకరితో ప్రస్తావించే వీలుండదు. స్వయంగా రాలేని వారు, విదేశాల్లో ఉండేవారు వాట్సాప్ లోనే ఆయనతో తమ జ్యోతిష్యాన్ని చెప్పించుకుంటుంటారు. ట్రంప్ రెండో భార్య మార్లా మాపల్స్, ఆమె కూతురు టిఫానీ ట్రంప్ ఇప్పటికీ వాట్సాప్ లో బాలుతో పామిస్ట్రీ గురించి చర్చిస్తుంటారు. ఈ సందర్భంగా వారు బాలును ప్రశంసిస్తూ వారి వెబ్ సైట్స్ లో వీడియోలు పోస్ట్ చేయడం విశేషం. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ తన “Shivaay” చిత్రం టైటిల్స్ లో బాలుకి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం మరో నిదర్శనం. ఇప్పటివరకు బాలు వద్ద పామిస్ట్రీ చెప్పించుకున్న వారిలో మాసిడోనియా మంత్రి గ్లిగోర్ తాస్కోవిచ్, మలేషియా మాజీ మంత్రి పళని వేల్, సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, దర్శకుడు ఓంరౌత్, లీనా యాదవ్, ఐక్యరాజ్యసమితి సభ్యుడు కునాల్ సూద్, తెలుగు దర్శకులు కృష్ణవంశీ, విష్ణువర్థన్, దశరథ్, వైవిఎస్ చౌదరి, హీరోయిన్స్… నయనతార, మెహ్రీన్ కౌర్, శ్వేతా నందితా, దీక్షా పంత్, అతిథి గౌతమ్, కళ్యాణి, హానీ గుప్తా, హీరోలు ఆకాశ్ పూరి, పంకజ్ కేసరి, బీహార్ డిఐజీ సునీల్ నాయక్, ఆంధ్రా ఎస్పీ ఉదయ్ భాస్కర్, నేవీ కమాండర్ వినోద్ మహాలింగం, రాజకీయ నాయకులు శ్రీధర్ బాబు, గండ్ర సత్యనారాయణ, జుగల్ కిశోర్(యుపి) టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ మీనా అయ్యర్, బాక్సాఫీసు ఇండియా ఎడిటర్ వజీర్ సింగ్… ఇలా బిగ్ సెలెబ్రిటీస్ జాబితా పెద్దగానే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here